- Home
- Entertainment
- Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ వార్.. చిచ్చు పెట్టిన కలెక్షన్లు, మొత్తం రచ్చ రచ్చ
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ వార్.. చిచ్చు పెట్టిన కలెక్షన్లు, మొత్తం రచ్చ రచ్చ
Chiranjeevi-Balakrishna Fans War:మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మరి దీనికి కారణం ఏంటి?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi - Balakrishna
Chiranjeevi-Balakrishna Fans War:మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య మంచి రిలేషనే ఉంటుంది. ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన వ్యక్తి, ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి ఒక్కరే అని బాలయ్య పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.
తాను కలిస్తే ఆయన ఒక్కరినే కలుస్తానని వెల్లడించారు. చిరు కూడా బాలయ్యకి అదేస్థాయిలో ప్రయారిటీ ఇస్తారు. మొన్న బాలకృష్ణ 50ఏళ్ల వేడుకకి కూడా గెస్ట్ గా వెళ్లారు చిరు. అలాగే ఫారెన్ లో జరిగిన ఈవెంట్‌లో కూడా బాలయ్య, చిరు కలుసుకున్నారు. ఒకేవేదికను పంచుకున్నారు.
Chiranjeevi - Balakrishna
కానీ ఇప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కొట్టుకుంటున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటున్నారు. ఈ క్రమంలో తమ హీరో గొప్ప అని చెప్పే క్రమంలో మరో హీరోపై విమర్శలు చేస్తున్నారు. అవమానకరమైన కామెంట్లు చేస్తున్నారు. కించపరిచే పోస్ట్ లో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Chiranjeevi - Balakrishna
బాలకృష్ణ ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్లు అందుకున్నారు. `అఖండ`తో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు `డాకు మహారాజ్` వరకు కొనసాగింది. నాలుగూ వంద కోట్లకుపైగా కలెక్షన్లు సాధించాయి. సీనియర్ హీరోల్లో ఈ ఘనత ఇప్పుడు ఏ హీరోకి లేదు.
దీంతో మా బాలయ్య తోపు అంటూ నందమూరి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో చిరంజీవిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మా కలెక్షన్లు ఒరిజినల్, రికార్డులు ఒరిజినల్ అనే వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు.
daaku maharaaj, waltair veerayya
దీనికి చిరంజీవి ఫ్యాన్స్ సైతం కౌంటర్లు వేస్తున్నారు. `డాకు మహారాజ్` మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కనీసం రూ.80కోట్ల షేర్ సాధించలేకపోయింది. బ్రేక్ ఈవెన్ కాలేదంటున్నారు.
నాలుగు సినిమాలు కూడా వంద కోట్ల షేర్ దాటలేకపోయాయని కౌంటర్లు వేస్తున్నారు. అలాగే `వాల్తేర్ వీరయ్య` వంద కోట్లకుపైగా షేర్ సాధించింది. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. బాలయ్య అభిమానులకు ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
waltair veerayya, daaku maharaaj
అంతటితో ఆగలేదు. `డాకు మహారాజ్`, `వాల్తేర్ వీరయ్య` సినిమాలకు ఒకే దర్శకుడు. రెండు సినిమాలు సంక్రాంతి సీజన్‌కే విడుదలయ్యాయి. `డాకు మహారాజ్`కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. రేటింగ్‌లు కూడా బాగానే ఉన్నాయి. కానీ చాలా రూ.80కోట్ల షేర్ సాధించలేకపోయిందని, అదే యావరేజ్ టాక్ తెచ్చుకున్న `వాల్తేర్ వీరయ్య` వంద కోట్లకుపైగా షేర్, 230కోట్ల గ్రాస్ సాధించిందని, అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని,
అది మా బాస్ పవర్ అంటూ ఎన్బీకే ఫ్యాన్స్ ని ఎటాక్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తంగా గత రెండు రోజులుగా ఈ ఇద్దరు సీనియర్ హీరోల అభిమానుల మధ్య సైలెంట్ వార్ నడుస్తూనే ఉంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
Balakrishna and Chiranjeevi
ఇక ఇప్పుడు బాలకృష్ణ `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బాలయ్య.
మరోవైపు చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సోషియో ఫాంటసీగా రూపొందుతుంది. ఇది ఈ సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాల కలెక్షన్ల విషయంలో ఈ ఇద్దరు సీనియర్ల అభిమానులు మరోసారి పోటీ పడే అవకాశం ఉంది. read more: మీ టీఆర్‌పీ స్టంట్స్ ఇకనైనా ఆపండి, `జబర్దస్త్` రష్మికి నెటిజన్లు కౌంటర్లు, ఏం జరిగిందంటే?
also read: శ్రీవిష్ణుతో వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. డైరెక్టర్, జోనర్ డిటెయిల్స్ నిజంగా క్రేజీ