- Home
- Entertainment
- Heroines: మహేష్ నుంచి ప్రభాస్ వరకు..షూటింగ్ స్టార్ట్ అయ్యాక హీరోయిన్లని మార్చేసి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Heroines: మహేష్ నుంచి ప్రభాస్ వరకు..షూటింగ్ స్టార్ట్ అయ్యాక హీరోయిన్లని మార్చేసి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Heroine Replacements: షూటింగ్ మొదలయ్యాక హీరోయిన్లని మార్చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి, ఆ హీరోయిన్లు ఎవరు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Heroines
ఒక సినిమాకు కొందరు హీరోయిన్లని అనుకుని ఫైనల్ గా ఒకరిని ఎంపిక చేస్తుంటారు. కానీ హీరోయిన్ ని ఎంపిక చేసి షూటింగ్ మొదలయ్యాక కూడా మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి హీరోల సినిమాల్లో షూటింగ్ స్టార్ట్ చేశాక హీరోయిన్లని మార్చేశారు. ఆ హీరోయిన్లు ఎవరు.. ఆ సినిమాల రిజల్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
మిస్టర్ పర్ఫెక్ట్
ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా కాజల్, తాప్సి నటించారు. ముందుగా రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ ఆమె సన్నివేశాలు అనుకున్నట్లు రావట్లేదు అని రకుల్ ప్లేస్ లో కాజల్ ని తీసుకున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
మహా సముద్రం
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంతని హీరోయిన్ గా అనుకున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ ప్రారంభమయ్యే దశలో సమంతని పక్కన పెట్టి అదితి రావు హైదరిని తీసుకున్నారు. కారణాలు ఏవైనా సినిమా మాత్రం డిజాస్టర్ అయింది.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఎంపిక చేశారు. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు. షూటింగ్ కూడా కొంత భాగం జరిగింది. కానీ అనుకోకుండా పూజా హెగ్డేని తప్పించి మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. దీనితో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
కింగ్డమ్
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముందుగా శ్రీలీలని హీరోయిన్ గా అనుకున్నారు. షూటింగ్ కూడా మొదలైంది. కానీ కొన్ని విభేదాల కారణంగా శ్రీలీలని పక్కన పెట్టి భాగ్యశ్రీని తీసుకున్నారు. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
రాబిన్ హుడ్
భీష్మ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నితిన్.. అదే దర్శకుడు వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ అనే మూవీ చేశారు. భీష్మలో నటించిన రష్మికనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. అనౌన్సమెంట్ గా ప్రమోషనల్ వీడియో కూడా చేశారు. కానీ కొన్ని విభేదాల కారణంగా రష్మిక ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీనితో శ్రీలీలని తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది.
లెనిన్
అఖిల్ అక్కినేని లెనిన్ చిత్రంతో తొలి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించాల్సింది. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. కానీ అనుకోకుండా ఆమెని తప్పించి భాగ్యశ్రీని తీసుకున్నారు.













