MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన

Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన

సీనియర్‌ నటి సురేఖా వాణి ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. త్వరలో అమ్మకి రెండో పెళ్లి చేయబోతున్నట్టు తెలిపింది కూతురు సుప్రీత. కానీ ప్రస్తుతం ఆమె సినిమా ఆఫర్లు లేక ఖాళీగానే ఉంటుందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 09 2026, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆఫర్స్ లేక ఖాళీ సురేఖా వాణి
Image Credit : X/@_supritha_9

ఆఫర్స్ లేక ఖాళీ సురేఖా వాణి

సీనియర్‌ నటి సురేఖా వాణి ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు లేక ఖాళీగానే ఉంటుంది. ఆ మధ్య ఒకటి అర చిత్రాల్లో మెరిసిన ఆమె ఇప్పుడు కనిపించడమే లేదు. ఈ విషయాన్ని ఆమె కూతురు సుప్రీతనే తెలిపింది. అమ్మకి ఇప్పుడు సినిమా అవకాశాలు రావడం లేదని, ఏడాదిన్నరగా మేకప్‌ వేసుకోలేదని, ఒక్క ఛాన్స్ కూడా లేదని తెలిపింది. అమ్మ పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
సురేఖా వాణి రెండో పెళ్లి
Image Credit : social media

సురేఖా వాణి రెండో పెళ్లి

ఈ క్రమంలో అమ్మ సురేఖా వాణికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది సుప్రీత. తన తల్లికి రెండో పెళ్లి చేయాలనుకుంటుందట. 2019లోనే సురేఖా వాణి భర్త సురేష్‌ తేజ అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఆమె ఒంటరిగానే ఉంది. మరో పెళ్లి చేసుకోలేదు. కూతురు కెరీర్‌ని సెట్‌ చేసే పనిలో ఉంది. అదే సమయంలో ఎంతో మనో వేదన అనుభవించింది. ఫ్యామిలీ వారి నుంచే విమర్శలను ఎదుర్కొంది. కొంత ట్రోల్స్ కి గురయ్యింది సురేఖా వాణి.

Related Articles

Related image1
Prithveeraj: పది లక్షల ఇంటి కోసం 10000 కోట్ల ఆస్తి వదులుకున్న నటుడు.. కొంప ముంచిన డ్రైవర్‌ సలహా
Related image2
Naga Chaitanya: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్‌పైనే క్రష్‌.. తన ఫస్ట్ క్రష్‌ రివీల్‌ చేసిన నాగచైతన్య
35
అమ్మకి మరో లైఫ్‌ ఇవ్వాలని కూతురు ప్లాన్‌
Image Credit : our own

అమ్మకి మరో లైఫ్‌ ఇవ్వాలని కూతురు ప్లాన్‌

భర్త మరణంతో సురేఖా వాణి చాలా డౌన్‌ అయిపోయింది. మరోవైపు సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. దీంతో కూతురే ప్రపంచంగా బతికేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు సురేఖా వాణికి పెళ్లి చేయాలనుకుంటుంది సుప్రీత. అమ్మకి రెండో పెళ్లి చేయాలని అనుకుంటుందట. ఈ విషయాన్ని ఆమెతో చెప్పగా, తాను నాన్నతోనే ఆగిపోవాలని, మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని తెలిపిందట.

45
తన మ్యారేజ్‌కి ముదే అమ్మకి పెళ్లి చేస్తా
Image Credit : our own

తన మ్యారేజ్‌కి ముదే అమ్మకి పెళ్లి చేస్తా

అయితే తాను మ్యారేజ్‌ చేసుకునే ముందు అయినా అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుందట. ఇప్పుడు అదే పనిలో ఉందట. సరైన వ్యక్తి దొరకాలని, అమ్మని బాగా చూసుకోవాలని, ఆమెకి అండగా నిలబడాలి, ఆమెకి ఫ్రీడమ్‌ ని ఇచ్చే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి కోసం చూస్తున్నట్టు తెలిపింది సుప్రీత. అమ్మ ఇప్పుడు మ్యారేజ్‌ కి రెడీగా లేదని, కానీ తాను పెళ్లి చేసుకునే ముందు అయినా ఆమెకి రెండో మ్యారేజ్‌ చేస్తానని తెలిపింది. ఈ విషయంలో అమ్మ తరఫున మామయ్యతో కూడా మాట్లాడిందని, వాళ్లు కూడా ఓకే చెప్పినట్టు వెల్లడించింది సుప్రీత.

55
సుప్రీత డెబ్యూ మూవీ `అమరావతికి ఆహ్వానం`
Image Credit : our own

సుప్రీత డెబ్యూ మూవీ `అమరావతికి ఆహ్వానం`

సురేఖా వాణి కూతురు సుప్రీత నటిగా ఎంట్రీ ఇస్తూ `అమరావతికి ఆహ్వానం` అనే చిత్రంలో నటించారు. శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్‌, సుప్రీత ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహించారు. కేఎస్‌ శంకర్రావు, ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా ఆకట్టుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే సుప్రీత ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి సురేఖా వాణికి రెండో పెళ్లి చేయబోతుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Related Stories
Recommended image1
Prithveeraj: పది లక్షల ఇంటి కోసం 10000 కోట్ల ఆస్తి వదులుకున్న నటుడు.. కొంప ముంచిన డ్రైవర్‌ సలహా
Recommended image2
Naga Chaitanya: తండ్రి రొమాన్స్ చేసిన హీరోయిన్‌పైనే క్రష్‌.. తన ఫస్ట్ క్రష్‌ రివీల్‌ చేసిన నాగచైతన్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved