మీరు మీ లవర్స్ తో ఫస్ట్ టైమ్ డేట్‌కి వెళితే, ఆ డేట్‌ని మరింత స్పెషల్‌గా మార్చేందుకు కొన్ని అద్భుతమైన రొమాంటిక్ సినిమాలున్నాయి. ఈ సినిమాలు మీ బంధాన్ని మరింత అందంగా మారుస్తాయి.
ఇది హాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్. మర్చిపోలేని ప్రేమ, విధి రాతల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మనసును హత్తుకునే ప్రేమకథలు ఇష్టపడే జంటలకు ఇది బెస్ట్ ఛాయిస్.
నటి కావాలనుకునే అమ్మాయి, ఒక జాజ్ మ్యూజిషియన్ మధ్య నడిచే సరికొత్త మ్యూజికల్ లవ్ స్టోరీ. విజువల్‌గా, ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. రొమాన్స్, ఫాంటసీ, అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుంది.
గ్లామర్, ఫ్యామిలీ డ్రామా, కడుపుబ్బా నవ్వించే కామెడీ కలగలిసిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఇది. సరదా సన్నివేశాలు, సున్నితమైన రొమాన్స్ ఉండటంతో ఫస్ట్ డేట్‌కు ఇది పర్ఫెక్ట్ మూవీ.
మీకు జర్నీ లోతైన మాటలను ఇష్టపడితే 'బిఫోర్ సన్‌రైజ్' తప్పక చూడాలి. వియన్నాలో ఇద్దరు అపరిచితులు ఒక రాత్రి గడుపుతారు. ఆ రాత్రంతా వారి మధ్య జరిగే సంభాషణ, కెమిస్ట్రీనే ఈ మూవీ.
మంచి రొమాంటిక్ కామెడీ చిత్రమిది. చాలా స్వీట్‌గా, ఫన్నీగా, ఆకట్టుకునేలా ఉంటుంది. అనామక ఈమెయిల్స్ ద్వారా ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ స్లో బర్న్ రొమాన్స్‌ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.
ఈ లైట్ టీన్ రొమాంటిక్-కామెడీ ఫస్ట్ డేట్‌లో క్యాజువల్‌గా చూడటానికి చాలా బాగుంటుంది. ఇది సరదాగా, ఆకర్షణీయంగా, ఎన్నో అందమైన క్షణాలతో నిండి ఉంటుంది.
ఇది అధికారికంగా లవ్ స్టోరీ కాకపోయినా, 'చెఫ్' సినిమా ప్రేమ, కుటుంబం, ఆహారం చుట్టూ తిరుగుతుంది. ఈ మూడు అద్భుతంగా మిక్స్ అయ్యి ఉంటాయి. ఇది మనసును హాయిగా మార్చే ఫీల్ గుడ్ మూవీ.