MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Supritha: ఎంట్రీతోనే భయపెట్టబోతున్న సురేఖ వాణి కూతురు.. ఎస్తర్‌, సుప్రీత, ధన్య కలిసి హర్రర్‌ మూవీ

Supritha: ఎంట్రీతోనే భయపెట్టబోతున్న సురేఖ వాణి కూతురు.. ఎస్తర్‌, సుప్రీత, ధన్య కలిసి హర్రర్‌ మూవీ

సురేఖ వాణి కూతురు సుప్రీత, ఎస్తర్‌, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ `అమరావతికి ఆహ్వానం`. ఈ మూవీతో భయటపెట్టేందుకు వస్తున్నా గ్లామర్‌ గర్ల్స్. ఆ విశేషాలు ఏంటంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 27 2025, 06:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీరోయిన్‌గా సురేఖ వాణి కూతురు సుప్రీత
Image Credit : X/@_supritha_9

హీరోయిన్‌గా సురేఖ వాణి కూతురు సుప్రీత

సురేఖ వాణి సీనియర్‌ నటిగా రాణిస్తోంది. ఇప్పుడు ఆమెకి సినిమాలు తగ్గాయి, కానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఆమె చేసే రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు అయితే తనకు సినిమాలు తగ్గినా, కూతురుని మాత్రం హీరోయిన్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆమె హీరోయిన్‌గా బిగ్‌ బాస్‌ అమర్‌ దీప్‌ హీరోగా  `చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి` అనే మూవీ రూపొందుతుంది. దీంతోపాటు మరో హర్రర్‌ మూవీ `అమరావతికి ఆహ్వానం` చేస్తోంది. క్రిస్మస్‌ సందర్భంగా దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చారు. కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హర్రర్‌ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత
Image Credit : Asianet News

హర్రర్‌ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత

హర్రర్‌ థ్రిల్లర్‌గా `అమరావతికి ఆహ్వానం`  చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సుప్రీతతోపాటు శివ కంఠమనేని, ఎస్తర్‌, ధన్య బాలకృష్ణ, హరీష్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. జీవీకే దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు  నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో ధన్యబాలకృష్ణ యాక్షన్‌ అరాచకంలా ఉంది. భయపెట్టించేలా ఉంది.

34
సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌గా `అమరావతికి ఆహ్వానం`
Image Credit : Asianet News

సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌గా `అమరావతికి ఆహ్వానం`

ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా గురించి హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన మా టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ప‌లు లొకేష‌న్స్‌లో షూటింగ్ పూర్తి చేశాం. ద‌ర్శ‌కుడు జీవికే త‌న విజ‌న్ తో ఈ సినిమాకు మంచి ఔట్‌పుట్ తీసుకువ‌చ్చారు. అన్ని పాత్ర‌ల‌కి ప్రాధాన్య‌త ఉండేలా మంచి క‌థతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్ర‌స్తుతం వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ని సీట్ ఎడ్జ్ హర్రర్‌ థ్రిల్ల‌ర్ అనుభూతినిస్తుంది. అతి త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం` అని అన్నారు.

44
త్వరలో ఆడియెన్స్ ముందుకు సుప్రీత హర్రర్‌ మూవీ
Image Credit : Asianet News

త్వరలో ఆడియెన్స్ ముందుకు సుప్రీత హర్రర్‌ మూవీ

ద‌ర్శ‌కుడు జివికె మాట్లాడుతూ , `ఈ మ‌ధ్య కాలంలో రిలీజైన అన్ని హార‌ర్ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్‌ హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాశంతో వ‌స్తోన్న చిత్రం `అమ‌రావ‌తికి ఆహ్వానం`. మంచి ఆర్టిస్టుల‌తో పాటు ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌, క‌థ‌నంతో ఈ సినిమా తెర‌కెక్కింది. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌ జె ప్రభాక‌ర్ రెడ్డి విజువ‌ల్స్, హ‌నుమాన్ ఫేమ్ సాయిబాబు త‌లారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. పద్మ‌నాబ్ బ‌ర‌ద్వాజ్  సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేట‌ర్స్‌లో ఆడియెన్స్‌ని హార‌ర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది` అని వెల్లడించారు. మొత్తంగా సుప్రీత ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాతో వచ్చే ఏడాది సందడి చేయబోతుందని చెప్పొచ్చు. అమర్‌ దీప్‌తో కలిసి నటిస్తున్న మూవీ కూడా వచ్చే ఏడాది ఆడియెన్స్‌ ముదుకు రాబోతుంది. ముందుగా `అమరావతికి ఆహ్వానం` విడుదల కాబోతున్న నేపథ్యంలో సుప్రీత హీరోయిన్‌గా ఎంట్రీతోనే భయపెట్టించబోతుండటం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Related Stories
Recommended image1
Anchor Rashmi కొత్త కండీషన్స్.. ఈ విషయంలో అందరికి అనుమతి లేదంట
Recommended image2
Sivaji: ప్రతి మాటకు ఓ కారణం ఉంటుంది.. ప్లీజ్‌ పర్సనల్‌ విషయాల జోలికి వద్దంటూ శివాజీ హెచ్చరిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved