- Home
- Entertainment
- రాజశేఖర్‌కి పోటీగా వచ్చి డిజాస్టర్ అయిన సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఏంటో తెలుసా? కోలుకోలేని దెబ్బ
రాజశేఖర్‌కి పోటీగా వచ్చి డిజాస్టర్ అయిన సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఏంటో తెలుసా? కోలుకోలేని దెబ్బ
రాజశేఖర్ ఒకప్పుడు స్టార్ హీరోగా టాలీవుడ్‌ని షేక్ చేశారు. చిరు, బాలయ్య వంటి వారికి పోటీ ఇచ్చారు. ఓ సినిమా విషయంలో రాజశేఖర్ మూవీతో పోటీపడి సూపర్ స్టార్ కృష్ణ బోల్తా పడ్డారు.

రాజశేఖర్‌తో పోటీగా సూపర్ స్టార్ కృష్ణ మూవీ
హీరో రాజశేఖర్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. చిరంజీవి, బాలయ్య వంటి టాప్ హీరోలకు ఆయన పోటీ ఇచ్చారు. ఓ సందర్భంలో వీరిని మించిన విజయాలను అందుకున్నారు. తిరుగులేని స్టార్‌గా రాణించారు. బాక్సాఫీసుని కూడా షేక్ చేశారు.
తనకు పోటీగా వచ్చిన ఇతర హీరోల సినిమాలను బోల్తా కొట్టించి రాజశేఖర్ మూవీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అలా సూపర్ స్టార్ కృష్ణ కూడా ఓ సారి రాజశేఖర్‌తో పోటీపడి డిజాస్టర్‌ని చవి చూశారు. ఆ కథేంటో తెలుసుకుందాం.
90లో కెరీర్ పరంగా పీక్‌లో రాజశేఖర్
1984లో రాజశేఖర్ ఇండస్ట్రీలోకి వచ్చారు. హీరోగా నిలబడటానికి రెండుమూడేళ్లు పట్టింది. నెమ్మదిగా తనని తాను నిరూపించుకుంటూ విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. 1990లో రాజశేఖర్ కెరీర్ పీక్‌లో ఉంది. వరుసగా ఆయనకు బ్లాక్ బస్టర్స్ పడ్డాయి.
అందుకే అప్పట్లో రాజశేఖర్ జోరు చూసి మిగిలిన పెద్ద హీరోలు కూడా టెన్షన్ పడ్డారు. చాలా మంది టాప్ స్టార్స్ ఆయన వణుకు పుట్టించారంటే అతిశయోక్తి కాదు. మాస్, యాక్షన్ సినిమాలతో యాంగ్రీ మేన్‌గా పేరుతెచ్చుకున్నారు రాజశేఖర్.
సంచలనం సృష్టించిన రాజశేఖర్ `అన్న` మూవీ
ఈ క్రమంలో 1994లో `అన్న` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు రాజశేఖర్. ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి పోకూరి బాబురావు నిర్మాత.
ఇందులో గౌతమి, రోజా హీరోయిన్లుగా నటించారు. బాలాదిత్య బాలనటుడిగా నటించారు. బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో బ్రహ్మీ రోల్ ఎమోషనల్‌గా ఉంటుంది.
ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బాక్సాఫీసుని షేక్ చేసింది. సమ్మర్ స్పెషల్‌గా వచ్చిన రాజశేఖర్ గత చిత్రాలను రికార్డులను బ్రేక్ చేసింది. థియేటర్లలో రచ్చ చేసింది.
`అన్న`కి పోటీగా విడుదలైన మూవీ `ఘారానా అల్లుడు`
ఈ మూవీకి పోటీగా అదే రోజు వచ్చిన చిత్రం `ఘారానా అల్లుడు`. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, కన్నడ నటి మాలాశ్రీ హీరోయిన్‌గా నటించింది. ముప్పలనేని శివ దర్శకుడిగా పరిచయం అయ్యారు. విలేజ్ ఫ్యామిలీ డ్రామాగానే వచ్చిన చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది.
రొటీన్ కంటెంట్ కావడంతో ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ ఆట బాగున్నాసాయంత్రానికి డీలా పడిపోయింది. సూపర్ స్టార్ కి ఈ మూవీ రిజల్ట్ అర్థమైపోయింది.
ఈ మూవీ తర్వాత కృష్ణ కోలుకోలేకపోయారు. వరుసగా ఆ ఏడాది మొత్తం పరాజయాలే చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన `అమ్మ దొంగ` రిలీఫ్‌నిచ్చింది.
రాజశేఖర్‌తో పోటీ పడి డిజాస్టర్ చవిచూసిన కృష్ణ
రాజశేఖర్ నటించిన `అన్న` మూవీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా విశేష ఆదరణ పొందింది. తమ్ముడి సెంటిమెంట్ హైలైట్‌గా నిలిచింది. దీంతో జనం ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.
అంతకు ముందే `నెంబర్ వన్` సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కృష్ణ ఆ క్రేజ్, ఆ జోరు `ఘారానా అల్లుడు` విషయంలో పనిచేయలేదు. అదే సమయంలో రాజశేఖర్ `అన్న` ముందు నిలబడలేదు.
దీంతో సూపర్‌స్టార్ దారుణంగా దెబ్బతిన్నాడు. ఇక అప్పట్నుంచి రాజశేఖర్ దాదాపు `గోరింటాకు`(2008) వరకు మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఆడలేదు.
చాలా ఏళ్ల తర్వాత `గరుడవేగ`తో హిట్ అందుకున్నా, ఆ తర్వాత చిత్రాలు కూడా ఆడకపోవడంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య `ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్` చిత్రంలో ముఖ్య పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.