- Home
- Entertainment
- బాలకృష్ణ ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా మారిన మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి తండ్రి ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్
బాలకృష్ణ ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా మారిన మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి తండ్రి ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్
నందమూరి బాలకృష్ణ `నర్తనశాల` చిత్రంతో దర్శకుడిగా మారారు. కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. అయితే అంతకు ముందే ఆయన డైరెక్షన్ చేశారు. ఆ కథేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

దర్శకుడిగా బాలయ్య
బాలకృష్ణ సక్సెస్ పరంగా ఇప్పుడు సీనియర్ హీరోల్లో టాప్‌లో ఉన్నారు. ఆయన వరుసగా నాలుగు విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు `అఖండ 2`తో మరో హిట్‌కి రెడీ అవుతున్నారు.
అయితే బాలయ్య దర్శకత్వం వహించాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఆయన తన కొడుకు మోక్షజ్ఞ మూవీని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు. `ఆదిత్య 999` సినిమాని రూపొందిస్తానని ఆ మధ్య `అన్ స్టాపబుల్` షోలో తెలిపిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇందులో తాను కూడా నటించబోతున్నట్టు తెలిపారు. మోక్షజ్ఞ రెండో మూవీగానో, మూడో చిత్రంగానో ఇది ఉండబోతుందన్నారు. ఇదే వర్కౌట్ అయితే బాలయ్య ప్రాపర్‌గా దర్శకుడిగా మారబోతున్న సినిమా ఇదే అవుతుంది.
`నర్తనశాల` సినిమాని డైరెక్ట్ చేసిన బాలయ్య
కానీ బాలకృష్ణ అంతకు ముందే దర్శకుడిగా మారారు. `నర్తనశాల` చిత్రాన్ని ఆయనే రూపొందించారు. కానీ అది ప్రారంభ దశలోనే ఆగిపోయింది. సౌందర్య మరణించడంతో ఈ మూవీని ఆపేసినట్టు తెలుస్తుంది.
కానీ సుమారు 28 ఏళ్ల క్రితమే బాలయ్య మరో సినిమాని డైరెక్ట్ చేశారు. తాను ద్విపాత్రాభినయం చేసిన `పెద్దన్నయ్య` చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఇందులో ఆయన కొంత పార్ట్ కి డైరెక్ట్ చేయడం విశేషం.
ఉమ్మడి కుటుంబ విలువలను తెలియజేసే `పెద్దనయ్య` మూవీ
1997లో విడుదలైన `పెద్దన్నయ్య` సినిమాని ఆయనే డైరెక్ట్ చేశాడట. దీనికి శరత్ దర్శకుడు. బాలయ్యని ఎక్కువగా డైరెక్ట్ చేసింది ఈ దర్శకుడే. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఆయనకు జోడీగా రోజా, ఇంద్రజ నటించారు.
ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో ఉమ్మడి కుటుంబం గొప్పతనం చెప్పారు. ఇందులో కుటుంబ పెద్దగా బాలయ్య నటన అదిరిపోయింది. ఇందులో ఆయన నటన ఎన్టీఆర్‌ని గుర్తు చేయడం విశేషం.
`పెద్దనయ్య` మూవీలో క్లైమాక్స్ డైరెక్ట్ చేసిన బాలయ్య
అయితే ఈ సినిమాలో బాలయ్య క్లైమాక్స్ పార్ట్ మొత్తం డైరెక్ట్ చేశాడట. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఆయన చూసుకున్నాడట. రోజాతో చివర్లో వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు, రోజా చనిపోయే సీన్లు ఇలా మొత్తం బాలకృష్ణ నే డైరెక్ట్ చేశాడట.
ఈ సినిమా క్లైమాక్స్ వల్లే వంద రోజులు ఆడిందని, పెద్ద హిట్ అయ్యిందని తెలిపారు బాలయ్య. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య విషయన్ని బయటపెట్టారు. తనకు సోషల్ సినిమాలు చేయడం రాదని, లార్జర్ దెన్ లైఫ్, పౌరాణికాలు మాత్రమే డైరెక్ట్ చేయగలను అని తెలిపారు బాలయ్య.
తండ్రి ఎన్టీఆర్ మూవీ రికార్డులు బ్రేక్ చేసిన `పెద్దన్నయ్య`
1997లో జనవరి 10 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 34 సెంట్లలో వంద రోజులు ఆడింది. గుంటూరులోని ఆరు సెంటర్లలో నాలుగు షోలతో వంద రోజులు ఆడింది.
ఇదే సెంటర్‌లో కన్టీఆర్ నటించిన `కొండవీటి సింహం` మూవీ ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడిన చిత్రంగా రికార్డుని సృష్టించింది. అయితే అది రోజుకు మూడు ఆటలే ఆడింది. కానీ నాలుగు ఆటలతో `పెద్దన్నయ్య` వంద రోజులు ప్రదర్శించబడటంతో నాన్న ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేశారు కొడుకు బాలయ్య.
అంతేకాదు చాలా సెంటర్లలో ఇది ఆల్ టైమ్‌రికార్డ్ వసూళ్లని రాబట్టడం విశేషం. బాలయ్య ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటిశ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.