MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌

Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌

చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో `గ్యాంగ్‌ లీడర్‌` సినిమా ఒకటి. ఈ చిత్రంతో పోటీ పడి సూపర్‌ స్టార్‌ కృష్ణ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు చిత్తైపోయారు. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 09 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిరంజీవి కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ మూవీ `గ్యాంగ్‌ లీడర్‌`
Image Credit : book my show

చిరంజీవి కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ మూవీ `గ్యాంగ్‌ లీడర్‌`

చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇండస్ట్రీ హిట్స్ అందించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. చిరంజీవిని సూపర్‌ స్టార్‌ని చేసిన చిత్రాల్లో `గ్యాంగ్‌ లీడర్‌` మూవీ స్థానం ప్రత్యేకం. ఇందులో చిరంజీవి నటన, డైలాగ్‌లు, పాటలు, ఫైట్స్, కామెడీ వంటివన్నీ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించాయి. థియేటర్లు ఊగిపోయేలా చేశాయి. చిరు కూడా రెచ్చిపోయి నటించిన చిత్రాల్లో ఇదొకటని చెప్పొచ్చు. మెగాస్టార్‌ నటన, మ్యానరిజం గురించి చెప్పుకోవాల్సి వస్తే, ముందుగా `గ్యాంగ్‌ లీడర్‌` పేరునే చెబుతారు. ఈ మూవీ రిలీజ్‌ అయి నేటికి 35ఏళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమాతో పోటీ పడి చిత్తైపోయిన సినిమాలేంటో తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఇండస్ట్రీ హిట్‌గా `గ్యాంగ్‌ లీడర్‌`
Image Credit : youtube/volga video

ఇండస్ట్రీ హిట్‌గా `గ్యాంగ్‌ లీడర్‌`

చిరంజీవి హీరోగా వచ్చిన `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రానికి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. ఇందులో ఆయనకు జోడీగా విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరీ నిర్మించారు. ఈ సినిమా 1991 మే 9న విడుదలైంది. మెగాస్టార్‌ కెరీర్‌లో ఇదొక ఐకానిక్‌ రిలీజ్‌ డేట్‌గా చెప్పొచ్చు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనంగా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటిని బ్రేక్‌ చేసింది. అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో ఇది పది కోట్ల వసూళ్లని సాధించడం విశేషం. ఆ తర్వాత ఇదే సినిమాని `ఆజ్‌ కా గూండా రాజ్‌` పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్‌ అయ్యింది.

Related Articles

Related image1
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Related image2
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
34
గ్యాంగ్‌లీడర్‌తో పోటీలో డీలా పడ్డ ఇంద్రభవనం
Image Credit : x/@superstarkrishnafans

గ్యాంగ్‌లీడర్‌తో పోటీలో డీలా పడ్డ ఇంద్రభవనం

చిరంజీవి `గ్యాంగ్‌ లీడర్‌`తో సూపర్‌స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు పోటీ పడ్డారు. వీరిద్దరు కలిసి `ఇంద్ర భవనం` అనే చిత్రంలో నటించారు. ఈ మూవీకి కృష్ణ దర్శకుడు కావడం విశేషం. ఆయనే ఎడిటర్‌ కూడా. మీనా, జ్యోతి వంటి వారు నటించారు. ఇది `స్వాగ్‌` అనే హిందీ మూవీకి రీమేక్‌. గ్యాంగ్‌ లీడర్‌కి సరిగ్గా ఆరు రోజుల ముందు ఈ సినిమా విడుదలయ్యింది. మిశ్రమ స్పందనతో థియేటర్లో ఆడుతున్న ఈ సినిమాని చిత్తు చేసింది చిరు గ్యాంగ్‌ లీడర్‌. ఆడియెన్స్ మొత్తం `గ్యాంగ్‌ లీడర్‌`కి క్యూ కట్టడంతో సూపర్‌స్టార్‌, రెబల్‌ స్టార్‌ కలిసి నటించిన సినిమాని ఆడియెన్స్ పట్టించుకోలేదు, దీంతో ఇది డిజాస్టర్‌గా నిలిచింది.

44
గ్యాంగ్‌లీడర్‌ని తట్టుకున్న రాజేంద్రప్రసాద్‌
Image Credit : cinema adda

గ్యాంగ్‌లీడర్‌ని తట్టుకున్న రాజేంద్రప్రసాద్‌

ఇక `గ్యాంగ్‌ లీడర్‌` వచ్చిన ఒక్క రోజు గ్యాప్‌తో రాజేంద్రప్రసాద్‌ నటించిన `ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌` అనే చిత్రం కూడా విడుదలయ్యింది. మే 10న ఈ కామెడీ సినిమా రిలీజ్ అయ్యింది. దీనికి రేలంగి నరసింహారావు దర్శకుడు. రాజేంద్రప్రసాద్‌కి జోడీగా, దివ్యవాణి, పూజిత, అనుష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మాత్రం ఫర్వాలేదనిపించుకుంది. కామెడీ సినిమా కావడంతో `గ్యాంగ్‌ లీడర్` ఓవర్‌ ఫ్లో దీనికి హెల్ప్ అయ్యింది. డీసెంట్‌గా ఆడింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణ ఘట్టమనేని
కృష్ణంరాజు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image3
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Related Stories
Recommended image1
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image2
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved