MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక

Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ నేడు తన 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా ఆయన జీవితంలోని ఒక స్పెషల్‌ లేడీ గురించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 09 2026, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్‌ దేవరకొండ కెరీర్‌పై లేడీ ఆందోళన
Image Credit : Asianet News

విజయ్‌ దేవరకొండ కెరీర్‌పై లేడీ ఆందోళన

విజయ్‌ దేవరకొండ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా నిలబడ్డాడు. స్టార్‌ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్‌ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. బాక్సాఫీస్‌ని షేక్‌ చేయగలిగే చిత్రాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్‌ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విజయ్‌ కెరీర్‌ గురించి ఆందోళన చెందిన ఒక లేడీ గురించి తెలిసింది. తండ్రి సక్సెస్‌ కాలేదు, కొడుకు ఏమైపోతాడో ఏంటో ఎప్పుడూ బాధపడిందట. ఆమె విజయ్‌ లైఫ్‌లో చాలా స్పెషల్‌ అని, పెళ్లి అయిన తర్వాత విజయ్‌, రష్మిక ఆమె సమాధికి వెళ్లారట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
పుట్టపర్తిలో చదువుకున్న విజయ్‌ దేవరకొండ
Image Credit : Asianet News

పుట్టపర్తిలో చదువుకున్న విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ పుట్టపర్తిలో చదువుకున్నాడు. 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత సిటీకి వచ్చాడు. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తి చూపించాడట. థియేటర్‌ కూడా చేశాడట.  నాటకాలు కూడా ప్రదర్శించాడు. పలు ఇంగ్లీష్‌ నాటకాలు కూడా ప్రదర్శించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడట. అనంతరం ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోయినా ఇండస్ట్రీలో తిరిగి అవకాశాలు దక్కించుకున్నాడని తెలిపారు విజయ్‌ దేవరకొండ మేనమామ, నిర్మాత యష్‌ రంగినేని. ఆయన `పెళ్లి చూపులు` సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Related Articles

Related image1
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Related image2
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
35
విజయ్‌ కెరీర్‌ గురించి ఆందోళన చెందిన అమ్మమ్మ
Image Credit : youtube print shot/Sithara Entertainments

విజయ్‌ కెరీర్‌ గురించి ఆందోళన చెందిన అమ్మమ్మ

విజయ్‌ దేవరకొండ సొంతంగా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడని, హీరోగా రాణించాలని కోటి మంది ప్రయత్నిస్తే, ఒక్కరు సక్సెస్‌ అవుతారు. ఆ ఒక్కరు విజయ్‌ అని, అతని సక్సెస్‌ వెనుక చాలా స్ట్రగుల్‌ ఉందని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్థన్‌ కూడా సినిమాల్లోనే ఉన్నాడు. దర్శకుడిగా రాణించాలని ఎంతో ప్రయత్నించారు. సీరియల్స్ కూడా చేశాడు. కానీ సక్సెస్‌ కాలేకపోయారు. ఆ సమయంలోనే విజయ్‌ దేవరకొండ అమ్మమ్మ, యష్‌ రంగినేని అమ్మ చాలా బాధపడిందట.

45
పెళ్లి తర్వాత అమ్మమ్మ ఆశీస్సులు తీసుకున్న విజయ్
Image Credit : Asianet News

పెళ్లి తర్వాత అమ్మమ్మ ఆశీస్సులు తీసుకున్న విజయ్

తండ్రి సక్సెస్‌ కాలేదు, కొడుకు అయినా సక్సెస్‌ అవుతాడా? ఫ్యామిలీని గట్టెక్కిస్తాడా అని ఎంతో ఆందోళన చెందేదట. ఎప్పుడు విజయ్‌ గురించి ఆలోచించేదట. సొంత పేరెంట్స్ కంటే అమ్మమ్మకే విజయ్‌ పై ఎక్కువగా ప్రేమ ఉండేదని, సినిమాల్లో సక్సెస్‌ కావాలని తపించేదట. కానీ విజయ్‌ సక్సెస్‌ ని ఆమె చూడలేకపోయిందని, హీరోగా సక్సెస్‌ అయ్యే లోపే ఆమె వెళ్లిపోయిందని వెల్లడించారు యష్‌ రంగినేని. అందుకే అమ్మమ్మపై విజయ్‌కి ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉంటుందని తెలిపారు. పెళ్లి అయిన తర్వాత సొంతూరుకి వెళ్లి వ్రతం కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఎవరికీ తెలియకుండా రహస్యంగా కేవలం ఫ్యామిలీ వరకే వెళ్లి అమ్మమ్మ సమాధిని సందర్శించి, గ్రాండ్‌ పేరెంట్స్ ఆశిస్సులు తీసుకున్నాడట విజయ్‌ దేవరకొండ.

55
విజయ్‌ దేవరకొండ చేస్తున్న సినిమాలు
Image Credit : our own

విజయ్‌ దేవరకొండ చేస్తున్న సినిమాలు

విజయ్‌ దేవరకొండ నేడు తన 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విజయ్‌ ప్రస్తుతం `రణబాలి` చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌. దీంతోపాటు రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్థన్‌` మూవీలో నటిస్తున్నాడు. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్. అలాగే ఇటీవలే `హాయ్‌ నాన్న` ఫేమ్‌ శౌర్యువ్‌ దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రారంభించారు. వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో అలరించేందుకు వస్తున్నారు. `రణబాలి` మూవీ సెప్టెంబర్‌ లో విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Recommended image2
Murali Mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లి అంటే జీవితం నాశనమే..హీరోకి నిర్మాత వార్నింగ్, భార్య రియాక్షన్ ఇదే
Recommended image3
Sai Pallavi: ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image2
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved