- Home
- Entertainment
- OTT Movies: ఓటీటీలో ఉస్తాద్ భగత్ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్ భగత్ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్
నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ ట్రెండ్ అవుతుంది. అయితే దీనికి మరో తెలుగు కామెడీ సినిమా పోటీ ఇస్తోంది. టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది.

నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 మూవీస్
ఈ సమ్మర్‌కి ఆడియెన్స్ థియేటర్లో కంటే ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఓటీటీ చిత్రాలకు డిమాండ్ పెరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు నవ్వించే చిత్రాలు, యాక్షన్ సినిమాలు, థ్రిల్లర్స్ ని బాగా చూస్తున్నారు ఆడియెన్స్. అయితే థియేటర్లో ఆడని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతున్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా పలు క్రేజీ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. ధురంధర్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌తోపాటు మరో తెలుగు కామెడీ సినిమా కూడా రచ్చ చేస్తోంది.
నెంబర్ 1 స్థానంలో ధురంధర్
నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1గా బాలీవుడ్ మూవీ `ధురంధర్` ట్రెండ్ అవుతుంది. ఇది గత రెండు నెలలుగా మొదటిస్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసుని షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. దీనికి పార్ట్ 2 `ధురంధర్ 2` వచ్చి ఇప్పటికీ బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. `బాహుబలి 2` రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
టాప్ 2లో యూత్
నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా టాప్ 2లో తమిళ చిత్రం `యూత్` ఉంది. కుర్రాళ్లు కలిసి చేసిన ఈ చిత్రం థియేటర్లో బాగానే ఆడింది. ఇప్పుడు నెల రోజులకుపైగానే ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. టీనేజ్ లవ్ స్టోరీ, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీలో ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది.
ఇక మూడో స్థానంలో `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో` ట్రెండ్ అవుతుంది. నాల్గో స్థానంలో `ఇఫ్ విషెస్ కుడ్ కిల్` అనే హాలీవుడ్ షో ట్రెండ్ అవుతుండటం విశేషం.
ఐదో స్థానంలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్
ఐదో స్థానంలో తెలుగు మూవీ ఉండటం విశేషం. అదే పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్`. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. గత నెలలోనే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ దాదాపు మూడు వారాలుగా టాప్ 5లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఆరో స్థానంలో బాలీవుడ్ మూవీ `రోస్టర్` ట్రెండ్ అవుతుంది.
టాప్ 7లో తెలుగు కామెడీ మూవీ
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 7లో మరో తెలుగు సినిమా ట్రెండ్ అవుతుంది. నిహారిక నిర్మించిన `రాకాస` చిత్రం ఇప్పుడు ఇండియా వైడ్‌గా మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో సంగీత్ శోభన్, నయనసారిక జంటగా నటించారు. కామెడీ హర్రర్, ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ థియేటర్లో ఫర్వాలేదనిపించింది. కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది.
ఇక ఎనిమిదో స్థానంలో రాణీ ముఖర్జీ నటించిన `మర్దానీ 3`, 9వ స్థానంలో హిందీ వెబ్ సిరీస్ `గ్లోరీ`, పదో స్థానంలో `దో దీవానే సెహెర్ మెయిన్` అనే హిందీ చిత్రం ట్రెండ్ అవుతుంది.

