MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ స్టార్‌ హీరోయిన్‌ తల్లి కారణంగానే సూపర్‌ స్టార్‌ కృష్ణకి బ్రేక్‌? ఆమె ఆ మాట అనకపోతే బ్లాక్‌ బస్టర్‌ మిస్‌!

ఆ స్టార్‌ హీరోయిన్‌ తల్లి కారణంగానే సూపర్‌ స్టార్‌ కృష్ణకి బ్రేక్‌? ఆమె ఆ మాట అనకపోతే బ్లాక్‌ బస్టర్‌ మిస్‌!

సూపర్‌ స్టార్‌ కృష్ణకి లైఫ్‌ టర్న్ చేసిన మూవీ, స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన చిత్రం ఏంటి? ఈ మూవీ రావడానికి స్టార్‌ హీరోయిన్‌ తల్లి ఎలా కారణమయ్యిందనేది చూస్తే.    

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 13 2025, 08:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సూపర్‌ స్టార్‌ కృష్ణ అందరిలాగే సినిమాల కోసం స్ట్రగుల్‌ అయ్యారు. ఎన్టీ రామారావు వంటి వారి వద్ద తన కోరికని పంచుకున్నారు. కానీ స్వశక్తితోనే ఆఫర్లని సంపాదించాడు. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను నిరూపించుకున్నారు. సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఆరు దశబ్దాల పాటు టాలీవుడ్‌ ని శాషించారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కెరీర్‌ ప్రారంభంలో కృష్ణ లైఫ్‌ టర్నింగ్‌ పాయింట్‌ కావడానికి కారణం ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లి కావడం విశేషం. ఆమె దర్శక నిర్మాతలతో ఆరోగెంట్‌గా రియాక్ట్ కావడం వల్లే కృష్ణ కెరీర్‌ మలుపు తిరిగింది. ఆయనకు అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ పడింది. కెరీర్‌లో ఫస్ట్ బ్రేక్ దక్కింది. మరి ఆమె ఎవరు? ఆమె ఏమన్నది? కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చిన సినిమా ఏంటనేది చూస్తే. 
 

37

సూపర్‌ స్టార్‌ కృష్ణ `కులగోత్రాలు`(1961) సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. `పదండి ముందుకు`, `పరువు ప్రతిష్ట` సినిమాలతో అలరించారు. తనలో మంచి నటుడు ఉన్నాడని అందరికి తెలియజేశాడు. `తేనే మనుసులు` సినిమాతో లీడ్‌ యాక్టర్‌గా మారారు. ఇందులో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండగా, వారిలో ఒకరిగా నటించారు కృష్ణ. ఇది విజయం సాధించింది. కానీ సక్సెస్‌ ని పంచుకోవాల్సి వచ్చింది. `కన్నేమనసులు` కూడా అంతే. 
 

47

ఈ క్రమంలో తనని హీరోగా నిలబెట్టిన మూవీ, తాను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసిన మూవీ `గూఢచారి 116`. తెలుగులో వచ్చిన మొదటి స్పై ఫిల్మ్(గూఢచారి) ఇది. ఎం మళ్లిఖార్జున రావు దర్శకత్వం వహించారు. సుందర్‌లాల్‌, దూండి నిర్మించారు. ఇందులో జయలలిత హీరోయిన్‌గా నటించింది. జయలలిత తల్లి సంధ్య బాగా రిచ్‌. ఆమెనటి కూడా. జయలలిత హీరోయిన్‌గా తెలుగులో అప్పటికే ఐదారు సినిమాలు చేసింది. అప్పుడప్పుడే స్టార్డమ్‌ వస్తుంది. 
 

57

`గూఢచారి 116`లో మొదట హీరో కృష్ణ కాదు. శోభన్‌బాబుని అనుకున్నారు. సైడ్‌ క్యారెక్టర్ కృష్ణది. ఈ మూవీకి హీరోయిన్‌గా జయలలితని ఫైనల్‌ చేశారు. ప్రారంభంలో సెట్‌కి ఆమె తల్లి సంధ్య కూడా వచ్చింది. హీరో ఎవరు అంటే శోభన్‌బాబుని చూపించారు. ఆయన ఆ సమయంలో కాస్త జిడ్డు ముఖంతో ఉన్నారు.

67

ఎండకి ముఖం రంగుమారింది. ఆయన్ని చూసి జయలలిత తల్లి ఈయన హీరో అయితే మా అమ్మాయి సినిమా చేయదని తెగేసి చెప్పిందట. కాదంటే కాదు అని కూర్చుందట. కృష్ణ అప్పట్లోనే ఎర్రగా అందంగా ఉండేవారు. దీంతో కృష్ణని చూపించగా ఆమె ఓకే అన్నదట. దీంతో సైడ్‌ క్యారెక్టర్‌ చేయాల్సిన కృష్ణ మెయిన్‌ హీరో అయ్యారు, హీరోగా చేయాల్సిన శోభన్‌బాబు సైడ్‌ క్యారెక్టర్‌ చేశారు. 

read  more: బాలకృష్ణ, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌?.. బ్లాక్‌ బస్టర్‌ మూవీకి సీక్వెల్‌.. రేపే ప్రకటన


 

77

1966లో విడుదలైన `గూఢచారి 116` ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కృష్ణకి స్టార్‌డమ్‌ వచ్చింది. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయారు. ఆ దెబ్బతోనే కృష్ణ కెరీర్‌ మారిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలా యాక్షన్‌ సినిమాలతో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు కృష్ణ.

సుమారు ఆరు దశబ్దాల కెరీర్‌లో 350కిపైగా సినిమాలు చేసి మెప్పించారు. రెండేళ్ల క్రితమే ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణ వారసత్వాన్ని మహేష్‌ బాబు కొనసాగిస్తున్నారు.   

read more: అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ముసుగులో Game Changerపైకుట్ర, HD ప్రింట్‌ లీక్‌..సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు

also read: హీరోయిన్‌ సైజులపై త్రినాథ రావు నక్కిన వల్గర్‌ కామెంట్లు, మహిళా కమిషన్‌ సీరియస్‌, సారీ చెప్పిన దర్శకుడు
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణ ఘట్టమనేని
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Diwali Box Office Clash: 'రామాయణ' ముందు నయనతార, సూర్య నిలబడతారా ?
Recommended image2
Cult First Review: కల్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ.. విశ్వక్ సేన్‌ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడా?
Recommended image3
Brahmanandam: బ్రహ్మానందంకి తగిలిన శాపం, ఆ దర్శకుడి వల్లే.. ఉన్న డైలాగ్ కూడా లేపేశారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved