- Home
- Entertainment
- బ్లూ ఫిల్మ్ కేసు.. ఉగ్రవాదుల సెల్ లో సుమన్, స్టార్ హీరో కోసం జైల్లోనే పోరాడిన నాయకుడు ఎవరో తెలుసా?
బ్లూ ఫిల్మ్ కేసు.. ఉగ్రవాదుల సెల్ లో సుమన్, స్టార్ హీరో కోసం జైల్లోనే పోరాడిన నాయకుడు ఎవరో తెలుసా?
స్టార్ హీరోగా ఎదుగుతున్న టైమ్ లో.. బ్లూ ఫిల్మ్ కేసులో జైలుకు వెళ్లి ఇబ్బందులు పడ్డాడు సుమన్. నిర్దోషిగా బయటుక వచ్చినా ... సుమన్ ఆ ప్రభావంతో చాలా కెరీర్ ను కోల్పోయాడు. అయితే ఈ విషయంలో సుమన్ కు అండగా నిలబడ్డవారు చాలామంది ఉన్నారు.

స్పీడ్ గా దూసుకొచ్చిన హీరో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలంలో హీరోగా ఎదిగాడు సమన్. మార్షల్ ఆర్ట్స్ లో పట్టు ఉండటం, యాక్షన్, డ్యాన్స్, తో పాటు ఆరడుగుల అందగాడు కావడంతో.. సుమన్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధించాడు. అంతే కాదు.. అప్పటి స్టార్ హీరోలకు కూడా పోటీ వచ్చాడు. 90వ దశకంలో స్టార్ హీరోల సరసన సుమన్ కూడా ఉండేవాడు. కానీ కెరీర్ లో ఎదుగుతున్న టైమ్ లోనే ఓ భారీ కుదుపు అతని కెరీర్ ను తలకిందులు చేసింది. అక్రమంగా సుమన్ పై పెట్టిన కేసులు అతనికి అవకాశాలు లేకుండా చేశాయి. స్టార్ డమ్ రాకుండా అడ్డుకున్నాయి.
సుమన్ పై గూండా యాక్ట్..
స్టార్ హీరోగా ఎదుగుతున్న టైమ్ లోనే సుమన్ పై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. బ్లూ ఫిల్మ్స్ లో నటిస్తున్నారన్న కేసుతో పాటు గూండా యాక్ట్ లో 11 కేసులు ఆయనపై పెట్టారు. దాంతో బెయిల్ కూడా రాకుండా చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. హీరోగా మంచి ఫామ్ లో ఉండగా సుమన్ కెరీర్ బ్రేక్ అయ్యేలా చేశారు. అయితే అప్పటికి తమ స్నేహితులు మధ్య ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల.. కొంత మంది హైయర్ అఫీషియల్స్ తో కలిసి ఇలా తనపై కేసులు పెట్టారని, ఆతరువాత తప్పు తెలుసుకుని.. వాళ్లే కేసులు వెనక్కి తీసుకున్నారని సుమన్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.కానీ అప్పటికే జరిగిపోవల్సిన నష్టం జరిగింది.
ఉగ్రవాదుల మధ్య సుమన్..
తనపై పెట్టిన కేసుల గురించి సుమన్ మాట్లాడుతూ.. '' ఎవరో చేసిన పనిని నేను చేశాను అనుకుని.. కోపంతో నాపై కేసులు పెట్టారు. నాకు కావల్సిన వారే ఇలా చేశారు. కానీ ఆతరువాత అసలు నిజం తెలియడంతో.. కేసులు వెనక్కి తీసుకున్నారు. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. జైల్లో నన్ను టెర్రరిస్టులు, నక్సలైట్లు ఉన్న క్లోజ్డ్ రూమ్ లో వేశారు. వారిమధ్య నేను చాలా రోజులు ఉన్నాను. ఎంత పెద్ద పెద్ద కేసులు అయినా.. వాళ్ల మధ్య ఉంచకూడదు.. నాపై పెట్టిన కేసులకు నన్న మామూలు గదిలోనే ఉంచాలి. కానీ కావాలని నన్ను ఉగ్రవాదులఉన్న రూమ్ లో వేశారు.'' అనిసుమన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
సుమన్ తరపున పోరాడిన కరుణానిధి
సుమన్ మాట్లాడుతూ.. '' ఉగ్రవాదుల మధ్య ఉన్నా కానీ..నాకు భయం వేయలేదు.. ఎందుకుంటే వారు నాతో బాగానే మాట్లాడేవారు, జైల్లో ఉన్నవారంతా చెడ్డవాళ్లు కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల వారు అలక్కడికి రావలసి వస్తుంది. అక్కడ ఉన్నవారిలో చదువుకున్న వారు చాలామంది ఉన్నారు. కొన్ని కారణాల వల్ల తప్పుచేసి జైలుకు వస్తారు, అందులో డాక్టర్లు, టీచర్లు, అందరిని నేను చూశాను. ఇక నన్ను ఉగ్రవాదుల మధ్య పెట్టారని తెలిసి...తమిళనాడు ప్రతిపక్షనేతగా ఉన్న కరుణానిధికి కోపం వచ్చింది. అప్పుడే ఏదో ఉద్యమం చేసి ఆయన కూడా అదే జైలుకు వచ్చారు. అక్కడున్నవారిపై మండిపడ్డారు. నన్ను క్లోజ్డ్ రూమర్ నుంచి మార్చాలని అధికారులపై ఆయన ఒత్తిడి చేశారు. ఎంతైనా పలుకుబడి ఉన్నవారు కదా.. ఆయన గొడవ చేసే సరికి.. విషయం ఎక్కడిదాకా వెళ్తుందా అని భయపడి.. నన్ను మామూలు గదికి మార్చారు” అని సుమన్ గుర్తుచేసుకున్నారు.
స్టార్ డమ్ ను కోల్పోయిన హీరో..
సుమన్ జీవితంలో ఆ స్ట్రగుల్ టైమ్ లేకుండా ఉండి ఉంటే.. టాలీవుడ్ లో స్టార్ హీరోల రేంజ్ ను సుమన్ అందుకునేవారు. చిరు, బాలయ్య, వెంకీ ,నాగ్ లతో సమానంగా ఇమేజ్ ను సుమన్ సాధించేవారు. కానీ ఈ కేసులు, జైలు జీవితం వల్ల .. ఆయన కెరీర్ పై ఆ ప్రభావం గట్టిగా చూపించింది. అయినా సరే సుమన్ గురించి తెలిసినవారు ఆయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో నిలబడేలా చేశారు. టాలీవుడ్ హిస్టరీలోనే అన్నమయ్య సినిమాతో వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించి.. మెప్పించి, రాష్ట్రపతి చేత శభాష్ అనిపించుకున్న ఏకైక నటుడు సుమన్.

