20 లక్షల అప్పు, తండ్రి తాగుడు, హైపర్ ఆది ని కష్టాల నుంచి బయటపడేసింది ఎవరు?
నవ్వుతూ.. నవ్వించే వారి వెనకు ఏదో ఒక విషాదం తప్పకుండా ఉంటుంది.అలాంటి విషాదాలను దాటుకుని స్టార్ కమెడియన్ గా ఎదిగాడు జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది. లక్షల అప్పు నుంచి కుటుంబాన్ని కాపాడి, స్టార్ కమెడియన్ గా ఆది ఎలా మారాడు?

నవ్వుల వెనుక విషాదం..
కడుపుబ్బ నవ్వించే ప్రతీ కమెడియన్ వెనుక ఏదో ఒక విషాద కథ ఉంటంది. ఆ కష్టాలు అనుభవించినవారికే నవ్వు విలువ కూడా తెలుస్తుంది. జీవితం పెట్టిన పరీక్షల్లో విజయం సాధించి.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడ్డ నటులలో హైపర్ ఆది ఒకడు. ఆయన కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ వాటిన్నిటిని తట్టుకుని నిలబడి.. కమెడియన్ గా తను అనుకున్నది సాధించి.. వాటి నుంచి బయటపడ్డాడు. 20 లక్షల అప్పుతో హైదరాబాద్ కు వచ్చిన ఆది.. ప్రస్తుతం తన కుటుంబాన్ని నిలబెట్టి.. తాను కూడా ఆర్ధికంగా స్థిరపడ్డాడు.
సాధారణ కంటెస్టెంట్ గా వచ్చి..
జబర్దస్త్ కామెడీ షోకి సాధారణ కమెడియన్ గా అభి టీమ్ లోకి వచ్చాడు ఆదీ.. ఆతరువాత తన పంచులతో అందరిని ఆకట్టుకుని, ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. జబర్దస్త్ లో కమెడియన్‌గా ప్రేక్షకులకు దగ్గరైన హైపర్ ఆది, ఆ తర్వాత టీమ్ లీడర్‌గా రచయితగా తన మార్క్ చూపించాడు. తన టాలెంట్ ను జబర్దస్త్ స్టేజ్ వరకే పరిమితం చేయకుండా. సినిమాలు, ఇతర టీవీ కార్యక్రమాలు, బయట ఇతర ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటూ చేతినిండా సంపాదిస్తున్నాడు. టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు కూడా సాధిస్తున్నాడు హైపర్ ఆది. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలోకి వచ్చి.. కష్టపడి సక్సెస్ సాధించిన వ్యక్తిగా హైపర్ ఆది పేరు మారుమోగిపోతోంది.
హైపర్ ఆది నవ్వుల వెనుక కష్టాలు..
హైపర్ ఆది స్టార్ డమ్, డబ్బు, ఇమేజ్ రావడానికంటే ముందు.. ఆయన చాలా కష్టాలు అనుభవించాడు. ఒక రకంగా చెప్పాలంటే.. సినిమా కష్టాలు చూశాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన ఆర్థిక కష్టాలు, సక్సెస్ వెనక ఉన్న కారణాలు.. దానికోసం అతను చేసిన పోరాటాన్ని ఎమోషనల్ గా వెల్లడించారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. నా డిగ్రీ పూర్తయ్యే టైమ్ కు నా మా కుటుంబం పరిస్థితి దారుణంగా ఉంది. ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములం, చదువులు, బయటకు పంపడానికి భారీ ఖర్చులు అయ్యాయి. అప్పుడు పంట కూడా సరిగా పండకపోవడంతో దాదాపు 20 లక్షల అప్పు అయ్యింది. దాంతో నేను ఉద్యాగం చేయాల్సి వచ్చింది.''
లేడీస్ హాస్టల్ లో పనిచేశాను..
ఆది మాట్లాడుతూ.. ''అప్పులు తీర్చడానికి నేను మొదట ఉద్యోగం చేశాను. కానీ జీతం మాత్రం 15 వేలు మాత్రమే వచ్చేవి.. అప్పులకు వడ్డిలు మాత్రం నెలకు 40 వేల వరకూ అయ్యేవి.ఒక అన్నయ్యకు ఉద్యోగం లేదు.. మరో అన్నయ్యకు ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడం వల్ల బాధ్యతలు అన్నీ నాపైనే పడ్డాయి. హైదరాబాద్‌లో ఉండటం, తినడం కోసం డబ్బులు అవసరం కావడంతో హాస్టల్ ఖర్చు తగ్గించుకునేందుకు చుట్టాలు రన్ చేస్తోన్న లేడీస్ హాస్టల్స్ లో మెయిటెనెస్ చూసుకుంటూ.. ఉండేవాడిని. అప్పుడే ఖాళీ టైమ్ లో వీడియోల చేయడం మొదలు పెట్టాను. అవి చూసిన తరువాతే అభి నన్ను సంప్రదించాడు. అలా జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ఆతరువాత నా కష్టాలనుంచి జబర్దస్త్ నన్ను కాపాడింది.
ఇంట్లో వ్యతిరేకించారు..
జబర్దస్త్‌లో చేరినప్పుడు ఆది ఇంట్లో మొదట వ్యతిరేకత ఎదురైంది. ఉద్యోగం చేయకుండా ఇవి ఎందుకు అని తల్లిదండ్రులు ఆయన్ను తిట్టారట. అంతే కాదు ఉన్న అప్పులన్నీ తీర్చేందుకు తమ మూడు ఎకరాల పొలాన్ని అమ్మాల్సి వచ్చిందని, అందరూ వద్దన్నా మైండ్ ఫ్రీ అవుతుందనే ఉద్దేశంతో అమ్మేశానని ఆది చెప్పారు. జబర్దస్త్ ద్వారా సక్సెస్ సాధించిన తర్వాత మళ్లీ అదే మూడు ఎకరాల పొలాన్నికొని ఇంట్లో వాళ్లకు ఆ బాధ లేకుండా చేశాడు ఆది.
తాగుడు అలవాటు లేకపోవడానికి కారణం..
తన తండ్రి గురించి ఆది మాట్లాడుతూ.. '' నాన్న మందు అలవాటు వల్ల కిడ్నీ సమస్యలు వచ్చాయి. అప్పటికి నేను సెటిల్ అవ్వబట్టి.. వెంటనే ట్రీట్మెంట్ చేయించాను. నాన్న అలా అయిపోవడం. ఆయన అలవాటు చూసిన తరువాతే నేను తాగకూడదని డిసైడ్ అయ్యాను. అందుకే నాకు ఇప్పటికీ తాడుగు అలవాటు కాలేదు. కానీ నాకు కంటెంట్ అంతా తాగుబోతుల నుంచే వస్తుంది. తాగే వాళ్ల తో కూర్చుని వారి మాటలు వింటాను. అక్కడినుంచే తన స్కిట్స్‌కు అవసరమైన కంటెంట్ వస్తుందని హైపర్ ఆది అన్నారు.

