MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ

Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ

ఓజీ 2 కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు మరో మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చేసింది. ఓజీ 2 చర్చల కోసం డైరెక్టర్ సుజీత్ తాజాగా పవన్ కళ్యాణ్ ని మీట్ అయ్యారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 21 2026, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓజీ 2 కోసం అభిమానుల ఎదురుచూపులు
Image Credit : Asianet News

ఓజీ 2 కోసం అభిమానుల ఎదురుచూపులు

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఓజీ 2 ఒకటి. ఓజీ ప్రపంచంలోకి మళ్లీ వస్తానని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చినప్పటి నుంచి ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ ఈ చిత్రం గురించి మాట్లాడటంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ కళ్యాణ్ ను కలిసిన సుజీత్
Image Credit : instagram

పవన్ కళ్యాణ్ ను కలిసిన సుజీత్

తాజాగా దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను చిత్రబృందం అధికారికంగా పంచుకుంది. ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్, సుజీత్ ఏదో అంశంపై చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఓజీ 2కు సంబంధించిన చర్చలు మరోసారి ఊపందుకున్నాయి.

35
జోరందుకున్న సీక్వెల్ చర్చలు
Image Credit : Asianet News

జోరందుకున్న సీక్వెల్ చర్చలు

ఓజీ యాక్షన్ సాగాకు తదుపరి అధ్యాయం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ భేటీ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌గా మారింది. ఫొటో విడుదలైన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. అయినప్పటికీ ఈ సమావేశం సీక్వెల్ పనులు ముందుకు సాగుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది.

As promised by @PawanKalyan , #OGUniverse discussions have begun with @Sujeethsign at Creative Works! @MusicThaman#OG2 pic.twitter.com/6l7UzJUpvh

— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 21, 2026

45
స్క్రిప్ట్ పనుల్లో బిజీగా సుజీత్
Image Credit : Asianet News

స్క్రిప్ట్ పనుల్లో బిజీగా సుజీత్

ప్రస్తుతం సుజీత్ ఓజీ 2 కథా రచనపై దృష్టి పెట్టినట్లు సమాచారం. సీక్వెల్‌కు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సినిమా కథను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు తదుపరి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

55
త్వరలోనే సెట్స్ పైకి?
Image Credit : X/@Sujeethsign

త్వరలోనే సెట్స్ పైకి?

ఓజీ తొలి భాగంలో పనిచేసిన ప్రధాన బృందంలోని ఎక్కువ మంది సభ్యులు సీక్వెల్ కోసం తిరిగి రానున్నట్లు సమాచారం. అదే సమయంలో కొంతమంది కొత్త సభ్యులు కూడా ఈ ప్రాజెక్టులో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని అంశాలు ఖరారైన తర్వాత, అలాగే పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి తేదీలు కేటాయించిన తర్వాత సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ భేటీ ఫొటో మాత్రం అభిమానులకు సంబరాలు చేసుకునే కారణంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన తదుపరి అధికారిక అప్‌డేట్‌పైనే ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Related Stories
Recommended image1
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్
Recommended image2
Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved