MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే

Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే

లాస్య మంజునాథ్ టాలీవుడ్ లో యాంకర్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే కెరీర్ లో ఎదురైన ఇబ్బందులు, ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 21 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాంకర్ లాస్య
Image Credit : Asianet News

యాంకర్ లాస్య

టాలీవుడ్ లో క్రేజీ యాంకర్స్ లో లాస్య ఒకరు. పెళ్లయ్యాక లాస్య బుల్లితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం లాస్య తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన గ్లామర్, చలాకీగా మాట్లాడే ట్యాలెంట్ తో యాంకర్ గా లాస్య ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది. యాంకర్ గా రాణిస్తున్న రోజుల్లో లాస్య ఎన్నో రూమర్స్ ని ఎదుర్కొంది. తనకి ఎదురైన ఇబ్బందులని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇద్దరి మధ్య విభేదాలు
Image Credit : Instagram

ఇద్దరి మధ్య విభేదాలు

లాస్య, యాంకర్ రవి జోడీ బుల్లితెరపై సూపర్ హిట్ అయింది. వీళ్ళిద్దరూ కలసి చేసిన షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. లాస్య మాట్లాడుతూ..ఆ సమయంలో రవి నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేనైతే రవిని మంచి ఫ్రెండ్ గానే భావించా. ఇగోల వల్లే విభేదాలు మొదలయ్యాయి. మా ఇద్దరికీ ఫేమ్ వచ్చాక అందరూ రవిని సంప్రదించడం ప్రారంభించారు. మీ ఇద్దరితో ఒక షో ప్లాన్ చేస్తున్నాం అని రవిని అడిగేవారు. రవి ఓకె చేసేశాక నాకు చెప్పేవాడు.

35
నా వల్లే నీకు ఫేమ్ వచ్చింది
Image Credit : our own

నా వల్లే నీకు ఫేమ్ వచ్చింది

అదేంటి నేను కూడా యాంకర్ నే కదా.. నన్ను అడగాలి కదా అనే చిన్న బాధ మొదలైంది. ఆ విషయం రవికి చెబితే నీకు ఫేమ్, కెరీర్ వచ్చిందే నా వల్ల అని అన్నాడు. అక్కడ చాలా బాధపడ్డాను. రవి ట్యాలెంటెడ్ కావచ్చు కానీ.. నాలాంటి క్యూట్ అమ్మాయి పక్కన లేకుంటే మేము చేసిన షోలు అంత పాపులర్ అయ్యేవి కాదు కదా అని లాస్య పేర్కొంది.

45
పెళ్ళైన వ్యక్తి వెంటపడ్డాడు
Image Credit : our own

పెళ్ళైన వ్యక్తి వెంటపడ్డాడు

అప్పటి నుంచి రవికి దూరం అవుతూ వచ్చినట్లు లాస్య పేర్కొంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఓ వ్యక్తి నన్ను పర్సనల్ గా బాగా ఇబ్బంది పెట్టాడు. అతడికి ఆల్రెడీ పెళ్లయింది. అయినప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం..నీ కోసం నా భార్యకి విడాకులు ఇస్తాను అని వెంటపడేవాడు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అతడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అయింది. కానీ చివరికి ఎలాగోలా బయటపడ్డా అని లాస్య పేర్కొంది.

55
నడిరోడ్డులో బైక్ ఆపి ప్రపోజల్
Image Credit : our own

నడిరోడ్డులో బైక్ ఆపి ప్రపోజల్

తన హస్బెండ్ మంజునాథ్ తో లవ్ స్టోరీని కూడా లాస్య బయట పెట్టింది. 2 ఏళ్ళ పాటు నా వెంట పడ్డారు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఓపిగ్గా ఎదురుచూశాను. ఆ తర్వాత హాయ్ బై చెప్పుకుంటూ ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడప్పుడూ బైక్ పై బయటకు తీసుకెళ్లేవారు. ఒకరోజు ఎవ్వరూ లేని చోట సడెన్ గా బైక్ ఆపి ప్రపోజ్ చేశారు. సడెన్ గా బైక్ ఆపాడు ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను. ప్రపోజ్ చేసేసరికి జస్ట్ స్మైల్ ఇచ్చి కామ్ అయిపోయా. మూడు నెలల తర్వాత అతడి ప్రపోజల్ ని ఓకె చేసినట్లు లాస్య పేర్కొంది. కెరీర్ కంటే నాకు ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ ముఖ్యం. అందుకే ఫ్యామిలీ కోసం కెరీర్ ని పక్కన పెట్టేసినట్లు లాస్య తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image2
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image3
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Related Stories
Recommended image1
Krishna Daughter: నాన్న, తమ్ముడికి ఆ ఇద్దరినీ మించిన హీరోయిన్లు లేరు.. కృష్ణ కూతురు కామెంట్స్
Recommended image2
Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved