మళ్ళీ రొమాన్స్ మొదలెట్టిన సుడిగాలి సుధీర్ - రష్మి, హీరోగా అవకాశాలు లేక.. బుల్లితెరపైకి జంటగా రీ ఎంట్రీ..?
సుధీర్ - రష్మి లవ్ స్టోరీకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా చాలా కాలం వీరి కాంబోకి గ్యాప్ వచ్చింది. సుధీర్ హీరోగా వెండితెరకు వెళ్ళిపోవడంతో బుల్లితెరపై ఈ జంటను మిస్ అయ్యారు ఫ్యాన్స్. ఇక వీరిద్దరు మళ్లీ జంటగా రీ ఎంట్రీ ఇచ్చారు.
సుధీర్ - రష్మి మళ్ళీ మొదలెట్టారు. చాలా కాలం ఆస్ స్క్రీన్ మీద వీరి ప్రేమ కలాపాలకు గ్యాప్ ఇచ్చిన ఈ జంట మరోసారి బుల్లితెరపై మొదలెట్టారు. తాజాగా వీరికి సబంధించిన ఓ ప్రోమో వైరల్ అవుతోంది. గతంలో స్మాల్ స్క్రీన్ పై సుధీర్ స్టార్ హీలను మించిన ఇమేజ్ ను సాధించాడు అయితే ఈ యంగ్ స్టార్ కు రష్మి తోడై.. వీరిపై రకరకాల ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. వీరి లవ్ ఎపిసోడ్స్ కు భారీగా రెస్పాన్స్ రావడంతో వీరిపై ప్రత్యేకంగా ప్రేమ పెళ్ళి ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేశారు డైరెక్టర్లు.
Also Read: నయనతారపై ధనుష్ 10 కోట్ల దావా కేసు.. కోర్టు సంచలన తీర్పు..?
అంతే కాదు పెద్దగా అవకాశాలు కూడా రావడంలేదు అని సమాచారం. గతంలో హీరోలకు స్నేహితుడి పాత్రల్లో కనిపించాడు సుధీర్. హీరోగా ఇంటర్డ్యూస్ అయిన తరువాత కూడా సుధీర్ కు ఇలాంటి అవకాశాలే వస్తున్నాయని తెలుస్తోంది.
దాంతో మరోసారి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. అంతే కాదు మళ్ళీ తన క్రేజ్ ను.. హైప్ ను పెంచుకోవడం కోసం రష్మీతో జత కలిశారు. ఒకప్పుడు వీరి క్రేజ్ తో ఇద్దరికి పెళ్ళి , స్వయంవరం లాంటివి కూడా చేశారు మేకర్స్.
Also Read: రాంచరణ్ కి ఇష్టమైన టాలీవుడ్ హీరోయిన్..? బాలయ్య ముందు ఓపెన్ అయిన గ్లోబల్ స్టార్
ఆతరువాత సుధీర్ పూర్తిగా బుల్లితెరపై కనిపించడం చిన్న చిన్నగా మానేశాడు. టాలీవుడ్ లో హీరోగా రెండు మూడు సినిమాలు చేసిన సుధీర్.. హీరోగా ఎదగడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే అడపా దడపా సినిమాలు అయితే చేస్తున్నాడు కాని హీరోగా మాత్రం స్టార్ డమ్ ను సాధించలేకపోయాడు. సుధీర్ చేసిన సినిమాల్లో సాలిడ్ హిట్ కొట్టింది ఒక్కటి కూడా లేదు.
Also Read: చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ కు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?
అంతే కాదు పెద్దగా అవకాశాలు కూడా రావడంలేదు అని సమాచారం. గతంలో హీరోలకు స్నేహితుడి పాత్రల్లో కనిపించాడు సుధీర్. హీరోగా ఇంటర్డ్యూస్ అయిన తరువాత కూడా సుధీర్ కు ఇలాంటి అవకాశాలే వస్తున్నాయని తెలుస్తోంది. దాంతో మరోసారి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. అంతే కాదు మళ్ళీ తన క్రేజ్ ను.. హైప్ ను పెంచుకోవడం కోసం రష్మీతో జత కలిశారు. ఒకప్పుడు వీరి క్రేజ్ తో ఇద్దరికి పెళ్ళి , స్వయంవరం లాంటివి కూడా చేశారు మేకర్స్.
ఇక ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరిని కలిపి ఓ పెద్ద ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశారు. ఈసంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అని పెద్ద ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశారు. ఈటీవీలో టెలికాస్ట్ కాబోతున్న ఈ ప్రోగ్రామ్ కు సబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో సుధీర్ - రష్మి ఇద్దరి మధ్య మళ్ళీ లవ్ సీన్స్ లో ప్రోగ్రామ్ పై భారీగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈప్రోగ్రామ్ కు వారిద్దరు యాంకరింగ్ చేశారు.
ఇక ఇదివరకట్లాగే రష్మిపై పంచ్ లు బిస్కెట్ లు వేసే కార్యక్రమం గట్టిగా జరిగింది. ఇక వీళ్లిద్దరి రీ ఎంట్రీ చూసిన ఆడియన్స్.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. మా అన్నా వదినా వచ్చేశారంటూ పడగ చేసుకుంటున్నారు. సుధీర్ కు బుల్లితెరపై భారీగా పాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ పండగప్రోగ్రామ్ తో ఆపేస్తారా..? లేక ఇలానే వారి యాంకరింగ్ ప్రస్తానం అలాగే కంటీన్యూ చేస్తారా అనేది చూడాలి.