Brahmamudi: కోర్టుకెళ్తానంటూ షాకిచ్చిన స్వప్న.. రుద్రాణిని బయటికి పొమ్మన్న సుభాష్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తనతోపాటు చెల్లెల్ని కూడా ఊబిలోకి లాగేసిన ఒక స్వార్ధపరురాలైన అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య అలాంటి పని చేయదు అంటూ వెనకేసుకొస్తాడు కృష్ణమూర్తి. నేను స్వప్న కి రాహుల్ కి పెళ్లి జరగాలని మాత్రమే అనుకున్నాను అంతేకానీ నేను ఏ సలహా ఇవ్వలేదు. అది నా మీద నింద వేస్తుంది అంటుంది కావ్య. ఎందుకు అబద్ధాలు ఆడతావు నాకు కడుపు లేదనే సంగతి నీకు తెలియదా అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అంటుంది స్వప్న.
చెప్పలేక పోతుంది కావ్య. చూశారా తను ఏమీ మాట్లాడటం లేదు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇందులో నా తప్పేమీ లేదు అంటుంది స్వప్న. అప్పుడు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నేను ఏమీ అడగను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు స్వప్న కి ప్రెగ్నెన్సీ లేదని నీకు తెలుసా, తెలియదా అని అడుగుతాడు. కావ్య ఏమి మాట్లాడదు. ముసుగేసుకుని పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడే నీకు తాళి కట్టకుండా ఉండవలసింది.
తప్పు చేశాను అంటాడు రాజ్. కావ్య ఏదో మాట్లాడుతుంటే ఇప్పుడు ఏం స్టోరీ చెప్తావు అయినా తల్లి గడప చాటున ఉంటే పిల్లలు కూడా గడుప చాటునే ఉంటారు. ఆ తల్లే డబ్బున్న వాళ్ళం అంటూ మోసాలు చేసింది ఇంక కూతుర్లు మాత్రం ఎందుకు చేయరు. ఇప్పటివరకు చేసిన మోసం చాలు అంటుంది అపర్ణ. అప్పుడు రుద్రాణి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఆ కావ్యని వెనకేసుకొచ్చి నన్ను ఎన్నిసార్లు నా నోరు మూయించారు.
ఇప్పుడు వాళ్లు చేసిన పనికి ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు, మాట్లాడితే వంశ ప్రతిష్ట అంటారు కదా అంటూ నిలదీస్తుంది. నా కోడలు అలాంటిది,నా కోడలు అబద్ధం చెప్పదు అని వెనకేసుకొచ్చారు ఈ కోడల్ని చూసే కదా నన్ను ఎన్నోసార్లు అవమానించి మాట్లాడావు అంటూ సుభాషిని అపర్ణని కూడా నిలదీస్తుంది. నా భార్య అలాంటిది కాదు అంటూ వెనకేసుకొచ్చావు ఇప్పుడెందుకు ఏమీ మాట్లాడవు అని రాజ్ ని నిలదీస్తుంది రుద్రాణి.
నీ కొడుకే కాదు నా కొడుక్కి కూడా అన్యాయం జరిగింది నీ కోడల్ని నువ్వు నా కోడల్ని నేను బయట పంపించేద్దాం అంటుంది అపర్ణ. బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నాతోపాటు రాహుల్ కూడా బయటికి రావాలి. నేను డబ్బున్న ఇంటికి కోడలు అవ్వాలనుకున్న మాట నిజమే కానీ నన్ను ట్రాప్చేసింది మాత్రం రాహుల్, నాకు కడుపు ఒక్కటే లేదు కానీ జరగవలసినవన్నీ జరిగిపోయాయి.
ఇప్పుడు కాదు కూడదు అంటే కోర్టుకు వెళ్తాను అని కుటుంబం మొత్తానికి షాక్ ఇస్తుంది స్వప్న. ఇవన్నీ చూడలేక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు సీతారామయ్య దంపతులు. అప్పుడు సుభాష్ కల్పించుకొని ఇక్కడ మోసం జరిగింది నిజమే కానీ ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. దాని గురించి నేను అమ్మానాన్న అందరం కలిసి డెసిషన్ తీసుకుంటాము అప్పటివరకు ఎవరు ఏమి మాట్లాడకండి అంటాడు.
వీల్లేదు అంటుంది రుద్రాణి. అలా అయితే నువ్వు కూడా నీ అత్తారింటికి బయలుదేరు, నీలాగే అందరూ పుట్టింట్లో పడి ఏడవాలని కోరుకోకు అని మందలిస్తాడు సుభాష్. ఆ తర్వాత స్వప్నని గదిలోకి తీసుకువెళ్లి చాచి కొడుతుంది కావ్య నిన్ను ఏం చేసినా తప్పులేదు అక్కవి అని నీకోసం ఆలోచిస్తే నువ్వు నా కాపురాన్ని నాశనం చేయాలని చూసావు, పెద్ద వాళ్ళని ఎదిరించి మాట్లాడావు.
ఈరోజు మీ వల్ల ఇంట్లో అందరి చేత మాటలు పడవలసిన అవసరం వచ్చింది అంటుంది కావ్య. ఎవరు ఎన్ని మాటలు పడినా నాకు అనవసరం నాకు కావాల్సింది నేను సుఖపడటం మాత్రమే. నేను నీలాగా అణిగి మణిగి ఉండలేను అంటుంది స్వప్న.తప్పు చేసినప్పుడు అణిగి మణిగి ఉండాలి.
లేదంటే ఏ తప్పు చేయకూడదు అంటూ మందలిస్తుంది కావ్య. తరువాయి భాగంలో ఇన్నాళ్లు నాకు నీ మీద కోపం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అది ద్వేషంగా మారింది. నా దృష్టిలో నిజం చెప్పకపోవడం, అబద్ధం చెప్పడం రెండు ఒకటే అంటాడు రాజ్. మరి తాతయ్య విషయంలో మీరు చేసింది ఏమిటి అంటుంది కావ్య. ఒకసారి గా షాక్ అవుతాడు రాజ్.