- Home
- Entertainment
- Brahmamudi: తండ్రి కోసం కన్నీరు పెట్టుకుంటున్న సుభాష్.. రాజ్ ని ఇరకాటంలో పెట్టేసిన సీతారామయ్య!
Brahmamudi: తండ్రి కోసం కన్నీరు పెట్టుకుంటున్న సుభాష్.. రాజ్ ని ఇరకాటంలో పెట్టేసిన సీతారామయ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. మనవడి కాపురం గురించి తపన పడుతున్న ఒక తాతగారి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు పడుతున్నా ఈ తాళి కి విలువ ఇచ్చి ఇక్కడ ఉంటున్నాను అంటుంది కావ్య. నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతున్నాయి అంటాడు రాజ్. ప్రపంచంలో చాలామందికి పెళ్లిళ్లు ఇష్టం లేకుండానే జరుగుతాయి. అందుకని వాళ్లు కాపురం చేయటం లేదా, పిల్లల్ని కనడం లేదా అయినా బ్రహ్మముడిని కూడా ఎదిరించే అంత ధైర్యం మీకు ఉందని తెలిసాక కూడా నేను ఇక్కడ ఉండటం అనవసరం వెళ్ళిపోతాను అంటుంది కావ్య.
అదే సమయంలో మెట్లు దిగుతున్న సీతారామయ్య రాజ్ దంపతుల మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ బాధతోనే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏం జరిగింది అంటూ కుటుంబ సభ్యులందరూ అతని చుట్టూ చేరుతారు. అతనికి కాస్త మంచినీళ్లు ఇచ్చి అతను తేరుకున్న తర్వాత రాజ్, సుభాష్ ఇద్దరు అతనిని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. సీతారామయ్యకి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ రాజ్ వాళ్ళతో మాట్లాడుతూ ఆయనకి బ్లడ్ క్యాన్సర్ ఆఖరి స్టేజిలో ఉంది.
మాక్సిమం ఆయన లైఫ్ టైం మూడు నెలలు మాత్రమే అంటాడు. అదేంటి డాక్టర్ ఈ జనరేషన్ లో కూడా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ లేదా అంటాడు రాజ్. లేదని ఎవరు చెప్పారు కానీ అందుకు మీ తాతయ్య గారి వయసు సహకరించదు అంటాడు డాక్టర్. ఈ విషయం మా తాతయ్యకి తెలుసా అని అడుగుతాడు రాజ్. చెప్పలేదు అంటాడు డాక్టర్. ఆయనకి చెప్పకండి అని డాక్టర్ కి చెప్పి, అప్పటికే తండ్రి కోసం కన్నీరు పెట్టుకుంటున్న సుభాష్ ని ఓదారుస్తూ ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పవద్దు డాడీ.
మీరే ఇలా అయిపోతున్నారు, ఇక ఇంట్లో వాళ్లకి తెలిస్తే తాతయ్య మీద జాలి చూపిస్తారు. ఈ టైంలో ఆయనకి కావలసింది జాలి కాదు, ఆయన సంతోషంగా ఉండేలాగా చూడటం అని చెప్తాడు రాజ్. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సీతారామయ్యని చూసి కన్నీరు పెట్టుకుంటుంది చిట్టి. డాక్టర్లు ఏమన్నారు అని సుభాష్ ని అడుగుతుంది. అబద్ధం చెప్పలేక డాక్టర్ తో రాజ్ మాట్లాడాడు అని చెప్తాడు సుభాష్. తాతయ్యకి బానే ఉంది కాస్త నీరసం వల్ల కళ్ళు తిరిగాయి అంతే అని చెప్తాడు రాజ్.
సీతారామయ్య ని తీసుకెళ్లి అతని గదిలో పడుకోబెడతారు. ఆ తరువాత గదిలో ఉన్న కావ్య తో నువ్వు ఇంకా వెళ్లి పోలేదా అని అడుగుతాడు. వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ తాతయ్య గారి పరిస్థితి ఇలా ఉంది కదా అందుకే ఆగిపోయాను అంటుంది కావ్య. ఏదో ఒక వంక పెట్టుకొని ఉండిపోదాం అని డిసైడ్ అయ్యావు అన్నమాట అంటాడు రాజ్. మీరు ఇలా అడిగిన తర్వాత కూడా ఇక్కడ ఉండటం అవసరమా అనే నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది. మీరేమీ కంగారు పడకండి నేను వెళ్ళిపోతాను.
అప్పుడు మీరు ఒంటరిగా, ప్రశాంతంగా ఉందురు గాని అంటుంది కావ్య. కోపంగా కిందకు వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడే అక్కడికి వచ్చిన చిట్టి మీ తాతయ్య నేను పిలుస్తున్నారు అని చెప్పడంతో సీతారామయ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. డాక్టర్లు నేను ఎంతకాలం బ్రతుకుతానని చెప్పారు అని మనవడిని అడుగుతాడు సీతారామయ్య. ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్. ఏం మాట్లాడుతున్నావ్ తాతయ్య అని అడుగుతాడు. నా దగ్గర దాయాలని చూడొద్దు నేను అంతా విన్నాను.
అయినా నాకు ఈ దేహం మీద అభిమానం లేదు. నేను అన్నీ చూసేసాను నా భయం అంతా నీ కాపురం గురించే. కావ్యని ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు అంటాడు సీతారామయ్య. తాతయ్య ఏమిటి ఇలా ఇరికించేస్తున్నాడు.. అయినా తాతయ్య బ్రతికున్నంత కాలం కావ్యని ప్రేమగా చూసుకుంటున్నట్లు నటిస్తాను అనుకొని తాతకి మాటిస్తాడు రాజ్.
నేను చేయవలసిన పని మరొకటి ఉంది నన్ను హాల్లోకి తీసుకువెళ్ళు అని రాజ్ ని అడుగుతాడు సీతారామయ్య. తరువాయి భాగంలో ఇన్నాళ్లు ఓపిక పట్టావు ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టి ఇక్కడే ఉండు అంటాడు రాజ్. కావ్య ఆనందంగా కృష్ణుడి దగ్గరికి వెళ్లి మూడు నెలలు ఓపిక పడితే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. నాకు కావలసింది ఆయన మనసులో స్థానం అని ఎమోషనల్ అవుతుంది. రాజ్ కూడా కృష్ణుడు దగ్గరికి వచ్చి కావ్యకి ఎప్పటికీ నా మనసులో స్థానం ఉండదు అంటాడు.