MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Subbaraju: అమితాబ్ బచ్చన్‌ ముఖంపై సిగరెట్ పొగ ఊదమన్న డైరెక్టర్, భయంతో వణికిపోయిన సుబ్బరాజు ఏం చేశాడో తెలుసా?

Subbaraju: అమితాబ్ బచ్చన్‌ ముఖంపై సిగరెట్ పొగ ఊదమన్న డైరెక్టర్, భయంతో వణికిపోయిన సుబ్బరాజు ఏం చేశాడో తెలుసా?

Subbaraju: ఇండియన్ మెగాస్టార్ అమితాబచ్చన్ తో నటించడం అంటే.. అది గోల్డెన్ ఛాన్స్ అని అంటారు. తెలుగులో చాలామందికి ఈ అవకాశం వచ్చింది. కానీ ఒక నటుడికి మాత్రం ఆయన ముఖం మీద సిగరెట్ పొగ ఊదే సన్నివేశం ఇచ్చారట. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 30 2026, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సుబ్బరాజు జీవితంలో మర్చిపోలేని సంఘటన..
Image Credit : our own

సుబ్బరాజు జీవితంలో మర్చిపోలేని సంఘటన..

సినిమా రంగంలో ప్రతీ నటుడికి తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. అలాంటి ఒక అరుదైన, మరచిపోలేని సన్నివేశం గురించి ప్రముఖ నటుడు సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అది కూడా ఎవరోతోనో కాడు బాలీవుడ్ షెహన్‌షా, బిగ్ బి అమితాబ్ బచన్ తో. బిగ్ బీతో కలిసి పనిచేసే సమయంలో ఎదురైన ఒక ఆసక్తికరమైన సీన్ గురించి సుబ్బరాజు వెల్లడించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సెట్స్‌లో ఊహించని సన్నివేశం..
Image Credit : our own

సెట్స్‌లో ఊహించని సన్నివేశం..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన హిందీ చిత్రం Bbuddah... Hoga Terra Baap. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ సినిమాలో ఒక సీన్‌లో సుబ్బరాజు బెంచ్ మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని, సిగరెట్ తాగుతూ ఉండాలి. పక్కన ప్రకాష్ రాజ్ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అమితాబ్ బచ్చన్ అక్కడికి వస్తారు. ఆ సీన్ ప్రకారం... సుబ్బరాజు సిగరెట్ తాగుతూ, ఆ పొగను నేరుగా అమితాబ్ బచ్చన్ ముఖం మీదకు ఊదుతూ ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.

34
వణికిపోయిన సుబ్బరాజు
Image Credit : Asianet News

వణికిపోయిన సుబ్బరాజు

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ ముఖంపై సిగరెట్ పొగ ఊదడం అంటే ఏ నటుడికైనా అది ఇబ్బందికరమైన పరిస్థితే. తీవ్రమైన భయం, హెసిటేషన్ ఉండడం సహజం. సుబ్బరాజుకు కూడా అదే జరిగింది. దర్శకుడు ఈ సీన్ వివరించగానే... "అన్నయ్య! నా వల్ల కాదన్నయ్య.. అంత పెద్ద నటుడి ముఖం మీద పొగ ఊది డైలాగ్ చెప్పడం నేను చేయలేను" అని ఒత్తిడికి గురయ్యారు. అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ మాత్రం "నీ క్యారెక్టర్ తీవ్రత సీన్‌లో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇది కచ్చితంగా చేయాల్సిందే" అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

44
అమితాబ్ కలగజేసుకుని ఏమన్నాడంటే?
Image Credit : Asianet News

అమితాబ్ కలగజేసుకుని ఏమన్నాడంటే?

ఈ గందరగోళం చూసిన అమితాబ్ బచ్చన్ స్వయంగా అక్కడకు వచ్చి ఏం జరుగుతోందని అడిగారు. విషయాన్ని తెలుసుకున్న ఆయన సుబ్బరాజు భయాన్ని గమనించి ఎంతో సరదాగా స్పందించారు. "ఏంటి ప్రాబ్లం? ధైర్యంగా చేసేయ్.. సీన్ డిమాండ్ బట్టి నువ్వు ఆ పని చేయాల్సిందే. ఇందులో ఆలోచించాల్సిన పని లేదు" అని ప్రోత్సహించారు. అమితాబ్ ఇచ్చిన హామీతో సుబ్బరాజు ధైర్యం తెచ్చుకుని, ఆ సీన్‌లో పర్ఫెక్ట్‌గా నటించి మెప్పించారు. తన 15 ఏళ్ల సినీ ప్రయాణంలో మర్చిపోలేని ఎమోషనల్ ఫీలింగ్ ఇచ్చిన సీన్లలో ఇదే నెంబర్ వన్ అని సుబ్బరాజు చాలా హ్యాపీగా చెప్పుకొచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aadarsha Kutumbam: ఆదర్శకుటుంబం స్టోరీ ఇదేనా, చాలా కాంప్లికేటెడ్ గా ఉందే.. వెంకీ మామ, త్రివిక్రమ్ పైనే భారం
Recommended image2
Urvashi Rautela: ఫోటో వాడినందుకు 7 వేల కోట్ల పరువు నష్టం దావా.. చిరంజీవి హీరోయిన్‌ బిగ్‌ షాక్‌
Recommended image3
ఒక్కపూట మాత్రమే భోజనం, రోజంతా ఏం తినకుండానే ఫిట్ గా ఉండే టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
ఒక్కపూట మాత్రమే భోజనం, రోజంతా ఏం తినకుండానే ఫిట్ గా ఉండే టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Rajamouli: 3 నెలల్లో సినిమా తీస్తా అని మాటిచ్చి... రెండేళ్లు సాగదీసిన రాజమౌళి, రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved