MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli: 3 నెలల్లో సినిమా తీస్తా అని మాటిచ్చి... రెండేళ్లు సాగదీసిన రాజమౌళి, రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్..

Rajamouli: 3 నెలల్లో సినిమా తీస్తా అని మాటిచ్చి... రెండేళ్లు సాగదీసిన రాజమౌళి, రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్..

Rajamouli: రాజమౌళితో సినిమా అంటే రెండుమూడేళ్లు అని ఫిక్స్ అవ్వాల్సిందే. జక్కన్న కెరీర్ లో చెక్కకుండా చాలా తక్కువ టైమ్ లో తీసిన సినిమా ఏదీ లేదు. ఓ సారి 3 నెలల్లో సినిమా చేద్దాం అని రమారాజమౌళికి మాటిచ్చి.. ఆమూవీని రెండేళ్లు చెక్కాడట. ఏంటా సినిమా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 30 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఇచ్చిన దర్శకుడు..
Image Credit : SSRajamouli/Instagram

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఇచ్చిన దర్శకుడు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకరత్నం ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన సృజనాత్మకతకు అద్దం పట్టే సినిమాలు ఎన్నో ఉన్నాయి. చిన్న సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా.. ఆడియన్స్ ను కట్టిపడేయడంలో ఆయన తరువాతే ఎవరైనా. జక్కన్నతో సినిమా అంటే ఎంత పెద్ద హీరో అయినా.. రెండు మూడేళ్లు టైమ్ ను రాసివ్వాల్సిందే. తక్కువలో తక్కువ ఏడాదైనా టైమ్ తీసుకుంటాడు స్టార్ డైరెక్టర్. ఒక సినిమాను మాత్రం ఆయన మూడు నెలల్లో తీసేద్దాం అని.. రమా రాజమౌళికి కాన్ఫిడెంట్ గా చెప్పాడట. కానీ ఆ సినిమా కూడా రెండేళ్లు సాగదియాల్సి వచ్చిందట. ఇంతకీ ఆసినిమా ఏదో కాదు.. ఈగ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అనుకోకుండా రూపుదిద్దుకున్న 'ఈగ'
Image Credit : our own

అనుకోకుండా రూపుదిద్దుకున్న 'ఈగ'

ర‌మా రాజ‌మౌళి చెప్పిన విషయాల ప్రకారం నిజానికి రాజమౌళి 'ఈగ' సినిమాను అంత పెద్ద ఎత్తున ప్లాన్ చేయలేదు. 'మగధీర' వంటి విజువల్ వండర్ తర్వాత, ప్రభాస్‌తో ఒక భారీ చిత్రాన్ని (బాహుబలి) పట్టాలెక్కించాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే లోపు ఒక చిన్న డిజిటల్ ఫిల్మ్‌గా, తక్కువ బడ్జెట్‌లో చాలా సరదాగా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని రాజమౌళి భావించారు. అలా ఆయన మనసులోకి వచ్చిన ఆలోచనే 'ఈగ'. అయితే, కథను డెవలప్ చేస్తున్న కొద్దీ దాని స్కోప్ మారుతూ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ పనితనం పెరుగుతున్న కొద్దీ ప్రాజెక్ట్ పరిమాణం పెరిగింది. అనుకోకుండా మొదలైన ఈ చిన్న ప్రయోగం, దాదాపు రెండు సంవత్సరాల సుదీర్ఘ శ్రమగా మారింది.

34
రెండు సంవత్సరాల కఠిన శ్రమ
Image Credit : netflix

రెండు సంవత్సరాల కఠిన శ్రమ

రమా రాజమౌళి మాట్లాడుతూ.. ''బాహుబలి కోసం పనిచేస్తున్నప్పుడు ఈగ మధ్యలో దూరింది. అది కూడా విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ఒక లైన్ రాజమౌళికి నచ్చడంతో.. ఈగ చేద్దాం అన్నారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని నేను అన్నప్పుడు.. పెద్ద విషయం కాదు.. 3 నెలల్లో కంప్లీట్ చేద్దాం.. చిన్న ప్రాజెక్టే కదా అని అన్నారు. కానీ సినిమా మొదలైన తర్వాత.. అన్నీ ఆడ్ అవుతూ వచ్చాయి. చివరకు ఈసినిమా కూడా రెండేళ్లు పట్టింది పూర్తవడానికి'' అని రమా రాజమౌళి అన్నారు.

ఒక ఈగను తెరపై సహజంగా చూపించడం సాంకేతికంగా ఎంతో సవాలుతో కూడుకున్న పని. దానికోసం రాజమౌళి ఆయన టీమ్ పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం, ప్రతి ఫ్రేమ్‌నూ నిశితంగా పరిశీలించడం రాజమౌళి స్టైల్. రెండు ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం వారు పడిన తపన, శ్రమ తుది ఫలితంలో ప్రతిబింబించింది. ఆ కష్టానికి తగ్గట్లే 'ఈగ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు జాతీయ పురస్కారాలను కూడా అందుకొంది.

44
రాజమౌళి పనిరాక్షసుడు –ర‌మా రాజ‌మౌళి మాటల్లో
Image Credit : others

రాజమౌళి పనిరాక్షసుడు –ర‌మా రాజ‌మౌళి మాటల్లో

ఈ ఇంటర్వ్యూలో ర‌మా రాజ‌మౌళి గారు రాజమౌళి వ్యక్తిగత అలవాట్లు, వర్క్ శైలి గురించి కొన్ని సరదా వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి శరీరం విశ్రాంతి తీసుకుంటుందేమో కానీ, ఆయన మెదడు మాత్రం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. వర్క్ నుంచి ఆయన మైండ్ ఎప్పుడూ రిలాక్స్ అవ్వదని ఆమె తెలిపారు. ఒక సినిమా లేదా సన్నివేశంపై దృష్టి పెట్టినప్పుడు రాజమౌళి తన చుట్టూ ఉన్న పరిసరాలను, సమయాన్ని, చివరికి ఆహారాన్ని కూడా మర్చిపోతారు. అని ఆమె అన్నారు. వెకేషన్ కు వెళ్లినా.. తన మనసులో ఉన్న కథలను, లైన్స్ ను నాతో పంచుకుంటారని రమా రాజమౌళి అన్నారు. చాలా సార్లు బయట రిలాక్స్ అవ్వడానికి వెళ్లి.. అక్కడే కథలు తయారు చేసిన రోజులు ఉన్నాయన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: వెయ్యి రూపాయలు ఇస్తేనే యాక్ట్ చేస్తా.. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టిన వెంకటేష్‌
Recommended image2
Nagarjuna: శోభనం పాటలో 'రాముడు', శివ శివా.. తప్పు అర్థం రాకుండా లిరిసిస్ట్ ఎలా రాశారో తెలుసా, హ్యాట్సాఫ్
Recommended image3
Rajinikanth: ఆటోలో ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్.. సూపర్ స్టార్ ను చూసి మురిసిపోయిన ఫ్యాన్స్
Related Stories
Recommended image1
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Recommended image2
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved