- Home
- Entertainment
- ప్రభాస్ కి అంత సీన్ లేదని చులకనగా చూసిన ప్రొడ్యూసర్..మూడు రోజులు నిద్ర లేదు, వణికించిన రెబల్ స్టార్
ప్రభాస్ కి అంత సీన్ లేదని చులకనగా చూసిన ప్రొడ్యూసర్..మూడు రోజులు నిద్ర లేదు, వణికించిన రెబల్ స్టార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సినిమాకి తన స్థాయి పెంచుకుంటూ గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సినిమాకి తన స్థాయి పెంచుకుంటూ గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. కల్కి చిత్రం 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. కల్కిని నాగ్ అశ్విన్ ఒక సినిమాటిక్ యూనివర్స్ లా చేయబోతున్నారు.
సరిగ్గా ప్లాన్ చేసి తదుపరి భాగాలు తెరకెక్కిస్తే వరల్డ్ మార్కెట్ ని కొల్లగొట్టడం పెద్ద కష్టం కాదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జపాన్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇదిలా ఉండగా ప్రభాస్ వల్ల ఒక నిర్మాత నిద్రలేనిరాత్రులు గడుపుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read: సౌందర్య 100 కోట్ల ఆస్తి.. ఎవరి సొంతం అయ్యింది..? వీలునామాలో హీరోయిన్ ఎవరి పేరు రాసింది..?
ఆ నిర్మాత ఎవరో కాదు.. తమిళంలో టాప్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా. జ్ఞానవేల్ రాజా హీరో సూర్యతో కంగువ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలోనే అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాహుబలి రికార్డులు బ్రేక్ చేసే చిత్రం అంటూ కోలీవుడ్ లో ఈ చిత్రంపై అంచనాలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ శివ ఆ తరహా అబ్బురపరిచే విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకు చూడని విజువల్స్ ఈ మూవీలో ఉంటాయట. అయితే ప్రభాస్ నటించిన కల్కి 2898 చిత్రంలో విజువల్స్ హాలీవుడ్ ని బీట్ చేసే స్థాయిలో ఉన్నాయి. చాలా మంది కల్కి చిత్రం గురించి చెబుతున్నా జ్ఞానవేల్ రాజా అంతగా పట్టించుకోలేదట.
gnanavel raja
కంగువని మించే విజువల్స్ ఉండవులే అని అనుకున్నారట. కానీ రీసెంట్ తాను కల్కి చిత్రాన్ని చూశానని.. ఆ విజువల్స్ ఎఫెక్ట్ తో మూడు రోజులు నిద్ర పోలేదని అన్నారు. అంతలా కల్కి చిత్రం తనపై ప్రభావం చూపినట్లు జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు.
జ్ఞానవేల్ రాజా మాటలని బట్టి చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకి వణికిపోయినట్లు ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కంగువ చిత్రాన్ని.. కల్కి విజువల్స్ తో పోల్చుకుంటే వాళ్లకే నష్టం అని అంటున్నారు. అనవసరమైన హైప్ తో కాకుండా సరైన అంచనాలతో సినిమాని తీసుకురావాలని సూచిస్తున్నారు. అక్టోబర్ 10న కంగువ రిలీజ్ కి రెడీ అవుతోంది.