MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవితో పెళ్ళి ఆఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

శ్రీదేవితో పెళ్ళి ఆఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

శ్రీదేవి అంటే అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. అటువంటి అందాలతారతో పెళ్లి చేస్తామంటే నో చెప్పాడట స్టార్ హీరో. ఇంతకీ ఎవరతను? ఎందుకు కుదరదని చెప్పాడు?  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 19 2025, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Lady Super Star Sridevi

Lady Super Star Sridevi

అందాల తార అతిలోక సుందరి, దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి. అందానికి ఆమె నిర్వచనంగా నిలిచారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది శ్రీదేవి. 54 ఏళ్ల వయస్సులో అనుమాన్పదంగా మరణించారు శ్రీదేవి. అప్పటికీ ఆమె ఇమేజ్ కాని, గ్లామర్ కాని ఏమాత్రం తగ్గలేదు. అయినా సరే తన వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుని మామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు శ్రీదేవి. కాని అభిమానులకు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. 

Also Read: నయనతార తో బ్రేకప్ కు ప్రభుదేవా పెట్టిన 3 షాకింగ్ కండీషన్స్ కారణమా? ఇంతకీ ఆ షరతులేంటి?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Sridevi

Sridevi

శ్రీదేవి ఏ భాషలో సినిమా చేసినా.. ఆభాషవారు మా  ఇండస్ట్రీ అమ్మాయే అనుకునేలా ఉందేవారు. తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్లే. మరీ ముఖ్యంగా చిరంజీవి జోడీగా ఆమె నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో శ్రీదేవి ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. అప్పటి నుంచే ఆమె అందాన్ని అతిలోక సందరిగా పిలుచుకోవడం మొదలు పెట్టారు అభిమానులు. 

Also Read: సుకుమార్ కు ఎంతో ఇష్టమైన రామ్ చరణ్ సినిమా? ఎన్ని సార్లు చూశాడో తెలుసా?

37
bollywood actress sridevi

bollywood actress sridevi

శ్రీదేవిని సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా దేవతలా ఆరాధించేవారు. ఇక రామ్ గోపాల్ వర్మ లాంటి అభిమానులు అయితే శ్రీదేవిపై పిచ్చి ప్రేమను పెంచుకున్నారు. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయారు. శ్రీదేవి గురించి ఎన్నో సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. ఆమెను అంతలా ఆరాధించాడా వర్మ అని అనుకునేలా చేస్తాయి. 

Also Read: 1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన మహేష్ బాబు సినిమా, వరల్డ్ రికార్డ్ సాధించిన సూపర్ స్టార్ మూవీ.

47
Sridevi

Sridevi

శ్రీదేవి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. కాని ఆమె పెళ్ళి మాత్రం అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న నిర్మాత భోనీకపూర్ తో జరిగింది. అయితే అంతకు ముందు శ్రీదేవిని ఓ స్టార్ హీరోకు ఇచ్చి పెళ్ళి చేయాలి అని ఆమె తల్లి అనుకున్నారట. కాని ఆ హీరో మాత్రం శ్రీదేవిని పెళ్లి చేసుకోలేదు. కారణం ఏంటో స్వయంగా  ఆ స్టార్ హీరో కమ్ నిర్మాతే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ అతను ఎవరు? శ్రీదేవితో పెళ్లికి ఎందుకు నో చెప్పాడు. 

Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

57

శ్రీదేవితో పెళ్లి మిస్ చేసుకున్న ఆ వ్యక్తి ఎవరో కాదు.. అలనాటి అందాల నటుడు, నిర్మాత  మురళి మోహన్. ఒకప్పుడు మురళీ మోహన్ కు హీరోగా  మంచి గుర్తింపు ఉందడేది. ఆతరువాత కాలం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. తన కెరీర్ లో  మురళీ మోహన్ దాదాపు 400 వరకూ సినిమాల్లో నటించారు. నటుడిగా కొనసాగుతూనే బిజినెస్ మెన్ గా,  నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా  ఎదిగారు మురళీ మోహన్.  ప్రస్తుతం మురళీ మోహన్, రాజకీయాలకు, వ్యాపారాలకు, అటు  సినిమాలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించి హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

Also Read: 21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?

67

అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మురళీమోహాన్. అలా ఇచ్చి ఓ ఇంటర్వ్యూలోనే ఈ విషయాలు పంచుకున్నారాయన. ఇంతకీ శ్రీదేవి విషయంలో ఆయన ఏమన్నారంటే.. కెరీర్ బిగినింగ్ లోతను వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైమ్ లో.. అటు శ్రీదేవి కూడా వరుస సినిమాలతో స్టార్ గా రాణిస్తున్నారట. ఆ సమయంలో  శ్రీదేవి తల్లికి మురళీ మోహన్ ను, ఆయన పద్దతులను చూడగానే  అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్నీ శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించారు కూడా. 

77
Actress Sridevi

Actress Sridevi

అయితే ఓసారి శ్రీదేవితో కలిసి ఆమె తల్లి మురళీమోహన్ ఇంటికి కూడా వచ్చారట.. కాని అప్పుడే వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే  అప్పటికే మురళీమోహన్ కు  పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం ఆమెకు తెలియక శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారని తెలుస్తోంది. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడగ్గా ఆయన షాక్ అయ్యారట. తనకు పెళ్ళై పిల్లలున్నారని , కుదరదని చెప్పారట మురళీమోహన్. ఈ విషయాన్నిఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతే కాదు ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలు ఆయను పంచుకున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved