సుకుమార్ కు ఎంతో ఇష్టమైన రామ్ చరణ్ సినిమా? ఎన్ని సార్లు చూశాడో తెలుసా?
రామ్ చరణ్ సినిమాలలో డైరెక్టర్ సుకుమార్ కు ఎంతో ఇష్టమైన సినిమా ఏదో తెలుసా? సుకుమార్ ఎంతో ఇష్టంగా ఎన్నో సార్లు చూసిన సినిమా ఏది? కారణం ఏంటి?

కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ మర్చిపోలేము. సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేస్తుంటాయి. అలాంటి కాంబోలలో రామ్ చరణ్, సుకుమార్ కాంబో కూడా ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ లో కూడా చాలా మార్పు వచ్చింది.
సినిమాల సెలక్షన్ తో పాటు, బిహేవియర్ లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇక రంగస్థలం తరువాత దాదాపు ఏడేళ్లకు మళ్ళీ వీరి కాంబినేషన్ కలవబోతోంది. రామ్ చరణ్ సుకుమార్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి వీళ్ళిద్దరు ఏం మ్యాజిక్ చేస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు.
Also Read: 1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన మహేష్ బాబు సినిమా, వరల్డ్ రికార్డ్ సాధించిన సూపర్ స్టార్ మూవీ.
పుష్పసీక్వెల్స్ నుంచి కాస్త రిలాక్స్ అయ్యాడు సుకుమర్. పుష్ప3 కోసం ఇంకా రెండేళ్ళు పట్టే అవకాశం ఉంది. ఇంతలో అల్లు అర్జున్ అట్లీ,త్రివిక్రమ్ సినిమాలు కంప్లీట్ చేసుకుంటాడు. ఇటు సుకుమార్ రామ్ చరణ్ సినిమాను చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం చరణ్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడటసుక్కు. త్వరలో ఈ సినిమాకు సబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ రాబోతున్నట్టు సమాచారం.
Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?
ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. రామ్ చరణ్ తో సుకుమార్ ది చాలా ప్రత్యేకమైన అనుబంధం. చరణ్ కెరీర్ ను ఓ మలుపుతిప్పిన దర్శకుడు సుకుమార్. మరి గ్లోబల్ స్టార్ సినిమాలన్నింటిలో సుకుమార్ కు ఏ సినిమా నచ్చుతుందో తెలుసా? రామ్ చరణ్ సినిమాల్లోఆయన ఎక్కువగా చూసిన సినిమా ఏది.? ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సుకుమార్ కి రామ్ చరణ్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలంటే బాగా ఇష్టమట. అందులో ఒకటి చిరుత, మరొకటి మగధీర
Also Read: మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ ఏమన్నారంటే?
ఇక రామ్ చరణ్ కెరీర్ మొదట్లో చేసిన ఈ రెండు సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ రెండు సినిమాలు అయినా.. సీనియర్ల కంటే అద్భుతంగా నటించాడు. ఈసినిమాలు చూసిన తరువాతే ఆయన ఎలాగైనా రామ్ చరణ్ తో మంచి సినిమా చేయాలి అనుకున్నాడట. అలా అనుకుని వర్కౌట్ చేసిందే రంగస్థలం సినిమా. డీగ్లామర్ రోల్, అందులోను చెవిటి చిట్టిబాబు పాత్ర, ఏమాత్రం ఆలోచించకుండా.. అద్భుతంగా చేశాడు రామ్ చరణ్. మరోసారి వీరి కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అని ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read: వడివేలుని తన సినిమా నుంచి గెంటేసిన భారతీరాజా, కారణం ఏంటి? అసలేం జరిగిందంటే?
ఇక ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా రెండు డిజాస్టర్స్ ను ఫేస్ చేశాడు రామ్ చరణ్, ఆచార్యతో పాటు రీసెంట్ గా చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో నిరాశపరిచింది. అయినా సరే రామ్ చరణ్ మార్కెట్ కాని, ఆయన ఇమేజ్ కాని ఏమాత్రం తగ్గలేదు. ఇక బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాపై మెగా ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
హ్యాట్రిక్ ఫెయిల్యూర్ అన్న పేరు రాకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు. బుచ్చాబాబు సినిమా కనుకు బ్లాక్ బస్టర్ అయితే.. ఆనెక్ట్స్ సుకుమార్ సినిమాగురించి నిశ్చింతగా ఉండొచ్చు. బుచ్చిబాబు సినిమాలో కూడా సుకుమార్ఓ చేయి వేస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి గురు శిష్యులు ఏంచేస్తారో చూడాలి.