- Home
- Entertainment
- కుక్కల కోసం 45 కోట్లు ఖర్చుపెట్టిన స్టార్ హీరో, 116 కుక్కలకు ఆస్తి రాసిచ్చి సెలబ్రిటీ ఎవరో తెలుసా?
కుక్కల కోసం 45 కోట్లు ఖర్చుపెట్టిన స్టార్ హీరో, 116 కుక్కలకు ఆస్తి రాసిచ్చి సెలబ్రిటీ ఎవరో తెలుసా?
పెంపుడు జంతువులను ప్రేమగా చూసేవాళ్లను చూసి ఉంటాం, బర్త్ డేలు చేసేవాళ్ళను కూడా చూసి ఉంటాం, కాని పెంపుడు కుక్కలకు ఆస్తిని రాసిచ్చినవారిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ఎదిగిన ఈ హీరో అదే పని చేశాడు. ఇంతకీ ఎవరాయన?

బాలీవుడ్‌లో జంతు ప్రేమికులు చాలా మంది ఉన్నారు. కన్నబిడ్డలకంటే పెంపుడు జంతువులనే ప్రేమగా చూసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కుక్కలు పెంచుకుంటూ..వారిలో ఒత్తిడిని తగ్గించుకునే స్టార్ సెలబ్రిటీలు అయితే ఎంతో మంది. అందులోను సెలబ్రిటీల చేతుల్లో పెరిగే కుక్కల సంగతి అయితే చెప్పనక్కర్లేదు.
వాటికి రాజబోగాలు తప్పవు. అయితే ఎవరి ఇంట్లో అయినా.. ఉంటే ఒకట్రెండు కుక్కలు ఉంటాయి.. లేదా డబ్బున్నోల్లు మహా అయితే ఓ పది కుక్కలు పెంచుతారేమో కాని.. ఓ బాలీవుడ్ నటుడు మాత్రం ఏకంగా 116 కుక్కలు పెంచుతున్నాడు. ఏకంగా వాటిని తన ఆస్తినే రాసిచ్చేశాడు.
Also Read: అడుగు పెడితే 1000 కోట్లు, 500 కోట్లకు తగ్గేదే లేదు, హీరోలకు సెంటిమెంట్ గా మారిన లక్కీ హీరోయిన్ ఎవరు?
అంతే కాదు ఆ కుక్కలకు కూడా లగ్జరీ లైఫ్ ను రుచి చూపిస్తున్నాడు .. ఈ కుక్కలకు చిన్న చితకా ఇల్లు సరిపోదు కదా.. అందుకే వాటి కోసం విలాసవంతమైన మినీ ఫామ్ హౌస్ కట్టేశాడు. తన ఆస్తిలో చాలా వరకూ కుక్కల కోసమే ఖర్చు చేస్తున్నాడు. ఇంతకీ ఈ డాగ్ లవర్ మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి. 80స్ లో ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపి వదిలిపెట్టిన ఈహీరో, ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా
మిథున్ చక్రవర్తి బాలీవుడ్‌లో ఎంత పెద్ద స్టారో అందరకి తెలిసిందే కాని ఆయన ఇంత పెద్ద డాగ్ లవర్ అని మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. ముంబై తో పాటు ఇండియాలో తనకు ఆస్తులు ఉన్న ఇతర ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా కుక్కలను పెంచుతున్నాడు మిథున్ చక్రవర్తి.
నాలుగైదు ప్రాంతాల్లో మిథున్ పెంచుతున్న కుక్కల సంఖ్య 116 కు పైనే. నివేదికల ప్రకారం, నటుడు ముంబై సమీపంలోని మడ్ ఐలాండ్‌లో తన 1.5 ఎకరాల భూమిలో 76 కుక్కలను పెంచుతున్నాడట.
Also Read:ఆ పాట ఎందుకు పాడానో అని బాధపడుతున్నా, శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు
హౌసింగ్.కామ్ ప్రకారం ఆ కుక్కల కోసం కేటాయించిన ఆస్తి విలువ దాదాపు 45 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఆయన వ్యక్తిగత నివాసం కూడా ఉంది. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే.. మిథున్ చక్రవర్తి తన ఇంటి స్థలాన్ని ఎక్కువ శాతం కుక్కల కోసం కేటాయించారు.
మిథున్ తను పెంచుతున్న కుక్కలతో పాటు.. తన ప్రెండ్స్ కుక్కల కోసం కూడా ఆయనే ఖర్చు చేస్తుంటారట. వాటి కోసం ప్రత్యేకంగా టన్నెల్, అవి ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్లను ఏర్పాటు చేశాడట మిథున్.
Also Read:100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?
ఇక మిథున్ చక్రవర్తి కుక్కల పెంపకం గురించి ఆయన కోడలు నటి మదాల్సా శర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కుక్కల కోసం తన మామ ఏం చేశారన్న విషయం గురించి ఆమె వెల్లడించింది. మిథున్ ఇంట్లో కుక్కల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయట. వాటి సంరక్షణకు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారట.
కుక్కలను చిన్న పిల్లల్లాగే చూడాలి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సమయానికి ఆహారం అందించాలి. అంటూ మిథున్ చక్రవర్తి తెగ హడావిడి చేస్తుంటారట. మిథున్ చక్రవర్తి ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా సత్తా చాటారు.
చాలా పేదరికంలో పెరిగిన ఆయన.. కెరీర్ బిగినింగ్ లో కూడా ఆ పేదరికాన్ని అనుభవించారు. సినిమా అవకాశా కోసం చూస్తు.. మిథున్ చక్రవర్తి రైల్వే స్టేషన్, ఫుట్‌ఫాత్ ల పైన నిద్రపోయిన రోజులు ఉన్నాయట. అలా కష్టపడుతూ.. స్టార్ హీరోగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు.
Also Read:కమల్ హాసన్ తో ఎఫైర్, భర్త వేధింపులు, ఆస్తి పేదలకు దానం చేసి మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మిథున్ చక్రవర్తి తెలుగులో కూడా నటించారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించి గోపాల గోపాల మూవీలో మెయిన్ విలన్ గా నటించి మెప్పించారు. ఒక్క అవకాశంతో తనేంటో నిరూపించుకున్న మిథున్.
వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన ఆస్తి దాదాపు 400 కోట్లు ఉంటుందని అంచనా. ఊటీలోని మడ్ ఐలాండ్‌లో మిథున్‌కు ఇల్లు కూడా ఉంది. అనేక హోటళ్లు , కాటేజీల యజమాని కూడా.
ముంబైకి సమీపంలో ఫామ్ హౌస్ ఉన్న మిథున్ చక్రవర్తికి మైసూర్‌లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇక రెండు పెళ్ళిళ్ళతో అప్పట్లో వార్తల్లో నిలిచిన మిథున్ కు శ్రీదేవితో అఫైర్ ఉన్నట్టు, వాళ్ళిద్దరు పెళ్ళి కూడా చేసుకున్నట్టు రూమర్స్ ఉన్నాయి.
నిజం ఎంటో ఎవరికి తెలియదు. ఇక మిథున్ చెత్తకుండీలో దొరికిన ఓ పాపను తన బిడ్డలా పెంచి పెద్ద చేశారు. వ్యక్తిగతంగా సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆయన బిజేపీలో కొనసాగుతున్నారు.