MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అడుగు పెడితే 1000 కోట్లు, 500 కోట్లకు తగ్గేదే లేదు, హీరోలకు సెంటిమెంట్ గా మారిన లక్కీ హీరోయిన్ ఎవరు?

అడుగు పెడితే 1000 కోట్లు, 500 కోట్లకు తగ్గేదే లేదు, హీరోలకు సెంటిమెంట్ గా మారిన లక్కీ హీరోయిన్ ఎవరు?

వరుస విజయాలు ఆ హీరోయిన్ కు కలిసి వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి లక్క్ గా మారింది. సెంటిమెంట్ గా తయారయ్యింది. ఆమె ఉంటే సినిమా హిట్టు అంటున్నారు మేకర్స్. ఇంతకీ ఎవరామె?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 02 2025, 07:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వరుస విజయాలతో దూసుకుపోతోంది ఈ హీరోయిన్.  స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్  తో పాటు బాలీవుడ్ లో కూడా  తిరుగులేని విజయాలు నమోదు చేస్తోంది బ్యూటీ. అడుగు పెడితే 1000 కోట్లు. లేదా 500 కోట్లకు తగ్గేదే లేదంటోంది.సక్సెస్ కు చిరునామాగా మారిన ఈ హీరోయిన్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. మరికొన్నేళ్లు.. డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్న ఈబ్యూటీ ఎవరో తెలుసా? 

26

ఆమె ఎవరో  కాదు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అంతే కాదు సక్సెస్ ఫుల్ హీరోయిన్ కూడా. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో రష్మికా ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ మూవీలో బిజీగా ఉంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేస్తోంది. ఛావా సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. ఈసినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది.  

36

పుష్ప2 సినిమా  రికార్డ్స్ బ్రేక్ చేయండంతో రష్మిక డిమాండ్ భారీగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక రోల్ పెద్దగా లేకపోయినా.. పుష్ప2లో మాత్రం కథ అంతా హీరోయిన్ చుట్టునే తిరిగింది. రష్మిక కు పెర్ఫామెన్స్ ఎక్కువగా చేసే అవకాశం పుష్ప2లో వచ్చింది. దాంతో ఆమె నటనకు ఫిదా అవుతున్నారు  జనాలు. ఇక మేకర్స్ అయితే రష్మిక ఉంటే సినిమా హిట్ అంటూ.. లక్కీ హీరోయిన్ గా ప్రకటించేశారు.

46

రష్మికా మందన్నా నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ వచ్చాయి. బాలీవుడ్ లో  యానిమల్ సినిమా 900 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఇక  పుష్ప 2 సినిమా దాదాపు 1900 కోట్ల కొల్లగొట్టింది. ఇక తాజాగా  ఛావా 500 కోట్లు దాటి ఇంకా నడుస్తూనే ఉంది.  మూడు సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాల సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్నా.. తాజాగా  షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. మధ్యలో ఇలా ఫోటోషూట్ తో సందడి చేసింది. తన సంతోషాన్ని ఇలా ఫోటోషూట్ రూపంలో పంచుేకుంది బ్యూటీ. 

56

పసుపు రంగు సెల్వార్ లో రష్మికా మందన్నా కనిపించింది. కొన్ని ఫోటోలు షేర్ చేసిన రష్మికా మందన్నాకు అభిమానులు సూపర్ కామెంట్లు చేశారు. క్యూట్, బ్యూటిఫుల్ అంటూ పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. రష్మికా అందానికి ఫిదా అవుతున్నారు.

 

66

రష్మికా మందన్నా, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన సికందర్ సినిమా ఈద్ పండుగకు విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ ను రష్మికా మందన్నా ఇటీవల షేర్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ జనాలు మరో సూపర్ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు వరుస విజయాల్లో ఉన్న రష్మికా మందన్నా కూడా 4వ బ్లాక్ బస్టర్ సినిమా సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతోంది. 

ఇక ఆమె కోసం నిర్మాతలు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే 10 కోట్లకు పైగా తీసుకుంటూ వస్తున్న రష్మిక. ఇక నుంచి 20 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సుకుమార్ లాంటి దర్శకులు హీరోయిన్లను రిపిట్ చేయరు. కాని సుకుమార్ ఈసారి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. తన నెక్ట్స్ సినిమాలో కూడా శ్రీవల్లినే తీసుకోబోతున్నాడని టాక్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోలేదు, సినిమాపై అనుమానాలు.. ప్రకాష్ రాజ్ పై వైరల్ కామెంట్స్
Recommended image3
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved