- Home
- Entertainment
- ట్రైన్‌లోనే ఫస్ట్ నైట్ చేసుకున్న ఏకైక హీరో ఎవరో తెలుసా? రాఘవేంద్రరావు మామూలోడు కాదు, ఎంత పనిచేశాడు!
ట్రైన్‌లోనే ఫస్ట్ నైట్ చేసుకున్న ఏకైక హీరో ఎవరో తెలుసా? రాఘవేంద్రరావు మామూలోడు కాదు, ఎంత పనిచేశాడు!
Raghavendra rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన సినిమాల్లో హీరోయిన్లపై పూలు పండ్లు వేయడం సర్వసాధారణం. అలానే ఓ స్టార్ హీరో ఫస్ట్ నైట్‌ని ట్రైన్‌లో ప్లాన్ చేశాడు, పూలు పండ్లతో డెకరేట్ చేయించాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Raghavendra rao
Raghavendra rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. హీరోయిన్లపై పూలు, పండ్లు వేయని మూవీ అంటూ ఉండదు. ఆయన ప్రతి పాటలోనూ అలాంటి సీన్లు పెడతాడు. కనీసం ఒక్క పాటలో అయినా అలాంటివి ఉండాల్సిందే. అది రాఘవేంద్రరావు మార్క్ బ్రాండ్.
అంతేకాదు హీరోయిన్లు కూడా అలాంటివే కోరుకునేవారు. అప్పట్లో అదో క్రేజ్. మాస్ ఆడియెన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే సీన్లు అవే. ఇంకా చెప్పాలంటే అలాంటి సన్నివేశాల కోసమే రాఘవేంద్రరావు సినిమాలకు క్యూ కట్టేవారు ఆడియెన్స్.
Raghavendra rao
కొందరు దర్శకులకు ఒక సెపరేట్ బ్రాండ్ ఉంటుంది. వారి పేరుమీదనే సినిమాలు ఆడతాయి. అలాంటి వారిలో రాఘవేంద్రరావు ఒకరు. సినిమా పోస్టర్‌పై `రాఘవేంద్రరావు బీఏ` పడిందంటే మాస్ ఆడియెన్స్ క్యూ కట్టాల్సిందే. అంతటి క్రేజ్ ఆయనది. అంతేకాదు బిజినెస్ పరంగానూ ఆ క్రేజ్ ఉండేది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి సార్లు ఉన్నా, అప్పట్లో రాఘవేంద్రరావు దర్శకత్వం మెయిన్‌గా సెలబుల్ కంటెంట్‌గా ఉండేది.
అయితే రాఘవేంద్రరావు సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు, హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు పెట్టడంలో బాగా దిట్ట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ రియల్ లైఫ్‌లో కూడా అదే చేశాడు. ఓ స్టార్ హీరోకి ఏకంగా తనదైన స్టయిల్‌లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాడు, అది కూడా ట్రైన్‌లో కావడం విశేషం.
Raghavendra rao, chiranjeevi
రాఘవేంద్రరావు ట్రైన్‌లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది ఎవరికో కాదు, మెగాస్టార్ చిరంజీవికి కావడం విశేషం. అవును మీరు చదివింది నిజమే. చిరంజీవి, సురేఖలకు కోసం ఆయన ట్రైన్‌లో ప్రత్యేకంగా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయించారు. స్పెషల్ బెర్త్ బుక్ చేయించి మరీ ఈ పని చేశారు.
అటు చిరంజీవి, ఇటు సురేఖలకు పెద్ద షాక్ ఇచ్చాడు. ట్రైన్ ఎక్కేంత వరకు ఈ విషయం వారికి కూడా తెలియదు. చూసి వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ ఎక్స్ పీరియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది అని అటు చిరంజీవి, ఇటు ఆయన భార్య సురేఖ కూడా చెబుతారట.
chiranjeevi, surekha
మరి ఇంతకి ఎప్పుడు ఈ పని జరిగింది? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అనేది చూస్తే. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఈ అబ్బాయి భవిష్యత్‌లో పెద్ద స్టార్ అవుతాడని గమనించిన అ్లలురామలింగయ్య.. సినిమా పెద్దలతో ఒత్తిడి చేయించి తన కూతురు సురేఖతో చిరంజీవిని పెళ్లికి ఒప్పించి, మ్యారేజ్ చేశాడు.
సురేఖతో ఆయన పెళ్లి కేవలం మూడు రోజుల్లోనే జరిగింది. ఆ సమయంలో చిరంజీవి చాలా బిజీగా ఉన్నారు. 1980 ఆయన అత్యంత బిజీగా ఉన్న ఏడాది. ఆ ఒక్క ఏడాది ఆయన్నుంచి 14 సినిమాలు విడుదలయ్యాయంటే ఏ రేంజ్‌లో బిజీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా మూడు షిఫ్ట్ ల్లో షూటింగ్‌లు జరిగేవి.
chiranjeevi, surekha
దీంతో చిరంజీవికి పెళ్లి చేసుకోవడానికి కూడా టైమ్ లేదు. ఆయన మ్యారేజ్‌కి కేవలం మూడు రోజుల సెలవులు మాత్రమే దొరికాయి. ఆ మూడు రోజుల్లో ఒక రోజు ఎంగేజ్‌మెంట్, పెళ్లి కొడుకుని చేయడం, రెండో రోజు పెళ్లి, మూడో రోజు పెళ్లి తర్వాత కార్యక్రమం, అంతే. కనీసం ఫస్ట్ నైట్ కి కూడా టైమ్ లేదు.
ఆ తర్వాత సినిమాల షూటింగ్‌లకు వెళ్లిపోయారు చిరంజీవి. అప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో నటిస్తున్నారు. ఊటీలో షూటింగ్ జరుగుతుంది. కొన్ని రోజుల్లోనే ఆ మూవీ షూటింగ్ అయిపోయింది. తన కోసం చిరు ఫస్ట్ నైట్‌ని కూడా త్యాగం చేశాడు. ఏదైనా స్పెషల్‌గా చేయాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు.
chiranjeevi, surekha
అందుకే షూటింగ్ అయిపోగానే చిరంజీవి ట్రైన్‌లో చెన్నై వెళ్తున్నారు. దీంతో ఆ ట్రైన్‌లోనే స్పెషల్ బెర్త్ ని బుక్ చేసి, అందులో ఫస్ట్ నైట్‌లాగా డెకరేట్ చేయించి చిరంజీవికి సర్‌ప్రైజ్ చేశారు.
వారి జీవితంలో అది ఎప్పటికీ మర్చిపోయేలేని రోజుగా మిగిల్చారు. సినిమాల్లో తరహాలోనే ఆ బెర్త్ ని పూలు, పండ్లతో డెకరేట్ చేయడం విశేషం. ఆ మధ్య `సౌందర్య లహరి` టాక్ షోలో మెగాస్టార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
also read: ప్రభాస్, ప్రశాంత్ వర్మ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. రవితేజ హీరోయిన్‌తో డార్లింగ్ రొమాన్స్ ?