కోటా శ్రీనివాసరావు పై ఉమ్మేసిన స్టార్ హీరో, అంత కోపం ఎందుకు, ఎవరా హీరో?
స్టార్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు పై టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు కాండ్రించి ఉమ్మేశాడట. అంత అమానం జరిగినా కోటా ఏం మాట్లాడలేదట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన అలా చేయడానికి కారణం ఏంటి? కోటా స్వయంగా చెప్పిన బ్యాక్ గ్రౌండ్ స్టోరీ.

Kota Srinivasa rao
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు కోటా శ్రీనివాసరావు. దాదాపు 5 దశాబ్ధాల పాటు రకరకాల పాత్రల్లో నటించి సినిమా ఇండస్ట్రీకి సేవ చేశాడు కోటా. ఆయన వేయని పాత్ర లేదు. చేయని క్యారెక్టర్ లేదు. కోటా ఉంటే ఆసినిమా హిట్అని ఫిక్స్ అయ్యేవారు. కొన్ని వందల సినిమాల్లో విభిన్న పాత్రలో మెరిసిన కోటా శ్రీనివాసరావు. ప్రస్తుతం 82 ఏళ్ళ వయస్సులో కదల్లేక వయోభారంతో ఇంట్లోనే ఉంటున్నారు.
Kota Srinivasa rao
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ నటులతో కోటా శ్రీనివాసరావు ఒకరు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడుగా ఆయన కొనసాగారు. విలన్ గా , కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,సింగర్ గా, రచయితగా, దర్శకుడిగా... నిర్మాతగా.. ఇలా ఇండస్ట్రీలో అన్ని రంగాలను టచ్ చేశారు కోటా. ఏ పాత్ర చేయాలి అన్నా.. ప్రాణం పెట్టి నటిస్తుంటారు కోటా శ్రీనివాసరావు.
Also Read: మోహన్ బాబు బయోపిక్, మంచు విష్ణు నిర్మాత, మరి హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
Kota Srinivasa rao
ఆకరికి ట్రాన్స్ జెండర్ పాత్రలు కూడా చేసిన కోటా శ్రీనివాసరావుకు నటించడం అంటే ప్రాణం. అందుుకే ఇప్పుడు ఈ వయస్సులో కూడా నడవలేని స్థితిలో కూడా నటిస్తాను అంటున్నారు. అంతే కాదు ఊపిరి ఉన్నంత వరకూ నటించాలి అనేది ఆయన ఆశ. వీల్ చైర్ లో కూర్చుని అయినా నటిస్తాను అంటున్నారు కోటా. కాని ఆయనకు అవకాశాలే రావడంలేదు. 80 ఏళ్ళు దాటిన ఈ స్టార్ టాలెంటెడ్ యాక్టర్ ఇంటికే పరిమితం అయ్యారు.
Also Read: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న త్రివిక్రమ్, నెక్ట్స్ ఏంటి.? మాటల మాంత్రికుడి ప్లాన్ మామూలుగా లేదుగా
ఇక అప్పుడప్పుడు ఓపిక ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కోటా. ఈక్రమంలో కొన్ని కాంట్రవర్సీలు కూడా చేస్తూ వస్తున్నారు. స్టార్లపై కామెంట్లు, సినిమాలపై కామెంట్లు, హీరోయిన్లపై కూడా కోటా కామెంట్లు సంచలనం అవుతుంటాయి కొన్ని సందర్భాలలో.
ఈక్రమంలోనే తనపై జరిగిన దాడులు. విమర్శలు, ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో తనపై ఉమ్మి వేశాడటంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కోటా శ్రీనివాసరావ్. ఇంతకీ ఆ హీరో అలా ఎందుకు చేశాడు. ఎవరు ఆహీరో. ఆ హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఆయన అలా చేయడానికి కూడా ఓ కారణం ఉందట. అది కూడా కోటానే వెల్లడించారు.
Also Read: 700 కోట్ల ఆస్తికి యజమాని, పాన్ వరల్డ్ ను ఏలుతున్న ఇండియాన్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?
ఆయనకు ఇంత అవమానం ఎందుకు జరిగిందో కూడా వివరించారు కోటా. ఓ సందర్భంలో రాజమండ్రి షూటింగ్ కు వెళ్తే.. ఒకే హోటల్ లో దిగారుట కోటా, బాలయ్య. కోటా శ్రీనివాసరావు లిప్ట్ దగ్గర ఉండగా.. బాలయ్య అక్కడికి వచ్చారట. దాంతో నమస్కారం బాబు అని కోటా ఎదురువెళ్ళగా.. ఆయన కోపంతో కాండ్రించి ముఖం మీదే ఉమ్మేశారట. ఇక అప్పుడు బాలయ్య సీఎం కొడుకు, పెద్ద హీరో కావడంతో.. తానేమి అనలేదని అన్నారు కోటా.
Also Read: రామ్ చరణ్ ను చిరంజీవి ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో తెలుసా? మెగా ఫ్యాన్స్ కు పండగే.
అయితే ఆ తరువాత కాలంలో తాము చాలా సి నిమాలు చేశామని. క్లోజ్ గానే ఉంటారని, బాలయ్యను గురించి చెప్పుకొచ్చారుకోటా. ఇక కోటాపై బాలయ్యకు ఎందుకు అంత కోపం అంటే.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మండలాదీశుడు అనే సినిమాను తీశారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమా లో ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తారు.
ఈ పాత్రలో కోటా శ్రీనివాస్ రావు నటించారు. అది కూడా ముందుగా చెప్పకుండా చివరి నిమిషయంలో చెప్పారట. ఇక ఆ పాత్ర అలా చేసినందుకు కోటాపై నందమూరి అభిమనులు, ఫ్యామిలీ సభ్యులు మండిపడటంతో పాటు.. ఫ్యాన్స్ దాడి కూడా చేశారు. ఇలా బాలాయ్య చేసిన పనిలో తప్పేమి లేదు అంటూ కోటా చెప్పడం కొసమెరుపు.