- Home
- Entertainment
- సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న త్రివిక్రమ్, నెక్ట్స్ ఏంటి.? మాటల మాంత్రికుడి ప్లాన్ మామూలుగా లేదుగా
సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న త్రివిక్రమ్, నెక్ట్స్ ఏంటి.? మాటల మాంత్రికుడి ప్లాన్ మామూలుగా లేదుగా
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..? మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? సినిమాలు మానేసి మాటల మాంత్రికుడు వేయబోతున్న అతి పెద్ద స్టెప్ ఏంటి..?

trivikram srinivas
టాలీవుడ్ లో ఎంత మంది దర్శకులు ఉన్నా.. పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నా.. మాటల మాత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ మార్క్ ఇమేజ్ మాత్రం ఎవరికీ రాదు. ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు, ఉంటారు కూడా. త్రివిక్రమ్ పంచ్ లకు, లాజిక్ లకు పొట్టపట్టుకు నవ్వకునే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఈ టైప్ ఆడియన్స్ కు హీరోలతో సబంధం లేదు. ఏహీరోతో అయినా ఆట రక్తి కట్టించగల సత్తా ఉన్నదర్శకుడిగా త్రివిక్రమ్ కు పేరు ఉంది.
trivikram srinivas,
ఎప్పుడో డైరెక్టర్ విజయ్ భాస్కర్ దగ్గర రైటర్ గా చేరి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి అద్భుతమైన మూవీస్ కు అత్యద్భుతమైన డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్. దర్శకుడిగా కూడా అంతే అద్భుతం చేశారు. నువ్వే నువ్వేతో మొదలుపెట్టి.. జల్సా, అతడు, అత్తారికంటిక దారేది,ఆఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద్ సమేత, అజ్ఞాతవాసి, గుంటూరు కారం ఇలా ఎన్నో మంచి సినిమాలు త్రివిక్రమ్ ఆలోచనలనుంచి పుట్టినవే. అంత అద్భుతమైన సినిమల్లో కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.
Also Read: ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
అవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు, త్వరలో సినిమాపై ప్రకటన రాబోతుందంటూ చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. త్రివిక్రమ్ సినిమా కోసమే అల్లు అర్జున్ పుష్ప గెటప్ నుంచి బయటకు వచ్చాడని, లుక్ ను కంప్లీట్ గా ఛేంజ్ చేశాడని టాక్. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరో మాట ఏంటంటే.. త్రివిక్రమ్ సినిమాలు వదిలేయబోతున్నాడట. అయితే అల్లు అర్జున్ సినిమా చేసిన తరువాత మానేస్తాడా లేక అంతకంటే ముందే సినిమాలకు స్వస్థి చెపుతాడా అనేది తెలియదు.
Also Read: మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు
కాని.. త్రివిక్రమ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు టాక్ మాత్రం వినిపిస్తుంది. మంచి ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు సినిమాలు మానేస్తే ఏం చేస్తాడు..?ఆయన నెక్ట్స్ ప్లాన్ ఏంటి అనేది అభిమానుల ప్రశ్న. అయితే దీని కోసం ఆయన పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత మంచి స్నేహితుడో అందరికి తెలిసిందే. ముందు నుంచి పవన్ ను వెనకుండి నడిపిస్తున్నాడు మాటల మాత్రికుడు. ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటం, త్రివిక్రమ్ కూడా ఎక్కువగా అమరావతిలోనే ఉంటున్నాడట.
Also Read: 100 రోజుల్లో కేజీఎఫ్, సలార్ రికార్డులు గల్లంతు చేసే హీరో ఎవరో తెలుసా? షాక్ అవుతారు
రీసెంట్ గా కుంభమేళాలో కూడా పవన్ తో కలిసి కనిపించాడు త్రివిక్రమ్. కొన్ని రోజులు హైదరాబాద్ లో .. కొన్నిరోజులు అమరావతిలో ఉంటున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతే కాదు ముందు ముందు అఫీషియల్ గా ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. జనసేన నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ మధ్యలోనే పార్టీలో బాగా యాక్టీవ్ అవ్వాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.
Pawan Kalyan- Trivikram
అందుకే సినిమాలు చేస్తూ.. పార్టీకార్యక్రమాలు కష్టం కాబట్టి.. సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని. సోషల్ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా నడుస్తోంది. ఇక అల్లు అర్జున్ తో సినిమా కూడా ఉండకపోవచ్చేమో అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానిజాలు ఏంటీ అనేది త్వరలోతెలిసే అవకాశం ఉంది.