- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నందుని పొగిడి ఉద్యోగానికి ఒప్పించిన లాస్య... 'ప్రేమ్'తో ఆట ఆడుకున్న శృతి!
Intinti Gruhalakshmi: నందుని పొగిడి ఉద్యోగానికి ఒప్పించిన లాస్య... 'ప్రేమ్'తో ఆట ఆడుకున్న శృతి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తులసి లాస్యతో, నేను ఎవరి జీవితంలోని ఏ హాని చేయలేదు, నాకు పక్క వాళ్ళ జీవితం గురించి ఆలోచించే సమయం కూడా లేదు. కనుక వెళ్ళి నందగోపాల్ తో చెప్పు ఇంకెప్పుడు నా జీవితంలోకి అడ్డుగా రాకూడదని. అయినా ఎవరైనా మహిళలు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎదగడానికి సహాయం చేయకపోయినా పర్లేదు కాని కాలు పట్టి కిందకు లాగడానికి మాత్రం ప్రయత్నించకూడదు. అది అర్ధం కావాల్సిన వాళ్లకు అర్థమైతే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.
లాస్య మనసులో నువ్వు ఇండైరెక్టుగా నాకే చెప్తున్నావని నాకు తెలుసు తులసి అని అనుకుంటుంది. ఆ తర్వాత తులసి, సామ్రాట్ దగ్గరకు వచ్చి, లాస్య ఇప్పుడే నాతో మాట్లాడింది అని చెప్తుంది. అప్పుడు సామ్రాట్, ఇంక మీరు ఆ విషయం గురించి పట్టించుకోవద్దు అని అంటాడు. ఆ తర్వాత నందు ఏమిటి లాస్య ఇంకా రాలేదు.సామ్రాట్, తులసిలు కలిసి లాస్యని ఒక్కదాన్నే చేసి ఆడుకుంటున్నారా అని అనుకుంటాడు. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి,నందూ,సామ్రాట్ గారు ఉద్యోగానికి అడ్డు చెప్పలేదు.వచ్చి పని చేసుకోమన్నారు అని అంటుంది.
అప్పుడు నందు,ఏమనకపోవడమేంటి?మనం నిజం చెప్పలేదని తిట్టలేదా అని అనగా, ఉద్యోగాలు పోతాయి అని భయపడే నిజం చెప్పలేదు అని చెప్పాను అందుకు మనల్ని క్షమించారు. మరి నన్ను ఏమి అనలేదా సామ్రాట్ అని అడగగా,నిన్నేం అనలేదు నంద. నువ్వు చాలా మంచి వాడివి అని నీలాంటి గొప్ప ఉద్యోగిని వదులుకుంటే కంపెనీకే నష్టం అని నిన్ను పొగిడాడు కూడా అని అంటుంది లాస్య. మనసులో, నీకు ఈ మాత్రం చెప్తే కానీ ఉద్యోగానికి రావు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో నందు లాస్యలు సైట్ దగ్గరకి వచ్చి, పావుగంట నుంచి తులసి, సామ్రాట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అప్పుడు నందు,ఒకప్పుడు నేను ఏ పని చేసినా దానికి తులసి పావుగంట ముందే నాకోసం వెయిట్ చేస్తూ ఉండేది. తులసి ఉదయాన్నే టీ ఇచ్చి, స్నానానికి నీళ్లు పెట్టి, టిఫిన్ పెట్టి,సాయంత్రం ఏ సమయానికి ఇంటికి వచ్చిన నా కోసం ఇంటి బైట ఎదురు చూస్తూ ఉండేది. ఇప్పుడు అలాంటి దానికోసం నేను ఉండాల్సి వస్తుంది ఏంటి కర్మ అని లాస్య తో అంటాడు నందు. అంతలో తులసి, సామ్రాట్ లు అక్కడికి వస్తారు. సారీ లేట్ అయింది అని సామ్రాట్ అంటాడు. అప్పుడు సామ్రాట్ తులసి తో, ఇదిగోండి ఇదే మీ తులసివనం.అవును ఇందాక మీరు కారులో వస్తున్నప్పుడు మీకు ఏదో కావాలి అని చెప్పారు ఏంటది అని సామ్రాట్ అడగగా, ప్రతి గదికి వెంటిలేషన్ కావాలి అని తులసి అంటుంది.
అప్పుడు నందు,లాస్యలు దానికి ఎక్కువ ఖర్చవుతుంది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని అనగా తులసి, నువ్వు కట్టుకున్న చీర బాగుంది లాస్య అని అంటుంది. కదా,అప్పుడు లాస్య 20,000 పెట్టి కొన్నాను అని అంటుంది. అప్పుడు తులసి,అంత ఖరీదు పెట్టి కొనుక్కోవడం వల్ల ఏం లాభం అని అడగగా, అందంగా కనబడుతుంది కదా అని లాస్య అంటుంది. మరి ఇది కూడా అంతే అందంగా కనిపించడానికి పిల్లలకి చక్కటి గాలి కూడా వస్తుంది అని తులసి అంటుంది. ఆ తర్వాత సామ్రాట్, ఒక గుంట దాటి వెళ్తాడు. తులసి దాటడానికి భయపడుతుండగా సామ్రాట్,తులసి చేయని పట్టుకొని దాటిస్తాడు.
దాన్ని చూసిన లాస్య నందుతో, చూసావా నందు చేయిపట్టుకుంటేనే ఇలాగా అయిపోయింది, నడుము పట్టుకుంటే లేచిపోతాదేమో అని రెచ్చగొడుతుంది.ఆ తర్వాత సీన్లో తులసి ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండగా ప్రేమ్ అక్కడికి వచ్చి కావాలనే అందరి ముందు శృతిని టీ అడుగుతాడు. శృతి పట్టించుకోనట్టు ఉంటుంది. అప్పుడు అనసూయ,నిన్నే కదా అడుగుతున్నాడు పట్టించుకోకుండా ఉంటున్నావ్ ఎందుకు అని అడగగా, నిజంగానే కావాల ప్రేమ్, నాకు వినపడలేదు వెళ్లి ఇప్పుడే చేస్తాను అని నవ్వుతూ అంటుంది. అప్పుడు ప్రేమ్, మనసులో ఇదేంటి ఇంత నవ్వుతూ మాట్లాడుతుంది. మళ్ళీ అందులో ఉప్పు వేస్తదా అని అనుకుంటాడు.
శృతి వెళ్లి టీ తెస్తుంది. ఇందులో ఉప్పు కలిపావా అని ప్రేమ్ సైలెంట్గా అడగగా లేదు అని అంటుంది శృతి. టీ తాగిన వెంటనే ఊసేస్తాడు ప్రేమ్.పంచదార లేదు నానమ్మ, చేదుగా ఉంది అని అనగా,శృతి, మొన్న ఒక ఆర్టికల్ లో చదివానులే ప్రేమ్,సింగెర్స్ కి గొంతు బాగా ఉండాలంటే పంచదార మానేయాలట,ఇలాంటి కాఫీయే తాగాలట అప్పుడు గొంతు బాగుంటుందట అని అనగా అనసూయ తాగు ప్రేమ్ అని బలవంతంగా తాగిపించేస్తుంది. ఆ తర్వాత సీన్లో తులసి, లాస్య ప్రాజెక్ట్ చూస్తూ ఉండగా సామ్రాట్,తులసి వేపు చూస్తూ ఉంటాడు.
అప్పుడు నందు, సామ్రాట్ వైపు చూస్తూ పక్కనే మాజీ భర్త ఉన్నాడు అని కూడా చూడకుండా దాన్ని ఎలా చూస్తున్నాడో అని తిట్టుకుంటాడు. అప్పుడు సామ్రాట్ నందు తో, అయినా మీరు ఎంత దురదృష్టవంతులు నందు, మీ దగ్గర ఉన్న అమూల్యమైన వజ్రాన్ని మీ అంతట మీరే వదులుకున్నారు అని అనగా, వజ్రం ఏంటి సార్ అని అంటాడు నందు. నాకు ఇలాగ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడటం రాదు నందు నేను సూటిగా చెప్తాను. తులసి గారునీ వదులుకోవడం మీ జీవితంలో తీరని లోటు అవుతుంది అని అంటాడు.
అది ఒక పీడకల సార్ దాని గురించి వదిలేయండి అని అంటాడు నందు.అప్పుడు సామ్రాట్ పీస్ నేను ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్తేనే వాళ్ళు ఇల్లు నాకు స్వర్గంలా అనిపించింది అని అనగా, ఉదయపు సూర్యుడు ఎప్పుడూ బానే ఉంటాడు సర్. మధ్యాహ్నానికి ఆ సూర్యుడు దగ్గర మంట తెలుస్తుంది అని నందు అంటాడు. అప్పుడు సామ్రాట్,మధ్యాహ్నం పూట సూర్యుడు గురించి ఆలోచించే వాళ్ళు మూర్ఖులే అవుతారు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!