- Home
- Entertainment
- Srishti Eliminate: బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌ని వీడిన కామనర్.. ఆమె పారితోషికం ఎంతంటే?
Srishti Eliminate: బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌ని వీడిన కామనర్.. ఆమె పారితోషికం ఎంతంటే?
Srishti Eliminate: బిగ్ బాస్ తెలుగు 10 నాల్గో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠకి తెరపడింది. ఈ వారం ఊహించినట్టుగానే జరిగింది. శ్రష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఈ సమాచారం బయటకు వచ్చింది.

షోపై ఇంట్రెస్ట్ ని పెంచుతున్న నాగార్జున
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆసక్తికరంగా రన్ అవుతుంది. రేటింగ్ పరంగా పెద్దగా లేకపోయినా హౌజ్‌లో మాత్రం అనేక ట్విస్ట్ లు, టర్న్ లు ఉన్నాయి. ఈ సారి 10 ఎక్స్ అని చెబుతూ వచ్చారు హోస్ట్ నాగార్జున. అన్నట్టుగానే ఒక్కో వారం ఒక్కో కొత్త ట్విస్ట్, సర్ ప్రైజ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. షోపై ఎంగేజ్‌ని పెంచుతున్నారు. ఆడియెన్స్ లో ఉత్కంఠని పెంచుతున్నారు. ఇది కొంత వరకు షోకి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇక నాల్గో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
నాల్గో వారం శ్రష్టి ఎలిమినేషన్
నాల్గో వారంలో నామినేషన్‌లో రోహిత నాయుడు, త్రిగుణ్, నరేష్, అమన్, ముఖేష్ గౌడ, దేబ్జానీ, చరణ్, షాలిని, శ్రష్టి ఉన్నారు. ఇందులో చరణ్, షాలిని, శ్రష్టి ఓటింగ్‌లో చివర్లో ఉన్నారు. త్రిగుణ్, రోహిత్, నరేష్, అమన్, ముఖేష్ గౌడ, చరణ్ సేవ్ అయ్యారు. ఫైనల్ రౌండ్‌లో షాలిని, శ్రష్టి ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ తీర్పులో శ్రష్టిని హౌజ్ నుంచి బయటకు పంపించారు. అయితే ఆమె ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందని ముందు నుంచే అంతా అనుకుంటున్నారు. ఓటింగ్ లోనూ అదే స్పష్టమైంది. తాజాగా ఎలిమినేషన్‌లోనూ ఆమె ఉంది. శ్రష్టి ఎలిమినేషన్ ఊహించిందే అని చెప్పొచ్చు.
కామనర్‌గా హౌజ్‌లోకి వచ్చిన శ్రష్టి
ఇక కామనర్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చింది శ్రష్టి వ్యాకరణం. అగ్నిపరీక్ష ద్వారా ఆమె హౌజ్‌లోకి వచ్చింది. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆట విషయంలో పెద్దగా సత్తా చాటలేకపోయింది. కంటెంట్ ఇవ్వలేకపోయింది. అది ఆమె ఎలిమినేషన్‌కి కారణమయ్యిందని చెప్పొచ్చు. ఇక కామనర్‌గా వచ్చిన శ్రష్టికి బిగ్ బాస్ నిర్వహకులు ఎంత పారితోషికం ఇచ్చారు. నాల్గు వారాలకు గానూ ఆమెకి ఎంత దక్కిందనేది చూస్తే.
శ్రష్టి పారితోషికం
కామనర్లకి రూ.70-1లక్ష వరకు పారితోషికం ఇచ్చారట. వారానికి ఈ అమౌంట్. నాలుగు వారాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె రూ.3.50-4 లక్షల వరకు పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. అయితే ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని, పాపులర్ కావాలని అంతా భావిస్తుంటారు. శ్రష్టి పేరు మాత్రం జనాలకు తెలిపింది. కానీ పెద్దగా పాపులర్ కాలేకపోయింది శ్రష్టి. షోకి వచ్చిన ఉద్దేశ్యం నెరవేరిందా లేదా అనేది ఆమెకే తెలియాలి.

