MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • The Paradise 10 Days Collection: శనివారం ప్యారడైజ్‌ ఊహించని జంప్‌.. పదో రోజు నాని మూవీకి అదిరిపోయే కలెక్షన్లు

The Paradise 10 Days Collection: శనివారం ప్యారడైజ్‌ ఊహించని జంప్‌.. పదో రోజు నాని మూవీకి అదిరిపోయే కలెక్షన్లు

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓడెల రూపొందించిన `ది ప్యారడైజ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద ఇంకా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతోంది. ఈ చిత్రానికి శనివారం వసూళ్లు ఊహించని విధంగా పెరిగాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 04 2026, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ది ప్యారడైజ్‌ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ
Image Credit : instagram

ది ప్యారడైజ్‌ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ

నాని హీరోగా, కయాదు లోహర్‌ హీరోయిన్‌గా, మోహన్‌ బాబు విలన్‌గా నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ సెప్టెంబర్‌ 24న విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్‌ ఓడెల రూపొందించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. క్రిటిక్స్ నుంచి కూడా అలాంటి రియాక్షనే వచ్చింది. అయితే ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయేలా రాబట్టుకుంది. మొదటి రోజు ఏకంగా రూ.74(అధికారికంగా రూ.88)కోట్లని రాబట్టడం విశేషం. నాని కెరీర్‌లోనే ఇది అత్యధికం కావడం మరో విశేషం. ఇదొక రికార్డు అని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మొదటి వారంలో దుమ్మురేపిన ప్యారడైజ్‌
Image Credit : X

మొదటి వారంలో దుమ్మురేపిన ప్యారడైజ్‌

మొదటి వారాంతం వరకు ఊహించని కలెక్షన్లతో దుమ్మురేపిందీ మూవీ. కానీ సోమవారం నుంచి పడిపోయాయి. నైజాంలో డీసెంట్‌గానే నడుస్తున్నా, ఏపీలో మాత్రం దారుణంగా పడిపోయింది. అక్కడి ఆడియెన్స్ ఈ సినిమాని తీసుకోలేకపోయారు. తెలంగాణ నేపథ్యం మూవీ, మరీ యాక్షన్‌ ఎక్కువగా ఉండటంతో వాళ్లు అంతగా పట్టించుకోవడం లేదు. కానీ అక్కడ కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా రిలీజ్‌ అయి పది రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఎంత రాబట్టింది. శనివారం దీనికి ఎంత వచ్చాయనేది చూస్తే.

34
ప్యారడైజ్‌ 10 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

ప్యారడైజ్‌ 10 రోజుల కలెక్షన్లు

ది ప్యారడైజ్‌ మూవీకి శనివారం రూ.5.40కోట్లు వచ్చాయి. ఇండియా నెట్‌ దీనికి నాలుగున్నర కోట్లు కావడం విశేషం. శుక్రవారం రెండున్నర కోట్లు రాగా, శనివారం ఊహించని విధంగా డబుల్‌ జంప్‌ అయ్యింది. ఇది సినిమాకి పాజిటివ్‌ నోట్‌గా చెప్పొచ్చు. ఈ వారం విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకునేలా లేదు. అందుకే ఆడియెన్స్ ప్యారడైజ్‌కే ప్రయారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ పుంజుకుంది. ఆదివారం వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక మొత్తంగా పది రోజుల్లో ఈ చిత్రానికి రూ.167.39కోట్లు వచ్చాయి. ఇండియా గ్రాస్‌ రూ.136.44కోట్లు, ఇండియా నెట్‌ రూ.115.56కోట్లు. ఓవర్సీస్‌లో దీనికి రూ.31కోట్లు వచ్చాయి. అక్కడ ఈ సినిమాకి భారీగా వస్తాయని భావించారు. కానీ ఆ తర్వాత డల్ అయ్యింది.

44
స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఇక ప్యారడైజ్‌ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ.104కోట్లు, తమిళనాడులో నాలుగున్నర కోట్లు, కర్నాటకలో రూ.12కోట్లు, కేరళాలో రూ.90లక్షలు, నార్త్ లో రూ.13.50కోట్లు వచ్చాయి. ఇక ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.200కోట్ల(గ్రాస్‌). వంద కోట్ల షేర్‌ రావాలి. ఇప్పటి వరకు ఎనబై కోట్లకుపైగా షేర్‌ వచ్చింది. ఇంకా ఇరవై కోట్ల వరకు అంటే నలభై కోట్ల వరకు గ్రాస్‌ రాబడితే సినిమా హిట్‌ జాబితాలో చేరుతుందని చెప్పొచ్చు. నైజాంలో ఇది సేఫ్‌ అయ్యే అవకాశం ఉంది, కానీ ఏపీలో మాత్రం దాదాపు నలభై శాతం లాస్‌ వస్తుందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిపై వశీకరణ ప్రయోగం, మెగాస్టాను సొంతం చేసుకోవాలని విషప్రయోగం చేసింది ఎవరు?
Recommended image2
Singeetham Life Story: సినిమాకి కొత్త రుచులు చూపించిన సింగీతం.. 60 చిత్రాలు, ఎన్నో అద్భుతాలు, ఎవరికీ తెలియని నిజాలు
Recommended image3
Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత..
Related Stories
Recommended image1
Singeetham Life Story: సినిమాకి కొత్త రుచులు చూపించిన సింగీతం.. 60 చిత్రాలు, ఎన్నో అద్భుతాలు, ఎవరికీ తెలియని నిజాలు
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ 4వ వారం ఎలిమినేషన్‌.. గ్లామర్‌ బ్యూటీ ఔట్‌ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved