శ్రీకాంత్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఓ స్టార్ హీరోయిన్ హీరో శ్రీకాంత్ కు భార్య గా, వదినగా నటించింది. సినిమాల్లో ఇవన్నీ కామన్, స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసి తర్వాత తల్లి పాత్రలు చేసిన వారుకూడా ఉన్నారు. ఇంతకీ శ్రీకాంత్ సినిమాల్లోభార్య గా, వదినగా చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు?

సినిమాల్లో ఎవరు ఎప్పుడు ఎలాంటి పాత్రలు చేయాల్సి వస్తుందో చెప్పలేం. ఆ కాలంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్లు గా నటించిన తారలు ఆతరువాత వారికే అమ్మ పాత్రలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఆతరువాత జనరేషన్ లో కూడా ఇలాంటివి లేకపోలేదు.
మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ.. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో అమ్మ పాత్ర కూడా చేసింది. ఈక్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ శ్రీకాంత్ భార్య పాత్ర చేసింది.. ఆతరువాత మరో సినిమాలో వదిన పాత్రలో కనిపించింది. ఆమె ఎవరో కాదు స్నేహ.
ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్. ఈ ఫ్యామిలీ హ్యాండ్సమ్ హీరోకి 90 దశాబ్ధం చివరల్లో స్టార్ డమ్ స్టార్ట్ అయ్యింది. 2000ల ప్రారంభంలో శ్రీకాంత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. విలన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్, తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగి, ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈమధ్యకాలంలో సహాయ పాత్రలు, విలన్ రోల్స్ లో కూడా అలరించిన శ్రీకాంత్ ఇటీవల ‘అఖండ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే శ్రీకాంత్ కెరీర్‌లో ఆసక్తికరమైన ఒక విషయం జరిగింది. ఒక స్టార్ హీరోయిన్ శ్రీకాంత్ తో రెండు విభిన్న పాత్రల్లో నటించింది. ఒక సినిమాలో భార్యగా, మరో సినిమాలో వదినగా నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు స్నేహ. 2005 లో బాపు డైరెక్షన్ లో వచ్చిన రాధా గోపాళం సినిమాలో శ్రీకాంత్, స్నేహ జంట భార్య భర్తలు గా నటించగా, అదే ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాలో స్నేహ వెంకటేష్ భార్యగా నటించింది. ఆ సినిమాలో శ్రీకాంత్ వెంకటేష్ తమ్ముడిగా కనిపించాడు. , ఆ సినిమాలో స్నేహ వదిన పాత్రలో కనిపించింది.
ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మరో సోనాలీ బింద్రే కూడా శ్రీకాంత్‌కు లవర్ గా , వదినగా నటించింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే శ్రీకాంత్‌కు లవర్‌గా నటించింది. ఈ సినిమాలో వీరి మధ్య వచ్చిన "నువ్వు నువ్వు" పాట ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సోనాలి, శ్రీకాంత్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఇక 2004లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన చిరంజీవికి తమ్ముడిగా నటించగా, చిరు సరసన హీరోయిన్‌గా సోనాలి బింద్రే కనిపించారు. అంటే, ఈ సినిమాలో సోనాలి బింద్రే ను శ్రీకాంత్ వదినమ్మ అంటూ పిలుస్తాడు. ఇలా కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఒకే హీరోయిన్ శ్రీకాంత్‌కు రెండు భిన్న పాత్రల్లో.. ఒకసారి లవర్‌గా, మరోసారి వదినగా నటించింది.
ఇవన్నీ చూస్తే, తెలుగు చిత్ర పరిశ్రమలో కథకు అనుగుణంగా హీరో-హీరోయిన్ల పాత్రలు ఎలా మారిపోతాయో అర్ధం అవుతుంది. అయితే ప్రేక్షకులు అంగీకరించినంతవరకూ ఎలాంటి పాత్రలైనా నటులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆడియన్స్ ఆక్సప్ట్ చేయకపోతే ఫలితాలు బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. ఇక శ్రీకాంత్ కాని, స్నేహా, సోనాలీ బిందే కూడా తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ ముగ్గరు తారలకు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువ.