MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కట్టప్ప షాక్ ఇచ్చాడు. ఏపీ డిప్యూటీ సీఎంకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సత్యరాజ్ ఏమన్నాడు. కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 25 2025, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image Credit : Asianet News

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ తమిళ సినీ నటుడు, బాహుబలి కట్టప్ప, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఒక రకంగా పవన్ కు ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడులో మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే అటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image Credit : Instagram

రీసెంట్ గా పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో జ‌రిగిన "మురుగన్ మానాడు" అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, హిందుత్వం, సనాతన ధర్మం వంటి అంశాలను ప్రస్తావించారు.

పవన్ తన ప్రసంగంలో "నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే, నాస్తికులు ముఖ్యంగా హిందువుల‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర చర్చకు దారితీశాయి.

37
Image Credit : X/@JanaSenaParty

తమిళనాడు మంత్రులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, పవన్ మతం పేరిట చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై నటుడు సత్యరాజ్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోం. ఇది హిందుత్వాన్ని విస్తరించాలనే దురుద్దేశంతో కూడుకున్న ప్రచారం” అని విమర్శించారు.

47
Image Credit : our own

“పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీరు మోసం చేయలేరు. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశామని అనుకుంటే అది మీ తెలివితక్కువతనమే అవుతుంది. తమిళ ప్రజలు చాలా తెలివైనవారు. తమిళనాట మీ మత ఆటలు సాగవు తమిళనాడు ప్రజలు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను సహించరని సత్యరాజ్ స్పష్టంగా హెచ్చరించారు.

57
Image Credit : our own

"మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలనుకోవడం తమిళ ప్రజలకి నచ్చదు. మేము మూర్ఖులం కాదు. " అంటూ ఘాటుగా స్పందించారు. ” ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తపరిచారు. సత్యరాజ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ లో ఈ వాఖ్యలు పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయి.

67
Image Credit : X/@JanaSenaParty

ఇక సత్యరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ అంశం సౌత్ ఇండియన్ పాలిటిక్స్ లో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. హిందుత్వం, నాస్తికత్వం, సనాతన ధర్మం వంటి అంశాల చుట్టూ తమిళనాడులో మతపరమైన రాజకీయాలు తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేకులు కొందరు అంటున్నారు.

77
Image Credit : our own

తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రాజకీయంగా పాగా వేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పవన్ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి విమర్శలు ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

మురుగన్ మానాడు సభకు హాజరైన పవన్, తమిళ ప్రజల మద్దతు పొందే లక్ష్యంతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కించాయి. తమిళనాడులో పెరియార్ భావజాలం ,సెక్యులర్ విధానాలు ఎక్కువగా ఆచరణలో పెట్టేనాయకులు పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా ఎవరెవరు స్పందిస్తారోన చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
రాజకీయాల్లోకి నటి మీనా, బీజేపీలో చేరబోతుందా, నిజమెంత?
Recommended image2
శృతీ హాసన్ కు షాక్ ఇచ్చిన హ్యాకర్లు, గందరగోళంలో అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved