MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sridevi: చిరంజీవికి చుక్కలు చూపించిన శ్రీదేవి.. హీరోయిన్ కండీషన్స్ కు మెగాస్టార్ కూడా తగ్గక తప్పలేదుగా..

Sridevi: చిరంజీవికి చుక్కలు చూపించిన శ్రీదేవి.. హీరోయిన్ కండీషన్స్ కు మెగాస్టార్ కూడా తగ్గక తప్పలేదుగా..

Sridevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి చుక్కలు చూపించిందట స్టార్ హీరోయిన్ శ్రీదేవి. అతిలోక సుందరి దెబ్బకు మెగాస్టార్ కూడా తగ్గక తప్పలేదట. ఇంతకీ ఏం జరిగింది. చిరంజీవి అంత ఓపికగా ఎందుకు భరించారు? నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 27 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్...
Image Credit : x/production house

ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్...

తెలుగు సినీ చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రాల్లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి జంటగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో, అశ్విని దత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాణ సమయంలో సెట్స్‌లో జరిగిన అనేక ఆసక్తికర విషయాలు, శ్రీదేవి పెట్టిన కొన్ని కండిషన్ల గురించి, చిరంజీవి పడిన ఇబ్బందుల గురించి ఒక సినీ విశ్లేషకుడు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టార్‌డమ్ - టైటిల్ వివాదం
Image Credit : Asianet News

స్టార్‌డమ్ - టైటిల్ వివాదం

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా సమయానికి శ్రీదేవి భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్నారు. అప్పటికే ఆమె సౌత్ నుంచి నార్త్ వెళ్లి.. బాలీవుడ్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. అప్పుడు నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా కోసం శ్రీదేవిని అడిగారు. అంతే కాదు, ఈ సినిమాకు ముందు కేవలం ‘జగదేకవీరుడు’ అని టైటిల్ మాత్రమే అనుకున్నారు. కానీ శ్రీదేవి తన స్టార్‌డమ్‌కు తగ్గట్టు.. హీరోయిన్‌కు సమానమైన పాత్ర కావాలని, టైటిల్‌లో కూడా తన పాత్ర కలిసేలా ‘అతిలోకసుందరి’ అని పెట్టాలని కండీషన్ పెట్టారట. శ్రీదేవి తల్లి కూడా గట్టిగా డిమాండ్ చేశారట. అంతే కాదు, షూటింగ్ అయిపోయిన తర్వాత టైటిల్ తాను అనుకున్నట్టు కాకుండా పాతదే ప్రకటిస్తారేమోనని శ్రీదేవికి అనుమానం ఉండేది. అందుకే టైటిల్‌లో తన పాత్రకు తగిన ఇంపార్టెన్స్ ఇచ్చి ‘అతిలోకసుందరి’ అని కూడా చేర్చాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారని తెలుస్తోంది. .

35
డబ్బింగ్ చెప్పనని పట్టుబట్టిన హీరోయిన్..
Image Credit : facebook.com/p/Sridevi

డబ్బింగ్ చెప్పనని పట్టుబట్టిన హీరోయిన్..

మరోవైపు, నిర్మాత అశ్విని దత్ డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత టైటిల్ విషయం చూసుకోవచ్చని అనుకున్నా, శ్రీదేవి మాత్రం "సినిమా ఆడియో ఫంక్షన్ నిర్వహించి, టైటిల్ అధికారికంగా ప్రకటిస్తేనే డబ్బింగ్ చెప్తాను" అని షరతు విధించారు. అంతేకాకుండా, శ్రీదేవి తల్లి రాజేశ్వరి కూడా టైటిల్ లోగో డిజైన్‌ను స్వయంగా దగ్గరుండి చేయించారట. ప్రముఖ డిజైనర్ ఈశ్వర్ రూపకల్పన చేసిన లోగోలో ‘అతిలోకసుందరి’ పదాన్ని ముందుకు, ‘జగదేకవీరుడు’ పదాన్ని వెనుకకు ఉండేలా ఖరారు చేశారు.

45
శ్రీదేవి పెట్టిన కండిషన్లు..
Image Credit : Asianet News

శ్రీదేవి పెట్టిన కండిషన్లు..

షూటింగ్ సమయంలో శ్రీదేవి తన పాత్ర ఇంపార్టెన్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్ విషయంలో చాలా స్పష్టంగా ఉండేవారు. సినిమాలో హీరోయిన్ హీరోకి 'ఐ లవ్ యు' చెప్పాల్సి రాగా... తాను అలా చెప్పనని అన్నారట. హీరోయిన్ హీరోకి అలా చెప్పకూడదని, హీరోనే చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే క్లైమాక్స్ సన్నివేశంలో శ్రీదేవి కేవలం లిప్ మూమెంట్ మాత్రమే ఇచ్చారు. ఆమె సొంతంగా డైలాగ్ చెప్పకపోవడంతో ఆ సన్నివేశంలో ఇళయరాజా గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది.

55
చిరంజీవి సంస్కారం
Image Credit : Asianet News

చిరంజీవి సంస్కారం

అంతే కాదు, లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ సినిమా శతదినోత్సవ వేడుకలకు శ్రీదేవి రాలేదట. "ఈ వేడుక కేవలం హీరో కోసమే జరుగుతోంది.. అక్కడ నాకేంటి పని?" అని ఆమె అనుకున్నారట. శ్రీదేవి కఠినమైన నిబంధనలు విధించినప్పటికీ, సెట్స్‌లో ఆమె ఎంతో క్రమశిక్షణతో, డెడికేషన్‌తో పనిచేసేవారని విశ్లేషకుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. చిరంజీవి కూడా ఆమెతో నటించడాన్ని గొప్ప గౌరవంగా భావించి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నింటికీ సర్దుకుపోయి సహకరించారని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. చిరంజీవికి ఎవరికీ తగ్గి ఉండాల్సిన అవసరం లేదు, కానీ సినిమా కోసం ఆయన చాలా ఓపికగా ఉన్నారట.

శ్రీదేవిపై మెగాస్టార్ ప్రశంసలు..

రాఘవేంద్రరావు నిర్వహించిన ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో "మీకు నచ్చిన హీరోయిన్ ఎవరూ?" అని అడిగినప్పుడు చిరంజీవి తడుముకోకుండా శ్రీదేవి పేరే చెప్పారు. ముఖ్యంగా ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటలో తన మోచేతి దెబ్బకి శ్రీదేవి ఇచ్చిన ‘మధురమైన బాధ’ ఎక్స్‌ప్రెషన్ నభూతో నభవిష్యత్ అని మెగాస్టార్ కొనియాడారు. ఇద్దరు దిగ్గజ నటీనటులు పోటీపడి చేసిన నటన, వారి మధ్య కుదిరిన అపూర్వమైన కెమిస్ట్రీయే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాన్ని తెలుగు సినీ చరిత్రలో ఒక అమరకావ్యంగా మార్చాయి. శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా, అతిలోకసుందరిగా ఆమె పోషించిన ‘ఇంద్రజ’ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Comedian Remuneration: గంటకు లక్ష రూపాయలు, స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న కమెడియన్‌ ఎవరో తెలుసా?
Recommended image2
Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Recommended image3
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Related Stories
Recommended image1
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved