రెమ్యునరేషన్ డబుల్ చేసిన శ్రీలీల, వరుస ఫ్లాపుల్లో కూడా తగ్గని హీరోయిన్ క్రేజ్
ఈమధ్య పెద్దగా హిట్ సినిమాలు చేయలేదు శ్రీలీల. స్టార్ హీరోల సరసన కూడా ఆఫర్లు రావడంలేదు. ఇక శ్రీలీల పని కూడా అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో.. రెమ్యునరేషన్ డబుల్ చేసిందట కన్నడ తార.

తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రీలీల. ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె నటిస్తోంది. పూజ హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ వంటి టాప్ హీరోయిన్‌ల జోరు కొనసాగుతున్న సమయంలో శ్రీలీల రాకెట్ వేగంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
కాని ఈమధ్య శ్రీలీల జోరు కాస్త తగ్గింది. వరుస ప్లాప్ లతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మరోసారి బాలీవుడ్ వైపు చూస్తుండటంతో జాన్వీ కపూర్ లాంటి బీ టౌన్ బ్యూటీస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, బన్నీ, ఎన్టీఆర్,రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో.. ఆ సినిమాల్లో శ్రీలీలకు అవకాశం దక్కడంలేదు. దాంతో టైర్ 2 హీరోల సినిమాలు చేయాల్సి వస్తోంది శ్రీలీలకు.
ప్రస్తుతం శ్రీలీల కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యింది. గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయం అవుతున్న ‘జూనియర్’ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ నెల 18న ‘జూనియర్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. . ఈ సందర్భంగా ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ సినిమాలో శ్రీలీల తీసుకున్న పారితోషికం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆమె ఈ సినిమాకు అందుకున్నట్లు సమాచారం.
ఈ మూవీతో శ్రీలీల అత్యధిక పారితోషికం అందుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆమె హిట్ చిత్రాల సంఖ్య తక్కువే అయినా, అవి కలెక్షన్ల పరంగా మంచి ప్రభావం చూపించాయి. కొంతకాలంగా పెద్ద హిట్లు లేకపోయినా, ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు చేస్తోంది.
స్టార్ హీరోల సరసన నటించిన శ్రీలీల ఒక కొత్త హీరో సరసన నటించడం తనకు రిస్క్ అయినా.. ఆమె జూనియర్ సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఈక్రమంలో ఈసినిమా కోసం శ్రీలీల దాదాపు 4 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
గతంలో సినిమాకు 2 కోట్లు మాత్రమే తీసుకునే శ్రీలీల.. ఈసినిమా నుంచి తన రెమ్యునరేషన పెంచేసిందట. మరి ఈసినిమా తరువాత కూడా ఆమె చేయబోయే మూవీస్ కు ఇంత పారితోషికం ఇస్తారా లేక శ్రీలీల కిందకు దిగి రాక తప్పదా? చూడాలి.
జూనియర్ సినిమా సక్సెస్ అయితే శ్రీలీల కెరీర్ కాస్త స్పీడ్ అందుకుని పరుగులు పెట్టే అవకాశం ఉంది . అదే సమయంలో కొత్త హీరో కిరీటీకి కూడా మంచి కెరీర్ దొరికే అవకాశం ఉంది. మరి జూనియర్ సినిమా ఎలా ఉంటుంది, ఫలితం ఏంటో చూడాలి.