- Home
- Entertainment
- చిరంజీవితో గొడవ పెట్టుకున్న ఎస్పీ బాలు.. నాగబాబుకు ఏం మిగిలింది అంతా పోయింది అంటూ మెగాస్టార్ సమాధానం
చిరంజీవితో గొడవ పెట్టుకున్న ఎస్పీ బాలు.. నాగబాబుకు ఏం మిగిలింది అంతా పోయింది అంటూ మెగాస్టార్ సమాధానం
చిరంజీవి నటించిన చిత్రాలలో ఎన్నో పాటలని బాలసుబ్రమణ్యం పాడారు. రుద్రవీణ లాంటి చిత్రాలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.

చిరంజీవి, ఎస్పీ బాలు స్నేహం
మెగాస్టార్ చిరంజీవి, లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య మంచి స్నేహబంధం ఉంది. తాను బాలు గారిని అన్నయ్య అని ప్రేమతో పిలుస్తుంటానని చిరంజీవి పలు సందర్భాలలో తెలిపారు. చిరంజీవి నటించిన చిత్రాలలో ఎన్నో పాటలని బాలసుబ్రమణ్యం పాడారు. రుద్రవీణ లాంటి చిత్రాలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.
చిరంజీవితో బాలు గొడవ
అయితే ఒక విషయంలో మాత్రం ఎస్పీ బాలసుబ్రమణ్యం తనతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. బాలు అన్నయ్య నన్ను ఎప్పుడు కలిసినా ఒక విషయంలో గొడవ పడుతూ మాట్లాడేవారు. నువ్వు మాస్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి అవే సినిమాలు చేస్తున్నావు ఎందుకు? నీకు నటుడిగా ఎంత పొటెన్షియల్ ఉందో తెలుసా? స్వయంకృషి లాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎందుకు చేయడం లేదు? నువ్వు అలాంటి సినిమాలు ఎక్కువ చేయాలి అని అడిగేవారు.
అలాంటి చిత్రాలు చేస్తూనే ఉన్నాను
తాను కూడా ఎస్పీ బాలుతో తిరిగి వాదించే వాడినని చిరంజీవి తెలిపారు. నేను నా కెరీర్ లో శుభలేఖ, ఆరాధన, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, రుద్రవీణ లాంటి పెర్ఫార్మెన్స్ చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు చేస్తూనే ఉన్నాను. చేయకుండా అయితే ఎప్పుడూ లేను. కానీ ఎక్కువగా మాస్ చిత్రాలు చేయడానికి కారణం ఉంది. నా నుంచి అభిమానులు ఎక్కువగా మాస్ చిత్రాలు కోరుకుంటున్నారు. నిర్మాతలకు ఆ చిత్రాలు ఎక్కువగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
నాగబాబుకు ఏమీ మిగల్లేదు
తన సొంత ప్రొడక్షన్ లో నాగబాబు నిర్మాతగా రుద్రవీణ మూవీ చేశాను. ఆ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆ చిత్రానికి మీరు కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు. కానీ ఆ సినిమా వల్ల కమర్షియల్ గా ఏమీ మిగలలేదు. నాగబాబు జేబులో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో నేను నాలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టడానికి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలా.. లేక అభిమానులు నా నుంచి కోరుకునే, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు లాభపడే మాస్ చిత్రాలు చేయాలా అనే సందిగ్ధత నాలో ఎప్పుడూ ఉంటుంది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల బాగోగులే ముఖ్యం కనుక మాస్ చిత్రాలే ఎక్కువగా చేస్తున్నాను అని బాలసుబ్రహ్మణ్యంకి చిరంజీవి సమాధానం ఇచ్చారు. ఏమైనా కానీ నీలాంటి నటుడు పెర్ఫామెన్స్ చిత్రాలు కూడా చేయాలి అని బాలు అన్నయ్య ఎప్పుడూ చెబుతూ ఉండేవారు అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
ఎస్పీ బాలుకి నచ్చిన చిరంజీవి చిత్రాలు
ఓ ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం చిరంజీవి నటించిన చిత్రాల్లో తనకి శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలంటే ఇష్టమని తెలిపారు. విశేషం ఏంటంటే ఈ మూడు చిత్రాలకు దర్శకుడు ఒకరే.. ఆయనే కళాతపస్వి, కె విశ్వనాథ్.