MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Karthika Deepam: అన్నం తినిపిస్తూ అత్తా కోడళ్లకు వార్నింగ్ ఇచ్చిన శౌర్య....శోభతో పెళ్లికి నిరుపమ్ రెడీ!

Karthika Deepam: అన్నం తినిపిస్తూ అత్తా కోడళ్లకు వార్నింగ్ ఇచ్చిన శౌర్య....శోభతో పెళ్లికి నిరుపమ్ రెడీ!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 9వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Aug 09 2022, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సౌందర్య, హిమకు గోరింటాకు పెడుతూ హిమనీ మాట్లాడిపిస్తూ ఉంటది. కానీ హిమ దేనికి జవాబు ఇవ్వకుండా మౌనంగా బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ఆనందరావు అక్కడికి వచ్చి హిమకు ఒక్కదానికే గోరింటాకు పడితే సౌర్య బాధపడుతుంది. తనకీ పెట్టు అని అనగా సరే దాన్ని పిలండి అని సౌందర్య అంటుంది. అప్పుడు ఆనందరావు, సౌర్య బయటకెళ్ళింది అని అంటాడు. ఇంటట్లో హిమ ఎడిచేస్తూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎందుకు ఏడుస్తున్నావు? అని సౌందర్య అడగగా నా మనసులో ఏముందో మీకు తెలియదా? నిరుపం బావకి, సౌర్యకి పెళ్లి చేద్దాం నానమ్మ అని అంటుంది. అప్పుడు ఆనందరావు "నీ వయసుకు మించిన ఆలోచనలు నువ్వు మానుకో, పెద్ద వాళ్ళo మాకేం చేయాలో తెలుసు కదా" అంటాడు. అప్పుడు హిమ,"ఎలాగైనా శౌర్యకి నిరూపం బావ తో పెళ్లి చేస్తాను" అని గోరింటాకును మధ్యలోనే ఆపి లెగుస్తుంది."అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే మానుకో" అని సౌందర్య కొంచెం గట్టిగా హిమకు చెప్తుంది.హిమ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

37

 ఆ తర్వాత సీన్లో స్వప్న, శోభకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. మీరెంత మంచివారు అత్తయ్య అని శోభ స్వప్నని,నువ్వు ఎంత మంచి దానివి అమ్మ అని స్వప్న శోభని ఒకరి గురించి ఒకరు డప్పు కొట్టుకుంటూ ఉంటారు.ఈ లోగ సౌర్య అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ, "ప్రపంచంలోనే అత్యంత ప్రియాతి ప్రియమైన అత్త కోడల్లు లో మీరే ముందుంటారు. ఎంత మంచి అత్త, ఎంత మంచి కోడలు" అని వారిద్దరినీ ఎటకారిస్తూ ఉంటుంది.ఇంటట్లో సత్యం అక్కడికి వస్తాడు.
 

47

మీరు కూడా మీకు కాబోయే కోడలికి ఏవైనా సేవలు చేయండి మావయ్య అని సౌర్య ఎటకారిస్తూ అనగా సత్యంకి అక్కడ సీను అర్థం అయిపోయి ఏదో అవుతాది ఇక్కడ అని చెప్పి తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఈలోగా సౌర్య,స్వప్న దగ్గర అన్నం ప్లేట్ తీసుకొని శోభ కి బలవంతంగా అన్నం తినిపిస్తూ స్వీట్ గా అత్తా కోడలికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇల్లలకగానే పండగ అయినట్టు కాదు అని వెక్కిరిస్తూ ఉంటుంది.ఈలోగా శోభకు ఎక్కిళ్ళు వస్తే స్వప్న మంచి నీళ్లు తేవడానికి లోపలికి వెళ్తుంది.
 

57

అప్పుడు శోభ, "ఇది నాకు మా అత్తకి మధ్య ఉన్న బంధం, బహుశా నిరూపములను తలుచుకుంటున్నాడు ఏమో ఎక్కిళ్ళు వస్తున్నాయి, నాకు నిరుపమ కి పెళ్లి తథ్యం" అని శోభ అనగా అన్నం ప్లేట్లోని అన్నమంతా సౌర్య శోభ ముఖానికి రాసి జరిగేది కేవలం డాక్టర్స్ సాబ్ పెళ్లి ,నీ పెళ్లి కాదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో సౌందర్య ఇంట్లో పెళ్లి పనులు చాలా హడావిడిగా అవుతూ ఉంటాయి.
 

67

సౌర్య ఇది అంతా చూస్తే బాధపడుతుంది అని ఆనంద్ రావు అనగా సౌందర్య, నిరూపం పెళ్లి హిమతో చేస్తానని శౌర్య మాటిచ్చిందట అని ఆనందరావుతో చెబుతుంది. అప్పుడు ఇద్దరూ "హమ్మయ్య" అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో స్వప్న, నిరూపంతో పెళ్ళికి రెడీ అవ్వమని అంటుంది. కానీ నిరూపం నేను ఇక్కడి నుంచి రాను నన్ను బలవంతం పెట్టొద్దు అంటాడు. అప్పుడు స్వప్న నిరూపం కి ఒక లెటర్ ఇచ్చి ఇది చదివిన తర్వాత కూడా నువ్వు శోభని పెళ్లి చేసుకోను అంటే ఇంక నీ ఇష్టం అంటుంది.
 

77

నిరూపమ్, ఆ లెటర్ ని చదివి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సీన్లో సౌర్య ఒక ఇంటికి వెళ్లి తలుపు కొడుతుంది. ఈలోగా స్వప్న వాళ్ళ ఇంట్లో నిరూపం పెళ్లి బట్టలు వేసుకొని తయారవుతాడు. స్వప్న దాన్ని చూసి నువ్వు మంచోడు అని నాకు తెలుసు అని మురిసిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved