పెళ్లి తర్వాత నటీమణులతో సీక్రెట్ రిలేషన్.. హాట్ రూమర్స్ లో చిక్కుకున్న సెలెబ్రిటీలు వీళ్ళే
చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్ రూమర్స్ సహజంగానే వినిపిస్తుంటాయి. అయితే వివాహం తర్వాత కూడా ఆ తరహా రూమర్స్ ఎదుర్కొన్న నటీనటులు కొందరు ఉన్నారు ఆ వివరాలు చూద్దాం.
Nagarjuna - Tabu
కింగ్ నాగార్జునని ఎవర్ గ్రీన్ మన్మథుడిగా ఫ్యాన్స్ అభివర్ణిస్తారు. మరి అలాంటి మన్మథుడికి రూమర్స్ బెడద తప్పదు కదా. నాగార్జున.. నటి అమలని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ టబుతో సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్స్ ని నాగార్జున, టబు పలు సందర్భాల్లో ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులం అని క్లారిటీ ఇచ్చారు.
Prabhudeva - Nayanthara
డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు ప్రభుదేవా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా 1995 లో రామ్లాత్ ని వివాహం చేసుకున్నారు. అయితే ప్రభుదేవా.. నయనతార మధ్య ఒక దశలో హాట్ ఎఫైర్ సాగింది. దాదాపు ఇద్దరూ పెళ్లి పీటల వరకు వెళ్లినట్లు రూమర్స్ ఉన్నాయి. నయనతారతో రిలేషన్ వల్ల.. ప్రభుదేవా, రామ్లాత్ విడిపోయారు. ఆ తర్వాత నయన్ కూడా ప్రభుదేవాకి దూరమైంది.
Boney Kapoor - Sridevi
బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో బోనీ కపూర్ ఒకరు. అతను 1983లో మోనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి వైవాహిక జీవితం 13 ఏళ్లకే ముగిసింది. బోనీ కపూర్ ఆ తర్వాత నటి శ్రీదేవిని పెళ్లాడాడు. బోనీ కపూర్ తన మొదటి భార్యతో విడిపోక ముందే శ్రీదేవితో హాట్ ఎఫైర్ సాగించాడని.. శ్రీదేవి పెళ్ళికి ముందే గర్భవతి అయినట్లు రూమర్స్ ఉన్నాయి.
Dhanush - Aishwarya Rajinikanth
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు.ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్నాడు.అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాము విడిపోతున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. ఓ నటితో ధనుష్ ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ఇలా ఐశ్వర్య అతడి నుంచి విడిపోతోందనే రూమర్స్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
KS RaviKumar - Ramya Krishnan
ఈ తరహా రూమర్స్ సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ గురించి కూడా వినిపించాయి. పడయప్పా ( నరసింహ) షూటింగ్ సమయంలో రవికుమార్, రమ్యకృష్ణ మధ్య ఎఫైర్ సాగిందని ప్రచారం జరిగింది. ఈ రూమర్స్ కారణంగా రవికుమార్ పర్సనల్ లైఫ్ లో కూడా సమస్యలు వచ్చాయని పుకార్లు వ్యాపించాయి.