MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • హీరో శివాజీతో బోల్డ్ సీన్స్, ఆయన పెళ్ళైన వ్యక్తి కాబట్టి నాకు ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు..నటి ఊహించని వ్యాఖ్యలు

హీరో శివాజీతో బోల్డ్ సీన్స్, ఆయన పెళ్ళైన వ్యక్తి కాబట్టి నాకు ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు..నటి ఊహించని వ్యాఖ్యలు

నటి అర్చన టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అర్చన ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేసింది. కొన్ని చిత్రాల్లో ఆమె ప్రధాన నటిగా కూడా నటించింది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 12 2024, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటి అర్చన టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అర్చన ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేసింది. కొన్ని చిత్రాల్లో ఆమె ప్రధాన నటిగా కూడా నటించింది. నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా, శ్రీరామదాసు, కమలతో నా ప్రయాణం లాంటి చిత్రాల్లో అర్చన నటించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అవసరమైన మేరకు సినిమాల్లో అర్చన గ్లామర్ పాత్రల్లో నటించింది. కమలతో నా ప్రయాణం అనే చిత్రంలో ఆమె వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. వివాహం తర్వాత అర్చన సినిమాల్లో అంత యాక్టివ్ గా లేదు. ఆ మధ్యన ఇంటర్వ్యూలో అర్చన సినిమాల్లో బోల్డ్ సీన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

 

37

హీరోగా రాణించిన శివాజీ ఇటీవల బిగ్ బాస్ షోతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత శివాజీ నటించిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది. నటి అర్చన శివాజీ గురించి మాట్లాడుతూ ఊహించని వ్యాఖ్యలు చేసింది. 

 

47

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు మీరు కేవలం నటనగానే భావిస్తారా లేక ఫీల్ తో చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. అర్చన అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఫీల్ అవ్వడానికి అంత సినిమా ఉండదు అక్కడ అంటూ నవ్వుతూ బదులిచ్చింది. ఎందుకంటే సెట్స్ లో చుట్టూ చాలా మంది ఉంటారు కదా అని బదులిచ్చింది. ఫీల్ అవుతూ చేయకపోయినా  హారిబుల్ గా అనిపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. రొమాంటిక్ సీన్స్ బాగా రాకపోతే చూడడానికి అస్సలు బాగోదు. జనాలు నవ్వుకుంటారు. 

 

57

నేనైతే హీరోతో రొమాన్స్ చేసేటప్పుడు.. ఆయన ఒక వస్తువు.. నేనొక వస్తువు అని మాత్రమే భావిస్తాను. ఫీల్ అవుతూ రొమాన్స్ చేయను. శివాజితో కమలతో నా ప్రయాణం చిత్రంలో అర్చన చాలా బోల్డ్ సీన్స్ చేసింది. నేను సినిమాల్లో చాలా బోల్డ్ సీన్స్ చేశాను. ఒక్కసారి కూడా రొమాంటిక్ గా ఫీల్ కాలేదు. అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. 

 

67

శివాజితో బోల్డ్ సీన్స్ ముందే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే షూటింగ్ ఓ సింగిల్ టేక్ లో కంప్లీట్ కావాలి కాబట్టి. ఇద్దరం మాట్లాడుకుని ఇలా చేద్దాం అని సీన్ కంపోజ్ చేసుకునేవాళ్లం. కమలతో నా ప్రయాణం చిత్రంలో బోల్డ్ సీన్స్ మొత్తం సింగిల్ టేక్ లో ఒకే అయ్యేవి. ఇతర నటీనటులు రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. నా వరకు అది జస్ట్ సీన్ మాత్రమే అని అర్చన తెలిపింది. 

 

77

శివాజీ ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి. ఆయనతో రొమాన్స్ చేస్తే ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అంటూ నవ్వుతూ బోల్డ్ గా చెప్పేసింది. నాకు ఎవరైనా నచ్చి రొమాన్స్ చేస్తే అది వేరే విషయం. శివాజీ పెళ్ళైన వ్యక్తి..ఆయన నా కోస్టార్ కానీ నాతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అంటూ పెద్ద వివరనే ఇచ్చింది అర్చన 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image2
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image3
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved