శంకర్ నుండి మురుగదాస్ వరకు, స్టార్స్ గా వెలిగి పడిపోయిన దర్శకులు ఎవరంటే?
ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ గా వెలుగు వెలిగి, వరుస విజయాలతో దూసుకుపోయిన స్టార్ డైరెక్టర్స్.. నేడు బాడ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నారు. శంకర్ నుంచి మురుగుదాస్ వరకూ ఇబ్బందుల్లో ఉన్న దర్శకులు ఎవరంటే?
- FB
- TW
- Linkdin
Follow Us
)
అన్ని రంగాలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అదేవిధంగా సినిమా కూడా కాలానికి అనుగుణంగా మారుతోంది. సాంకేతికంగా సినిమాల్లో చాలా అభివృద్ధి ఉండటంతో పాటు, చూసే ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. దీనివల్ల ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమాలు తీసే దర్శకులు మాత్రమే రాణిస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం ఎన్నో మాస్టర్ పీస్ చిత్రాలను అందించిన దర్శకులు ప్రస్తుతం వరుసగా విఫలమవుతున్నారు.
Also Read: ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?
ఫామ్ అవుట్ అయిన శంకర్
శంకర్ అంటే అందరికీ గుర్తొచ్చేది గ్రాండియర్‌నే. జెంటిల్‌మెన్ సినిమాతో మొదలుపెట్టి ప్రేమికుడు, ఇండియన్, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో, స్నేహితులు, ఐ, 2.0, గేమ్ ఛేంజర్ ఇలా ప్రతి సినిమాతో తన గ్రాండియర్ మేకింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. కానీ ఈ గ్రాండియరే ఇప్పుడు ఆయనకు ఎదురుదెబ్బ తగిలేలా చేసింది.
దానికి ఉదాహరణ ఆయన చివరి రెండు సినిమాలు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాల్లో గ్రాండియర్... గ్రాండియర్ అంటూ డబ్బులు కుమ్మరించినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే లేకపోవడంతో ఘోర పరాజయాన్ని చూశాడు శంకర్.
Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?
ఏ.ఆర్.మురుగదాస్ పని అయిపోయిందా?
దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ చూడటానికి సన్నగా ఉన్నా ఆయన సినిమాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. అజిత్ 'ధీనా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మురుగదాస్, ఆ తర్వాత విజయకాంత్‌తో 'రమణ'( తెలుగులో ఠాగూర్) అనే మాస్టర్ పీస్ సినిమాను అందించాడు. ఆ తర్వాత సూర్యతో ఆయన తీసిన 'గజిని' తమిళంలో బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా మురుగదాస్‌ను హిందీకి పరిచయం చేసింది.
ఆ తర్వాత విజయ్‌తో వరుసగా 'తుపాకీ', 'కత్తి', 'సర్కార్' వంటి హ్యాట్రిక్ హిట్ సినిమాలను అందించి కోలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ఆయన తీసిన 'స్పైడర్', రజనీకాంత్ 'దర్బార్' సినిమాలు మురుగదాస్‌కు ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఇటీవల సికిందర్ అనే బాలీవుడ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తాడని భావించిన మురుగదాస్, ఈసినిమాతో కూడా ప్లాప్ ను అందుకున్నాడు. ప్రస్తుతం అవుటేటెడ్ దర్శకుల జాబితాలో చేరాడు.
Also Read: బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?
బాలను వెంటాడుతున్న ఓటమి
విభిన్న కథాంశంతో సినిమాలు తీసే వ్యక్తి బాలా. 'సేతు' అనే తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో గొప్ప ప్రభావాన్ని చూపాడు బాలా. ఆ తర్వాత నందా, శివపుత్రుడు, నేను దేవుడిని ఇలా బాలా తీసిన ప్రతి సినిమా మాస్టర్ పీస్ . ఆ తర్వాత బాలా సినిమాలు కొంచెం కొంచెంగా క్షీణించాయి. ముఖ్యంగా పరదేశి, నాచియార్, తారై తపట్టై ఇలా వరుస పరాజయాలు చవిచూసిన బాలాకు ఇటీవల విడుదలైన వనంగాన్ సినిమా కూడా అదే ఫలితాన్ని ఇచ్చింది. పాత ఫార్ములాలోనే సినిమాలు తీయడం కూడా ఆయన వెనుకబాటుకు ఒక కారణంగా చెబుతున్నారు.
Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Also Read: నాని-కార్తీ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ, ఆ సినిమా ఏదో తెలిస్తే షాక్ అవుతారు?