Karthika Deepam: హిమపై ప్రతీకారంతో జ్వాలగా మారిన శౌర్య.. డాక్టర్ గా హిమ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

సౌర్య (Sourya) అమ్మ నాన్నలను చంపేసిన హిమని వదిలేదేలే.. అని మనసులో అనుకుంటుంది. అంతేకాకుండా జ్వాలా (Jwaala) అని పేరు కూడా పెట్టుకుంటుంది. మరోవైపు హిమ బర్త్ డే సెలబ్రేషన్స్ కు ప్రేమ్ వచ్చి హడావిడి చేస్తూ ఉంటాడు. ఇక సౌందర్య మీరైనా మీ అమ్మానాన్నలను కలపొచ్చు కదా రా అని ప్రేమ్ (Prem) ను అడుగుతుంది.
ఇక సౌందర్య ఫ్యామిలీ హిమ (Hima) కోసమే కాకుండా సౌర్య కోసం కూడా ఒక కేకు ఏర్పాటు చేస్తారు. ఇక రెండవ కేక్ ఎందుకని బర్త్ డే పార్టీకి వచ్చిన వారు అడగగా ఇది మా పెద్ద మనవరాలి కోసం అని చెబుతోంది. ఇక వాళ్ళు సౌర్య (Sourya) గురించి అడగగా కొంత బాధను వ్యక్తం చేస్తారు.
మరోవైపు ఆటో స్టాండ్ లో అందరూ నీ బర్త్ డే అంటే మాకు ఒక పెద్ద పండగ లాంటిది అని జ్వాలా (Jwaala) చేత కేకును కట్ చేపిస్తారు. కానీ హిమ (Hima) పుట్టినరోజున తాను పుట్టినందుకు ఆమె కేక్ కట్ చేయడానికి ఇష్టపడదు. కానీ ఆటో స్టాండ్ వాళ్ళు జ్వాలను బ్రతిమలాడి కేకును కట్ చేపిస్తారు.
మరోవైపు ఇంద్రుడు (Indrudu) చంద్రమ్మలు సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తారు. ఇక చంద్రమ్మ వట్టిచేతులతో ఇంటికి వెళ్తామా అని అంటుంది. ఇక చంద్రమ్మ జైలర్ గా పనిచేస్తున్న ఒక పోలీస్ పర్స్ కొట్టేయ పోతుండగా ఈ లోపు జ్వాలా (Jwaala) చూస్తుంది. ఇక జైలరుకి పర్సు తిరిగి ఇచ్చేస్తారు.
అంతేకాకుండా ఆ జైలరు అయినా నా పర్సు కొట్టేసారు అంటే కేడిలకే కేడీలు మీరు అని ఇంద్రుడు (Indrudu) దంపతులను అంటాడు. జ్వాల అందరికీ ఆదర్శంగా ఉండే నువ్వు వీళ్ళ కడుపున ఎలా పుట్టావ్ అమ్మ అని అడుగుతాడు. ఇక ఆ తర్వాత జ్వాల (Jwaala) వాళ్ళిద్దర్నీ ఇంటికి తీసుకొని వెళుతుంది.
ఇక అలా ఇంటికి వెళ్తున్న క్రమంలో జ్వాలా (Jwaala) ఆటో మీద వదిలేదే లే.. అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డైలాగ్ చూసిన జైలరు ఏంటది అని జ్వాలాని అడుగుతాడు. మరి ఈ క్రమంలో రేపటి భాగంలో జ్వాలా ఏం సమాధానం చెబుతుందో చూడాలి.