- Home
- Entertainment
- Karthika Deepam: ఈరోజుతో వంటలక్క, డాక్టర్ బాబుల కథ సమాప్తం.. అక్కచెల్లల్లా స్టోరీ స్టార్ట్!
Karthika Deepam: ఈరోజుతో వంటలక్క, డాక్టర్ బాబుల కథ సమాప్తం.. అక్కచెల్లల్లా స్టోరీ స్టార్ట్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతూ రేటింగ్ లో నెంబర్ 1 గా దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

karthika deepam
హిమ (Hima) సౌందర్య వాళ్ళ ఇంటికి రావడంతో సౌర్య ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతుంది. ఇక సౌందర్య, హిమ సౌర్య ఎక్కడ అని టెన్షన్ పడుతూ ఉంటారు. అంతలోనే సౌర్య (Sourya) రూమ్ లో లెటర్ ఉందని.. అందులో అమ్మ నాన్న చంపిన హిమ ఉంటే ఇంట్లో నేను ఉండలేను అని నన్ను వెతకవద్దని రాసి ఉంటుంది.
karthika deepam
ఇక సౌందర్య (Soundarya) సౌర్యను వెతికే ప్రయత్నం చేస్తుంది. సౌర్య (Sourya) మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక దారినపోయే ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి బండి ఎక్కి వెళుతుంది. ఇక తనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు రావడంతో హిమపై మరింత కోపాన్ని ప్రదర్శిస్తోంది.
karthika deepam
మరోవైపు సౌర్య (Sourya) కోసం సౌందర్య వాళ్లు వెతుకుతూ ఉంటారు. ఇక సౌర్య వెళ్తున్న దారిలో అనాధ పిల్లలు కనిపించడంతో అక్కడ దిగి పోతుంది. ఇక ఆ సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి సౌర్య దొంగగా భావించడంతో అతడికి క్లాస్ పీకి అతడిపై రాయి విసిరి అక్కడి నుంచి పారిపోతుంది.
karthika deepam
మరోవైపు చంద్రమ్మ (Chandramma) ఓ షాప్ దగ్గర దొంగతనం చేస్తూ ఉండగా అదంతా సౌర్య చూసి చంద్రమ్మను వణికిస్తుంది. ఇక చంద్రమ్మ భయపడుతూ ఉంటుంది. సౌర్య చంద్రమ్మ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వెళ్తుంది. జరిగిన విషయం అంతా చంద్రమ్మ ఇంద్రుడితో చెబుతుండగా మళ్లీ సౌర్య (Sourya) వచ్చి బెదిరించి మళ్లీ డబ్బులు తీసుకొని అనాధ పిల్లలకు ఇస్తుంది.
karthika deepam
అదే సమయంలో అక్కడ హిమ (Hima) చూడటంతో సౌందర్యకు చెబుతున్న సమయంలో సౌర్య అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు ఇంద్రుడు, చంద్రమ్మలను కూడా పోలీసులు వెంట పడుతుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత హిమ, సౌర్య (Sourya) పెద్ద వాళ్లు అవుతారు. సౌందర్య ఇంట్లో హిమ పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటాయి.
karthika deepam
హిమ (Hima) సౌర్యను గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక హిమ డాక్టర్ అవుతుంది. మరోవైపు సౌర్య (Sourya) ఆటో డ్రైవర్ గా మారి తనతో అసభ్యంగా మాట్లాడిన వాడిని బాగా చితక్కొడుతుంది. పైగా అతనితో తనకు అక్కచెల్లెల్ల బంధం అనేది నచ్చదని చెబుతుంది. ఇక తన ఆటో మీద వదిలే అంటూ హిమ పై ఉన్న కోపాన్ని చూపిస్తుంది.