- Home
- Entertainment
- Karthika Deepam: కుటుంబం కోసం బంగారం తాకట్టు పెట్టిన వంటలక్క.. అవమానాన్ని తట్టుకోలేకపోతున్న పిల్లలు!
Karthika Deepam: కుటుంబం కోసం బంగారం తాకట్టు పెట్టిన వంటలక్క.. అవమానాన్ని తట్టుకోలేకపోతున్న పిల్లలు!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

కార్తీక్ (Karthik).. పిల్లలిద్దరూ కనిపించకపోయేసరికి తెగ టెన్షన్ పడుతుంటాడు. వెంటనే దీపకు చెప్పటంతో ఇద్దరు కలిసి పిల్లలను వెతుకుతారు. కార్తీక్.. పిల్లలను రుద్రాణి (Rudrani)ఏమైనా చేసిందేమో అని తలచుకుంటూ భయపడతాడు.
ఇక దూరంగా పిల్లలు కనిపించడంతో వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు. హిమ (Hima), సౌర్య (Sourya) బాధపడుతూ మనం ఇంటికి వెళ్ళిపోదాం అని.. మనకు ఎవ్వరూ లేరు అని అందరూ అనుకుంటున్నారు అంటూ అవమానాన్ని తట్టుకోలేక బాధపడతారు.
అన్ని వదిలి ఎందుకు వచ్చాము అని ప్రశ్నిస్తారు. ఇక దీప (Deepa) ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రశ్నలను వెయ్యకూడదు అని అన్నాను కదా మళ్లీ ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటారు. ఇక కార్తీక్ (Karthik) కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉండాలమ్మ అంటూ వారిని ఓదారుస్తాడు.
మరోవైపు రుద్రాణి (Rudrani) దగ్గరకు తన మనిషి వచ్చి శ్రీవల్లి (Srivalli) కొడుకు గురించి మాట్లాడుతాడు. కార్తీక్ వాళ్ళ పిల్లలలో ఎవరినైనా ఒకరిని తీసుకోవాలి అని సలహా ఇవ్వడంతో రుద్రాణి తనకు మంచి ప్లాన్ ఇచ్చావు అన్నట్టు తన మనిషితో చెబుతుంది.
దీప (Deepa), కార్తీక్ (Karthik) రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇక దీప తన పని చూసుకొని వస్తానంటూ.. కార్తీక్ ను అక్కడినుంచి పదేపదే వెళ్ళమని అంటుంది. ఇక కార్తీక్ ఎందుకలా వెళ్ళమంటున్నావ్ అని అడుగుతాడు.
దీప (Deepa) పదేపదే కార్తీక్ బాబు అని పిలవడానికి ఇబ్బంది పడటంతో అప్పుడే ఓ వ్యక్తి పుష్ప సినిమాలో ఓ సామి సాంగ్ వినుకుంటూ వెళ్లడంతో అదే పేరుతో కార్తీక్ ను పిలుస్తుంది. కార్తీక్ ను (Karthik) అక్కడి నుంచి పంపించి తను బంగారం తాకట్టు పెడితే తట్టుకోవని పంపిస్తున్నాను అని అనుకుంటుంది.
ఇక సౌందర్య కార్తీక్ (Karthik) కోసం ఎంక్వయిరీ చేయడానికి పోలీస్ తో మాట్లాడుతుంది. వెంటనే ఆనంద్ రావు (Anadharao) ఫోన్ తీసుకొని ఇదంతా పబ్లిసిటీ చేయొద్దు అని చెబుతాడు. ఇక సౌందర్య తో కార్తీక్ ఇలా దూరంగా ఉండటం మంచిదని ఎందుకంటే మోనిత సమస్య ఉండదని చెబుతాడు.
మరోవైపు దీప (Deepa) తన బంగారంను తాకట్టు పెట్టాలని చూస్తుంది. కానీ రుద్రాణి (Rudrani) కూడా అక్కడ అతడికి చెప్పటంతో అతడు కూడా బంగారం తీసుకోడు. ఇక దీప రుద్రాణి కి ఫోన్ చేసి మాట్లాడటం తో అప్పుడు డబ్బులు ఇస్తాడు. దీప రోడ్డుపై ఒంటరిగా ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది. తరువాయి భాగం లో దీప మెడలో బంగారం లేకపోయేసరికి కార్తీక్ ఏమైంది అని అడుగుతాడు.