Karthika Deepam: అసలు నిజం తెలుసుకున్న దీప.. ఇంద్రుడిని నిలదీసిన సౌందర్య?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో చారుశీల కార్తీక్ తో ఫోన్ మాట్లాడుతూ ఏమీ తెలియనట్టుగా అవునా కార్తీక్ నువ్వు టెన్షన్ పడకు హాస్పిటల్ తీసుకొనిరా అని ధైర్యం చెబుతూ ఉంటుంది. నేను అనుకున్నదే జరిగింది ఈ చారుశీల అంచనాలు ఎప్పుడూ తప్పవు అనుకున్న విధంగానే దీపకి హార్ట్ స్టోక్ వచ్చింది అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. మోనిత మేడం మీరు అనుకున్నది అన్ని సంవత్సరాలుగా చేయలేనిది నేను రెండు రోజుల్లో చేశాను. రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తాను జైల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ దీపని హాస్పిటల్ కి పిలుచుకొని వస్తాడు.
అప్పుడు చారుశీల దీపని చెక్ చేస్తూ నేను ఒకేసారి పైకి పంపియచ్చు కానీ నీ మొగుడు డాక్టర్ కదా అందుకే స్లోగా పైకి పంపించేస్తాను అనుకుంటుంది. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వస్తాడు. మొన్ననే ఆపరేషన్ జరిగింది ఇలా స్ట్రోక్ ఎందుకు వచ్చింది అర్థం కావడం లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల కావాలనే దీపం ముందు గుండె ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు అయ్యాయి గుండె దొరుకుతుంది అని మాట్లాడగా మాట్లాడొద్దు అని అంటాడు కార్తీక్. అప్పుడు చారుశీల కావాలనే అబద్ధం చెబుతూ దీప మత్తులో ఉంది మనం మాట్లాడేది దీప కి వినిపించదు అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండదు అన్న విషయం దీపకు తెలియకూడదు చారుశీల అని మాట్లాడతాడు.
అప్పుడు దీప వైపు చూస్తూ దీప సంతోషంగా ఉన్నది కేవలం కొన్ని రోజులు మాత్రమే వాటిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. మొనిద్దరిచ్చిన తప్పు రిపోర్ట్స్ వల్ల దీపను పదేళ్లపాటు దూరంగా పెట్టాను అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల మోనిత ఇచ్చిన రిపోర్ట్స్ ని నమ్మావు. అప్పుడు నేను ఇచ్చిన రిపోర్ట్స్ నమ్మావు నువ్వు మంచి వాడివి కార్తీక్ అనుకుంటూ ఉంటుంది. యాక్సిడెంట్లో గతం గుర్తు లేక ఎన్నో రోజులు బాధపడ్డాను గతం గుర్తుకు వచ్చిన తర్వాత సంతోషంగా ఉందాము అనుకుంటే తనకు ఇలా జరిగింది అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు కార్తీక్.
నా దీపను కాపాడుకోవడానికి నా ప్రాణాలు ఇచ్చిన తక్కువే అని కార్తీక్ ఎమోషనల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు చారుశీల నీ పిచ్చి కాకపోతే దీప మత్తులో లేదు మెలకువ లోనే ఉంది అనగా అప్పుడు దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరొకవైపు సౌందర్య కాఫీ తాగుతూ ఉండగా ఇంతలోనే సౌర్య అక్కడికి వచ్చి కార్తీక్ రాసి ఇచ్చిన మందు స్లిప్పు చూపించడంతో అది చూసి ఇది మీ నాన్న చేతిరాత అయితే ఎవరు రాసిచ్చారు అని సంతోషపడుతుంది. చారుశీల మేడం రాసిచ్చింది అని అంటుంది. అప్పుడు హిమ అక్కడికి వచ్చి ఆపేయమని చూసి సంతోష పడుతూ లేదు ఇది ఖచ్చితంగా డాడీ చేతిరాతే అని అంటుంది.
అప్పుడు సౌర్య అది చారుశీల మేడం ది అనడంతో హిమ కోప్పడి కాదు ఇది కచ్చితంగా డాడీదే అని వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సౌందర్య ఇంద్రుడిని పిలిచి ఇది నీకు ఎవరు ఇచ్చారు అనగా చారుశీల మేడమ్ ఇచ్చింది అని అంటాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు అబద్దాలు చెబుతూ మీ అబ్బాయి చేతిరాత ఎలా ఉంటుందో నాకు తెలియదమ్మా కానీ ఈ ప్రిస్క్రిప్షన్ చారుశీలం ఇచ్చింది అనంతరం సరేలే నీతో పని ఉంది బయటకు వెళ్దాం పద అని అంటుంది సౌందర్య. అప్పుడు ఇంద్రుడు బయటికి వెళ్లడానికి రెడీ అవగాహన చంద్రమ్మ ఆపి ఆ మేడం నీ నుంచి నిజం రాబట్టడానికి బయటకి పిలుచుకొని వెళ్తుంది ఆ విషయం నీకు అర్థం అవుతుందా అని అంటుంది.
మన మీద అనుమానం వచ్చింది గట్టిగా అడగడానికి పిలుస్తోంది అని అంటుంది చంద్రమ్మ. మరొకవైపు దీపని కార్తీక్ ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు దీపకు ఏమీ తెలియనట్టు నువ్వేం భయపడకు దీప ఇంకా మనకి ఇలాంటి సమస్యలు రావు అని అంటుండగా దీప, కార్తీక్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు దీప హాస్పిటల్ లో జరిగిన విషయాలు తలచుకొని నిజంగా నాకు ఏమీ కాదా డాక్టర్ బాబు అని అడుగుతుంది. అప్పుడు దీప నాకు హార్ట్ స్టోక్ ఎందుకు వచ్చింది అనడంతో కార్తీక్ అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడు దీప తన మనసులో నిన్నటి వరకు మీకు ఏమవుతుందని ఈ గుండె కొట్టుకుంది ఈరోజు నా ప్రాణాలే పోతాయని తెలిసిన తర్వాత ఈ గుండె విశ్రాంతి తీసుకుంటుంది కానీ మిమ్మల్ని విడిచి వెళ్లిపోతాను అన్న బాధ ఒకటి మనసులో ఉంది అనుకుంటూ ఉంటుంది దీప.
ఇంతలోనే పండరి అక్కడికి నీళ్లు తీసుకొని వస్తుంది. అప్పుడు దీప రేపటి నుంచి నేనే వంట చేస్తాను అనగా కార్తీక్ వద్దు అనడంతో పండరి చేయనివ్వండి సారు భర్తకు ఇలా అవుతుందని తెలిసాక ప్రేమతో వండి పెట్టాలని అనుకుంటుంది కదా అని చెబుతుంది. అప్పుడు వద్దు అని కార్తీక్ గట్టిగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప జరిగిన విషయాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నన్ని రోజులు నా భర్తను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య ఆలోచిస్తూ ఇంద్రుడు నా దగ్గర ఏదో నిజం రాస్తున్నాడు అనిపిస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంద్రుడు అక్కడికి రావడంతో చిన్నప్పటి నుంచి నా కొడుకుని చూస్తున్నాను నా కొడుకుని చేతిరాత నేను గుర్తుపట్టలేనా అనడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు.
ఖచ్చితంగా ఆ ప్రిస్క్రిప్షన్ రాసిందే నా కొడుకే అని అంటుంది సౌందర్య. కాకపోతే నాకు ఒక డౌట్ వాళ్ళు మా నుంచి తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నారు అని సౌందర్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సౌందర్య ఇంద్రుడు కాలర్ పట్టుకుని నాటకాలు నా దగ్గర ఆడొద్దు నీకు అన్ని విషయాలు తెలుసు అని నాకు తెలుసు ఇప్పుడు ఇంద్రుడు బుఖాయిస్తూ పట్టుకుని అడిగినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి ఉన్నారని ఎలా చెప్పాలి అనడంతో వాళ్లు బతికే ఉన్నారు అని గట్టిగా చెబుతుంది సౌందర్య.