MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? తొలి చిత్రంతోనే ఫిదా, కనీసం ఆమె పేరు కూడా తెలియదు

సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? తొలి చిత్రంతోనే ఫిదా, కనీసం ఆమె పేరు కూడా తెలియదు

సౌందర్య అద్భుతమైన అందం, అత్యద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. మరి ఆమెకి ఇష్టమైన నటి ఎవరో తెలుసా?

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 09 2025, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చీరకి అందం తెచ్చిన నటి సౌందర్య
Image Credit : Soundarya

చీరకి అందం తెచ్చిన నటి సౌందర్య

సహజమైన సౌందర్యంతో ఆకట్టుకుంది సౌందర్య. అంతేకాదు, అంతే సహజమైన నటనతోనూ మెప్పించింది. సావిత్రి తర్వాత అంతటి గొప్ప నటిగా రాణించింది సౌందర్య. తెలుగు హీరోయిన్లు గ్లామర్‌ షోతో రెచ్చిపోతున్న సమయంలోనూ కూడా ట్రెడిషనల్‌ లుక్ లోనే కనిపించి ఆకట్టుకుంది. 

ఇంకా చెప్పాలంటే చీరకి అందం తెచ్చిన నటి సౌందర్య. తాను నటించిన సినిమాల్లో గ్లామర్‌ లేదనే ఆలోచనే రాకుండా చేసింది. అంతటి అద్భుతమైన అభినయంతో మెప్పించి తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బలవంతంగా సినిమాల్లోకి వచ్చిన సౌందర్య
Image Credit : our own

బలవంతంగా సినిమాల్లోకి వచ్చిన సౌందర్య

సౌందర్య.. సినిమా ఎంట్రీ అనుకోకుండా జరిగిందనే విషయం తెలిసిందే. టెంన్త్ అయిపోయాక సడెన్‌గా ఓ రోజు తన తండ్రి వచ్చి ఆమెని షూటింగ్‌కి తీసుకెళ్లాడట. ఇలా సినిమాల్లో చేయాలని చెబితే తనకు ఇష్టం లేదని ఏడ్చిందట. అయినా వినలేదు వాళ్ల ఫాదర్‌. షూటింగ్‌ వెళ్లాక వాళ్లు మేకప్‌ వేసి ఎలా చేయమని చెబితే, అలా చేసి వచ్చిందట. అలా కన్నడ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

35
సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్‌
Image Credit : Savitri

సౌందర్యకి ఇష్టమైన హీరోయిన్‌

ఓ ఇంటర్వ్యూలో సౌందర్య మాట్లాడుతూ తనకిష్టమైన హీరోయిన్‌ ఎవరో చెప్పింది. సావిత్రి అంటే ఇష్టమని తెలిపింది. తాను చూసిన మొదటి సినిమాతోనే ఆమెకి ఫిదా అయ్యిందట సౌందర్య. అప్పటికీ తాను స్కూల్‌ చదివే ఏజ్‌, సినిమాలంటే ఏంటో కూడా తెలియదు. ఆ సమయంలో బెంగుళూరులో మొదటిసారి తెలుగు సినిమా చూసింది. అదే `మాయా బజార్‌`.

45
సావిత్రి ప్రెట్టీగా, చబ్బీగా ఉండేది
Image Credit : social media

సావిత్రి ప్రెట్టీగా, చబ్బీగా ఉండేది

ఈ మూవీ తనకు బాగా నచ్చిందట. ముఖ్యంగా సావిత్రి ఇంకా బాగా నచ్చిందట. ఆ టైమ్‌కి ఆమె సావిత్రి అని సౌందర్యకి తెలియదు. తర్వాత ఆమె గురించి చెప్పారట. కానీ ఆమె నటనకు ఫిదా అయ్యింది. 

తర్వాత సావిత్రి నటించిన `గుండమ్మ కథ`, `మిస్సమ్మ` చిత్రాలు చూసినట్టు తెలిపింది సౌందర్య. ఆమె అందంగా, చబ్బీగా ఉండేదని, ఆమెని అలా చూసి ముచ్చటేసిందని తెలిపింది. అంతేకాదు సావిత్రి చాలా ఎక్స్ ప్రెసివ్‌ అని, ఆమె నటనకు అప్పుడే ఫిదా అయినట్టు తెలిపింది సౌందర్య.

55
సౌందర్య జీవితం విషాదం
Image Credit : our own

సౌందర్య జీవితం విషాదం

సావిత్రి తర్వాత చాలా మంది హీరోయిన్లు వచ్చారు. కానీ ఎవరికీ ఆ స్థాయి ఇమేజ్‌ రాలేదు. అప్పట్లో చాలా మంది సౌందర్యని మరో సావిత్రిగా అభివర్ణించారు. సౌందర్య చిన్న ఏజ్‌(31)లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. 2004లో హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సౌందర్య
సావిత్రి (నటి)
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image2
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image3
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Related Stories
Recommended image1
సితారని ప్లాన్‌ చేయలేదు, అనుకోకుండా జరిగింది.. కూతురు గురించి నమ్రత చెప్పిన నిజం
Recommended image2
బాలయ్య కోసం సాహసం చేయబోతున్న గోపీచంద్ మలినేని.. మూవీ బ్యాక్ డ్రాప్ అదేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved