- Home
- Entertainment
- Savitri Mistake: జెమినీ గణేషన్ మోసం కాదు, సావిత్రి చేసిన తప్పు ఇదే, లేదంటే రాణిలా వెలిగేది?
Savitri Mistake: జెమినీ గణేషన్ మోసం కాదు, సావిత్రి చేసిన తప్పు ఇదే, లేదంటే రాణిలా వెలిగేది?
Savitri Mistake: మహానటి సావిత్రి భర్త నుంచి మోసపోయింది. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకుంది. అది ఆమెజీవితాన్నే నాశనం చేసింది. అదేంటంటే?

Actress Savitri
Savitri Mistake: మహానటి సావిత్రి చాలా పేద కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే హీరోయిన్‌గా ఎదిగి, స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఎంత వేగంగా ఎదిగిందో, అంతే వేగంగా పడిపోయింది. ఆమె జీవితమే విషాదాంతంగా ముగిసింది. సావిత్రి జీవితం సినిమా రంగంలో ఉన్న ఎంతో మందికి గుణపాఠంగా చెబుతుంటారు. మరి సావిత్రి చేసిన తప్పేంటి?
Savitri
సావిత్రి.. జెమినీ గణేషన్‌తో ప్రేమలో పడింది, ఆయనకు మ్యారేజ్ అయ్యిందని తెలిసినా, రెండో పెళ్లిచేసుకుంది. ఆయన మోసం చేశాడని చెప్పి డిప్రెషన్‌లోకి వెళ్లింది. తాగుడుకి బానిస అయ్యింది, దీనికితోడు ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్ మరింతగా డీలా పడేశాయి. సావిత్రి ఆర్థికంగా, మానసికంగా డౌన్ అయిపోయింది. దీంతో తాగుడుకి బానిసగా మారి తన జీవితాన్నే నాశనం చేసుకుంది.
Savitri
అయితే ఇది మాత్రమే కాదు, సావిత్రి కెరీర్ రాంగ్ రూట్‌లో వెళ్లడానికి, ఆమె డౌన్ కావడానికి, ఆర్థికంగా, మానసికంగా మరింత డౌన్ కావడానికి మరో కారణం ఉంది. అదే దర్శకురాలిగా మారడం. ఆమె కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే దర్శకురాలిగా మారింది. నిర్మాతగానూ టర్న్ తీసుకుంది. జెమినీ గణేషన్‌కి తెలియకుండా ఆమె డైరెక్షన్ చేసింది, తానే సినిమాలు నిర్మించింది. ఆయన చెప్పినా వినకుండా సినిమాలు చేసి బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ మరింతగా పెరిగింది.
నటిగా స్టార్‌గా వెలిగిన ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా బాధలు పడటం ఏ ఆర్టిస్ట్ కైనా చాలా ఇబ్బందికరమైన విషయం. తాజాగా దర్శకుడు, నటుడు హర్షవర్థన్ ఈ విషయాన్ని తెలిపారు. నటుడిగా చేయడం సుఖం. దర్శకులుగా మారితే,అవి ఆడకపోతే మానసికంగా చాలా డౌన్ అయిపోతాం, ప్రశాంతత కోల్పోతాం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాం. సావిత్రి విషయంలో అదే జరిగిందన్నారు. అసలే భర్త విషయంలో, ఫ్యామిలీ విషయంలో ఆమె ఇబ్బందుల్లో ఉంది. దీనికితోడు ఇలా డైరెక్షన్ చేసి, నిర్మాతగా మారి చాలా డబ్బులు కోల్పోయింది. నటిగా అవకాశాలను కూడా కోల్పోయింది. ఇదంతా ఆమెకి పెద్ద దెబ్బగా మారిందన్నారు హర్షవర్థన్. అలా కాకుండా మంచి పాత్రలు చేసేందుకు ప్రయారిటీ ఇచ్చి ఉంటే, ఆమె కెరీర్ మరోలా ఉండేదని, ఉన్నంత కాలం రాణిలా వెలిగేదన్నారు నటుడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సావిత్రి మూడు దశాబ్దాలపాటు నటిగా ఉంది. 250కిపైగా సినిమాలు చేసింది. దర్శక, నిర్మాతగా `ప్రాప్తం`, `మాతృ దేవత`, `చిన్నారి పాపలు`, `కుజాండై ఉల్లం`, `వింత సంసారం` వంటి సినిమాలను రూపొందించింది. ఇందులో దాదాపు అన్నిసినిమాలు పరాజయం చెందాయి.
read more: HHVM Surprise: `హరిహర వీరమల్లు` ఫస్టాఫ్ రెడీ, పవన్‌పై షూట్ చేయాల్సింది ఎన్ని రోజులంటే?
also read: Akhanda 2 ` గూస్‌బంమ్స్ అప్‌డేట్.. బాలయ్యకి విలన్‌గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?