- Home
- Entertainment
- Kavya Maran Gift : సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారాన్ని బహుమతిగా ఇచ్చిన కావ్య మారన్... నెటిజన్ల ప్రశంసలు
Kavya Maran Gift : సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారాన్ని బహుమతిగా ఇచ్చిన కావ్య మారన్... నెటిజన్ల ప్రశంసలు
Kavya Maran Gift to Employees : కావ్య మారన్, అనిరుధ్ వివాహం సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. దీనితో సన్ గ్రూప్ ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఉద్యోగులకు బహుమతులు ఇచ్చిన కావ్య మారన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ తన వెడ్డింగ్ రిసెప్షన్‌కు ముందే ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో వివాహం సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఆమె స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. బంగారు ఉంగరాలు, గోల్డ్ కాయిన్స్, చాక్లెట్స్, పెళ్లి పత్రికలను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కావ్య చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వైరల్ వీడియోల్లో ఉద్యోగులు గిఫ్ట్ బాక్స్‌లు ఓపెన్ చేసి చూడటం కనిపిస్తోంది. ఆ బాక్స్‌లలో పెళ్లి పత్రిక, చాక్లెట్లు, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసిన ఒక వీడియోలో, ఓ ఉద్యోగి తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం వినొచ్చు. తమిళనాడులోని సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు అందించారు.
నవంబర్ 25న ప్రత్యేక విందుకు ఆహ్వానం
గిఫ్ట్ బాక్స్‌లో ఉన్న పెళ్లి పత్రికలో నవంబర్ 25న మధ్యాహ్నం ప్రత్యేక విందు ఉన్నట్లు రాసుంది. ఇది సన్ గ్రూప్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్. ఉద్యోగులకు బంగారం బహుమతిగా ఇచ్చి, తన పెళ్లి రిసెప్షన్‌కు కావ్య మారన్ ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు, అనిరుధ్, కావ్యల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నవంబర్ 21న (ఈరోజు) చెన్నైలో జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
Telungu side Ring…
Tamil side coin …
#kavyamaran
#anirudhkavyamaran https://t.co/3UlVc5wQ5m
— Hema.R (@HemaRe6) November 21, 2026
గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ - కావ్య వివాహం
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్‌లో జరిగిన అందమైన వేడుకలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ జంట ఆత్మగౌరవ వివాహ పద్ధతిని (సెల్ఫ్-రెస్పెక్ట్ మ్యారేజ్) పాటించినట్లు సమాచారం. ఈ పద్ధతిలో పెళ్ళికి పురోహితులు అవసరం లేదు. సప్తపది లాంటి సంప్రదాయ ఆచారాలు కూడా తప్పనిసరి కాదు.
ఈ పద్ధతి ప్రకారం, వధూవరులు ఇద్దరూ అంగీకరించి భార్యాభర్తలుగా ఒకరినొకరు స్వీకరిస్తున్నట్లు ప్రకటించవచ్చు. బంధువులు, స్నేహితులు లేదా ఇతరుల సమక్షంలో దండలు లేదా ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకోవచ్చు.
ఈరోజు చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్?
కొత్త పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ నూతన దంపతులు ఈరోజు, నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు క్రికెట్, సినిమా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. పెళ్లి సందడి మధ్యలో ఉద్యోగులకు కావ్య మారన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.















