- Home
- Entertainment
- Karthika Deepam: హిమను వదులుకోలేకపోతున్న నిరుపమ్.. మరో దరిద్రం వెంటాడుతుందంటున్న స్వప్న!
Karthika Deepam: హిమను వదులుకోలేకపోతున్న నిరుపమ్.. మరో దరిద్రం వెంటాడుతుందంటున్న స్వప్న!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌందర్య (Soundarya) చేసిందంతా చేసి.. మా పరువు తీసి ఇప్పుడు సూట్కేస్ సర్దుకొని వెళతాను అంటే నేను ఎలా ఊరుకుంటాను అని హిమ (Hima) ను అంటుంది. ఎందుకు పెళ్లి వద్దు అన్నావో చెప్పాకే.. ఇంట్లో నుంచి కదలాలని సౌందర్య అంటుంది.
నీకు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పు కానీ నాకు సమాధానం కావాలి హిమ (Hima).. అని సౌందర్య అంటుంది. దాంతో హిమ సౌందర్య ను కౌగిలించుకుంటుంది. మరోవైపు సౌర్య (Sourya) ఆనందంతో స్టెప్పులు వేస్తూ ఉంటుంది. అది చూసిన ఇంద్రుడు, చంద్రమ్మ లు ఆశ్చర్యపోతారు.
ఇక సౌర్య (Sourya) ఇంద్రుడు, చంద్రమ్మ లకు వాళ్ల అవసరాలకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చీరాని ఇంగ్లీషు తో అదరగొడుతూ ఉంటుంది. మరోవైపు స్వప్న (Swapna) నా పెంపకం మీద నాకు చాలా నమ్మకం ఉండేది కానీ నువ్వు రాత్రి ఆ ఆటోలో దిగినప్పుడు ఆ నమ్మకం మొత్తం పోయింది అని నిరూపమ్ తో అంటుంది.
ఇక ఒక దరిద్రం పోయింది అంటే మరో దరిద్రం చుట్టుకుంది అన్నిటినీ దారిలో పెడతాను అని స్వప్న (Swapna) మనసులో అనుకుంటుంది. అంతేకాకుండా హిమ గురించి నువ్వు ఆలోచించకు అని చెబుతుంది. మరోవైపు నా లైఫ్ కి ఏమీ కాదు నా జీవితానికి డాక్టర్ సాబ్ ఉన్నాడు అని జ్వాల (Jwala ) మురిసిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత నిరూపమ్ (Nirupam) కారును చూడ్డానికి వస్తోంది. ఇక నిరూపమ్ కూడ అక్కడే ఉంటాడు. ఇక నిరూపమ్ రాత్రి నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టనా? అని అడుగుతాడు. ఇక జ్వాల (Jwala) మనసులో ఆనంద పడుతూ సంతోష పెట్టారు అని అనుకుంటుంది. ఇక మీరు ఏమన్నా నేను పడతాను డాక్టర్ సాబ్ అని అంటుంది.
ఇక తరువాయి భాగంలో హిమ (Hima) నిరూపమ్ దగ్గరకు వచ్చి ఎంత మాట్లాడదామని ప్రయత్నించినా నిరూపమ్ (Nirupam) ఒక ఫైల్ అడ్డంపెట్టుకుని మొహం తిప్పుకొని ఉంటాడు. ఇక మాట్లాడు బావా అని హిమ ఆ ఫైల్ లాగుతుంది. దాంట్లో మొత్తం హిమ ఫోటోలు ఉంటాయి. మరోవైపు సౌందర్య సౌర్య ను అర్ధాంతరంగా కారు లో ఎక్కించుకొని వెళుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.