MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: హిమను కిడ్నాప్ చేసిన మోనిత.. కోపంతో తగిలిపోతున్న దీప, సౌందర్య?

Karthika Deepam: హిమను కిడ్నాప్ చేసిన మోనిత.. కోపంతో తగిలిపోతున్న దీప, సౌందర్య?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
| Updated : Jan 20 2023, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇప్పుడు నువ్వు ఏదో చేస్తావని నేను భయపడను. అయినా పోయేదానివీ పోకుండా నీకెందుకు ఈ తాపత్రయం అనగా నేను పోతానే కానీ నీలాంటి రాక్షసుల మీద నా భర్త మీద పడకూడదు అంటుంది దీప. రాక్షసురాలని కాదు దీప ప్రేమికురాలిని, నా గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు. ఇన్ని రోజుల నుంచి పిచ్చిగా ప్రేమిస్తోంది నేను పోయేటప్పుడు నా భర్తను దీనికి అప్పగించాలి అని నీకు ఆలోచన రావడం లేదా అంటుంది. అలాంటి ఆలోచన తీసెయ్ అనగా నువ్వు ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు పోయేటప్పుడు ఏం చేస్తావు అని అంటుంది మోనిత. పోయేలోపు నాకు డాక్టర్ బాబు వైపు కూడా చూడకుండా చేసి పోతాను అనగా అంటే నీ మొగుడికి ఇంకొక పెళ్లి చేస్తావా, ప్రేమగా తాళి కట్టిన నీతోనే మూడు రోజులు కూడా కాపురం చేయకుండా చేశాను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 ఇంకొక దాన్ని తెచ్చి చేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా అంటుంది మోనిత. ఈరోజు నడిరోడ్లో కళ్ళు తెరిచావు ఈసారి పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తే నరకంలో కళ్ళు తెరుస్తావు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. ఆ తర్వాత మౌనిత తన ఇంట్లోకి వెళ్లి వస్తువులన్నీ విసిరేస్తూ కోపంతో రగిలిపోతూ నన్నే అందరి ముందు అవమానిస్తావా నిన్ను చంపేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య దీపని కాపాడుకునే అవకాశం లేదా ఇప్పుడు కూడా దీప అదే ధైర్యంతో ఉంది అనుకుంటూ ఉంటుంది సౌందర్య. ఇంతలోనే అక్కడికి భాగ్యం వచ్చి వదినగారు బాగున్నారా అని పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య మాట్లాడడానికి గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది భాగ్యం. ఇంతలోనే దీప వారణాసి అక్కడికి రావడంతో భాగ్య దీపను ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది.
 

37

అయినా నువ్వు లిస్టు తీసుకోమంటే ఎక్కడికి వెళ్లావు దీప అని సౌందర్య అడగక ఆ మోనిత దగ్గరికి వెళ్లాను నా జోలికి నా కుటుంబం జోలికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వివరించి వచ్చాను అత్తయ్య అంటుంది. ఇంతలోనే అక్కడికి సౌర్యహిమను వెతుక్కుంటూ వస్తుంది. హిమ లేదు శౌర్య బయటకు వెళ్ళింది అని భాగ్యం అనగా నీకు ఎలా తెలుసు అని సౌందర్య అనడంతో, నేను వస్తున్నప్పుడు గేటు దగ్గర నా మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి అడ్రస్ చెప్పు అని అక్కడికి వెళ్ళిపోయింది వదిన గారు అంటుంది. అప్పుడు దీప సౌందర్య ఫోన్ తో ఆ నెంబర్ కి ఫోన్ చేయగా అది మోనిత నెంబర్ అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
 

47

ఆ తర్వాత కార్తీక్, దీప, సౌందర్య ముగ్గురు హిమా కోసం వెళ్లగా అక్కడ మౌనిత ఇంటి దగ్గర టూలేట్ బోర్డు ఉండడం చూసి ఎక్కడికి వెళ్లారు అని టెన్షన్ పడుతూ ఉంటారు. పొద్దున నేను దాన్ని మంచం తో పాటు నడి రోడ్డులో పడుకో పెట్టాను డాక్టర్ బాబు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో ఇట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ మోనిత చెప్పినట్టు చేయను అనడంతో లోపలే ఉన్న మోనిత చూసావా హిమ మీ నాన్న ఎలా చెబుతున్నాడో నేను చెప్పినది చేయను అంటున్నారు అంటుంది. అప్పుడు లోపలే ఉండి హిమను రెచ్చగొడుతూ ఉంటుంది. బయట దీప  ఎలా అయినా నా కూతురు నా దగ్గర రావాలి అని కార్తీక్ మీద ఫైర్ అవుతూ ఉండగా నువ్వు టెన్షన్ పడకు దీప దాన్ని ఎక్కడ ఉన్నా జుట్టు పట్టుకుని లాక్కొని వస్తాను అని అంటుంది సౌందర్య.
 

57

 దాని సంగతి చూస్తాను ఫస్ట్ వెళ్దాం పదండి అని అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదంతా హిమ,మోనిత లోపలి నుంచి చూస్తూ ఉంటారు. చూసావు కదా హిమ నామీద ఎంత కోపంగా ఉన్నారో పైగా నేను నిన్ను తీసుకొచ్చాను అని అంటున్నారు అనగా నన్ను ఎందుకు ఆపాలంటే నేను అప్పుడే వెళ్లి దాన్నేకదా అంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆంటీ అనడంతో మనం ఇక్కడే ఇలాగే ఉండి ఇక్కడి నుంచి మనం మీ డాడీని ఒప్పించేలా చేద్దాము అందుకోసం నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అంటుంది మోనిత. అప్పుడు హిమ ఆ మోనిత మాటలు పిచ్చిగా నమ్ముతూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య మోనిత మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెబుతుంది. అప్పుడు దీప మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే మోనిత సౌందర్య కి ఫోన్ చేయడంతో మర్యాదగా అడుగుతున్నాను నా కూతురు హిమ ఎక్కడ ఉంది అని అడగగా నా చేతిలోనే హాయిగా సేఫ్ గా ఉంది అంటుంది మోనిత.

67

నువ్వు నా ప్రపోజల్ కీ ఒప్పుకునేంతవరకు హిమను వదిలిపెట్టను అని అంటుంది. నేను చచ్చేలోపు నేను నాతో పాటు తీసుకెళ్తాను అనడంతో హిమ నా దగ్గర ఉంది జాగ్రత్తగా మాట్లాడు ఉంటుంది మోనిత. అప్పుడు మోనిత ఒకటే చెబుతున్నాను దీప నా దగ్గరికి వచ్చి నీ భర్తను నాకు అప్పగించి నా మెడలో తాళి కట్టించి వెళ్ళిపో అప్పుడు నీ కూతుర్ని నీకే ఇస్తాను అని అనగా సౌందర్య భాగ్యం కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరొకవైపు మోనిత హిమ కోసం భోజనం తీసుకుని వెళ్ళగా నాకు వద్దు ఆంటీ నాకు కొంచెం భయంగా ఉంది అమ్మ కు ఎప్పుడు ఏమవుతుందో అని భయంగా ఉంది అనడంతో ఏం కాదు హిమ ధైర్యంగా ఉండు మీ అమ్మ బతకడం కోసమే కదా మనం ఇదంతా చేస్తోంది అంటుంది మోనిత. ఇప్పుడు మోనిత హిమకి మరిన్ని మాయ మాటలు చెప్పి హిమను నమ్మిస్తూ ఉంటుంది.
 

77

అప్పుడు హిమ మా అమ్మకు చెప్పకుండా వచ్చాను నాకోసం ఎంత టెన్షన్ పడుతుందో ఆంటీ అని అనగా సరే హిమ నువ్వు వెళ్ళిపోతావేమో వెళ్ళిపో మీ అమ్మ ప్రాణాలతో ఉండదు అంటూ హిమను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది మోనిత. అప్పుడు హిమకు మాయ మాటలు చెప్పి తినిపిస్తుంది మోనిత. మరోవైపు సౌందర్య,దీప,కార్తీక్ ముగ్గురు మోనిత గురించి ఆలోచిస్తూ మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. టెన్షన్ పడకు దీప అది హిమను ఏం చేయదు అని అంటాడు కార్తీక్. ఇంతలోనే సౌర్య అక్కడికి వచ్చి ఏంటి నాన్న మళ్ళీ ఆ హిమ ఇలాంటి పని చేస్తుందా అప్పుడు వద్దంటే కార్ డ్రైవింగ్ చేసింది ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని ఇలా చేస్తోంది అందుకే నాకు అదంటే అసహ్యం అని అంటుంది. ఇది పెద్దల విషయం అని దీప అనడంతో చేసింది చిన్న పిల్ల కదా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సౌర్య. ఇంతలోనే వారణాసి దీపకీ ఫోన్ చేసి మీ అనుమానం నిజమే దీపక్క మోనిత ఇంట్లోనే ఉంది అని అంటాడు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved