MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్, దీప బ్రతికున్నారని తెలుసుకున్న ఆనంద్ రావు.. మోనితపై కార్తీక్ అనుమానం?

Karthika Deepam: కార్తీక్, దీప బ్రతికున్నారని తెలుసుకున్న ఆనంద్ రావు.. మోనితపై కార్తీక్ అనుమానం?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 19 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 19 2022, 07:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజు ఎపిసోడ్లో సౌర్య తినకుండా సౌందర్య కోసం ఎదురు చూస్తూ ఉండగా చంద్రమ్మ తినమని అడుగుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఇంద్రుడు రావడంతో ఎక్కడికి వెళ్లావు అని చంద్రమ్మ అడగగా పదేపదే ఈ ఊరికి రాలేము కదా అందుకే చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటున్నాను వెళ్దాం పదండి అనడంతో ఎక్కడికి వెళ్ళేది జ్వాలమ్మ రాను అంటోంది అని అనగా ఎందుకు అనటంతో అప్పుడు జరిగింది మొత్తం వివరిస్తుంది చంద్రమ్మ. అప్పుడు ఏం చేయాలి అని ఇంద్రుడు దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు. జ్వాలమ్మ ముందు అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది అని ఇంద్రుడు బాధపడుతూ సౌర్య దగ్గరికి వెళ్తాడు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అప్పుడు సౌర్య దగ్గరికి వచ్చిన ఇంద్రుడు తొందరగా తిన్నమ్మ బయలుదేరుదాం మీ నానమ్మ ఇక్కడికి రావడం లేదు అని అనడంతో లేదు బాబాయ్ నానమ్మ ఒక్కసారి చెప్పింది అంటే ఆ మాటను తప్పదు బాబాయ్ అని అంటుంది. అప్పుడు ఇంద్రుడు మీ నానమ్మ ఇందాక దారిలో కనిపించింది తాను ఇక్కడికి రావడం లేదు అని నాతో చెప్పింది సౌర్యమ్మ అని అంటాడు ఇంద్రుడు. తనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే రాని అని చెప్పింది అనటంతో శౌర్య ఎమోషనల్ అవుతుంది. అప్పుడు సౌర్య ఎమోషనల్ అవుతూ అమ్మానాన్నలు కనిపించే అంతవరకే ఇక్కడ ఉంటాను బాబాయ్ కనిపించిన తర్వాత తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి పోతాను కదా అనటంతో ఇంద్రుడు దంపతులు షాక్ అవుతారు.
 

36

ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు సౌందర్యకి,ఆనంద్ రావు టాబ్లెట్స్ ఇవ్వగా అప్పుడు జరిగింది మొత్తం తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య నన్ను తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి హైదరాబాద్ శివారులో వదిలిపెట్టింది అంటే అది మామూలు ఆడది కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు సౌందర్య, ఆనందరావు. ఇప్పుడు సౌందర్య ఆనందరావు మాట్లాడుతూ ఆ మోనిత ప్రవర్తన శౌర్య అన్న మాటలను బట్టి చూస్తే  నిజంగానే కార్తీక్ దీప లు ఆ ఊర్లో ఉన్నారని నాకు అనిపిస్తోంది అంటుంది సౌందర్య. కార్తీక్,దీప లు బతికే ఉన్నారేమో కార్తీక్ మోనిత దగ్గర ఉండటం వల్ల నా తల పగలగొట్టిందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య.

46

 అప్పుడు వాళ్ళిద్దరూ  కార్తీక్ దీప లు ఇద్దరు బతికే ఉన్నారు అన్న విషయాన్ని తలుచుకుని ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు మోనిత దేవుడి దగ్గర స్వామి నిన్ను ప్రతిరోజు నిన్ను కోరికలు అడిగి నిన్ను విసిగించను నా ప్రయత్నాలు చేసిన తర్వాతే నేను నీ వరకు వస్తాను కానీ కార్తీక్ గతం గుర్తుకు వచ్చిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడిని మోనిత ప్రార్థిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దుర్గ వచ్చి నాకు కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి రేయ్ దేవుడికి కూడా మనశ్శాంతిగా పూజ చేసుకోనివ్వరా ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నావు నేను ఇంకేం పాపం చేశాను రా అని అంటుంది మోనిత.
 

 

56

ఇప్పుడు మోనిత సౌందర్య తల పగలగొట్టిన విషయం దుర్గ అడగడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మోనిత నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అనడంతో వెంటనే దుర్గ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. మరొకవైపు సౌందర్యకు డాక్టర్ కట్టు కడుతూ ఉంటాడు. అప్పుడు కొద్ది రోజులపాటు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది డాక్టర్. అప్పుడు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత సౌందర్య ఆనంద్ రావులు మోనిత గురించి మాట్లాడుకుంటూ ఏ ఆడది చేయని పనులన్నీ మోనిత చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు మోనిత కార్తీక్ దీపల గురించి వీళ్లు ఇంత క్లోజ్ అయ్యారు ఏంటి నా ఇంట్లో కలిసి ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది.
 

66

ఏదో ఒకటి చేసి కార్తీక్ నుంచి పిలుచుకొని వెళ్లాలి లేదంటే సౌందర్య ఆంటీ వస్తే నా పని అయిపోతుంది అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి శివ వస్తాడు. అప్పుడు శివ మోనిత ను వెతికారంగా మాట్లాడిస్తూ ఆవిడను హైదరాబాద్ తీసుకెళ్లే వరకు నేను టెన్షన్ తో చచ్చిపోయాను మేడం అని అంటాడు. అప్పుడు శివ ఏం అడిగినా మాట్లాడకుండా మోనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మోనిత లక్ష ఇచ్చి శివను ఇంకొకసారి ఆ ప్రశ్నను అడగొద్దు అంటుండగా ఇంతలో కార్తీక్ వచ్చి ఆ డబ్బులు లాక్కుంటాడు. అప్పుడు ఎందుకు మోనిత ఇంత డబ్బులు ఇస్తున్నావు అనడంతో మోనిత కావాలనే కార్తీక్ ను అనుమానిస్తూ కార్తీక్ ని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలని చూస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Cannes: రాకుమారిలా అలియా భట్.. గ్రీన్ గౌను వేసుకుని కేన్స్‌లో మెరుపులు..
Recommended image2
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image3
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved